jee results
-
2026 JEE ఫలితాలు వచ్చేశాయి…ఈ ర్యాంకుతో మీ భవిష్యత్తు నిర్ణయించబడుతుందా? - నెక్స్ట్ వేవ్ సీఈఓ రాహుల్ అత్తులూరి అభిప్రాయం
దాదాపు 14.5 లక్షల మంది విద్యార్థులు తమ ర్యాంకులు చూసుకుంటున్న ఈ సమయంలో… అసలు భవిష్యత్తును నిర్ణయించేది ఏంటో తెలుసుకుందాం. – రాహుల్ అత్తులూరి, సీఈఓ మరియు కో-ఫౌండర్, నెక్స్ట్ వేవ్. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు.నెలల తరబడి కఠినమైన ప్రిపరేషన్, నిద్రలేని రాత్రులు, కేవలం ఒక జేఈఈ అభ్యర్థికి మాత్రమే తెలిసిన ఆ ఒత్తిడి.. వీటన్నిటి తర్వాత మొత్తానికి ఈరోజు రిజల్ట్స్ వచ్చేశాయి.మీలో కొందరికి ఈరోజు పండగలా ఉండొచ్చు. కానీ చాలామందికి అనుకున్న ఫలితం రాకపోయి ఉండొచ్చు. స్కోరు చూసిన తర్వాత కలిగే బాధ ఉందే… అది మీరు ఇప్పటిదాకా మోసిన ఏ బరువు కంటే కూడా చాలా ఎక్కువగా అనిపించవచ్చు.మీరు అలా ఫీలవ్వడం సహజమే.కానీ ఒక్క నిమిషం ఆగి మీరు ఏం చేశారో ఆలోచించండి. మీరు పోరాడారు, కష్టపడ్డారు, మీ తప్పు లేకుండా ప్రయత్నించారు. ఆ ప్రయత్నం ఒక్కటి చాలు మిమ్మల్ని అభినందించడానికి.మీ జేఈఈ ర్యాంక్ బట్టి మీరేంటో డిసైడ్ చేసేసుకోకండి. ఒక్కసారి నేను చెప్పే విషయం ఆలోచించండి. ఈ ఏడాది సుమారుగా 14.5 లక్షల మంది జేఈఈ రాశారు. ఉన్న ఐఐటీ సీట్లు మాత్రం సుమారుగా 18,000 మాత్రమే. అంటే ప్రతి వంద మందిలో ఒక్కరికి మాత్రమే సీటు వస్తుంది.మరి మిగిలిన 99 శాతం మంది పరిస్థితి ఏంటి? వాళ్లంతా ఫెయిల్ అయినట్టా? వాళ్లకు తెలివితేటలు లేవనా? వాళ్లు ఇక దేనికి పనికిరారని అర్థమా?ఖచ్చితంగా కాదు!అసలు జేఈఈ అంటే ఏంటో నిజాయితీగా మాట్లాడుకుందాం.జేఈఈ అనేది ఒక 'ఫిల్టర్' మాత్రమే. ఉన్న కొన్ని సీట్లను నింపడానికి పెట్టిన ఒక పద్ధతి. అంతే తప్ప, మీ తెలివితేటలను జడ్జ్ చేయడానికి పెట్టింది కాదు ఇది. సాధారణంగా మంచి ర్యాంకు ఉంటేనే తెలివైనవాళ్లు అని అందరూ అనుకుంటారు, కానీ మీలో ఉన్న టాలెంట్‌ను కొలవడానికి ఇది సరైన కొలమానం కాదు. మీలాంటి యువకుల జీవితం ఎలా ఉండాలో డిసైడ్ చేయడానికి అసలే కాదు.అయినా సరే, లక్షలాది కుటుంబాలు ఈ ఒక్క ఎగ్జామ్ చుట్టూనే తమ పిల్లల జీవితాలను తిప్పుతున్నాయి. కానీ రిజల్ట్స్ రోజున ఎవరూ బయటకు చెప్పని ఒక చేదు నిజం ఉంది. ఒక విద్యార్థి ఐఐటీలో సీటు సాధించాడా లేదా అన్నదానికి, వాళ్లు భవిష్యత్తులో ఎంత సక్సెస్ అవుతారన్నదానికి అసలు సంబంధం లేదు.ఐఐటీలో చదవకపోయినా సరే.. అద్భుతమైన కెరీర్ బిల్డ్ చేసుకున్న వాళ్లని, టాప్ పొజిషన్లలో ఉన్నవాళ్లని, విజయవంతంగా స్టార్టప్‌లను నడుపుతున్న వాళ్లని నేను చాలా మందిని చూశాను. వాళ్లకు అప్పట్లో వచ్చిన జేఈఈ ర్యాంకుకు, ఈరోజు వాళ్లు ఉన్న పొజిషన్‌కు అసలు పోలికే లేదు.ఈ ఒక్క రోజుతో అంతా అయిపోలేదు.. ఇదొక కొత్త మలుపు మాత్రమే.ర్యాంకు పైన కాకుండా, స్కిల్స్ మీద ఫోకస్ పెట్టడమే ఇప్పుడు మీరు తీసుకోబోయే అత్యంత ముఖ్యమైన నిర్ణయం.నిన్నటి వరకు మీ సక్సెస్‌ను స్కోర్లు, కటాఫ్‌లు, పర్సంటైల్స్‌తో కొలిచారు. అందులో ఉన్నది ఒకే ఛాన్స్, ఒకే నంబర్. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది... ఆ పాత విధానం ఇక్కడితో ముగిసింది!ముందున్న దశ పూర్తిగా వేరుగా ఉంటుంది. స్కిల్స్ అనేవి 'సింగిల్ అటెంప్ట్' మీద ఆధారపడవు. ప్రతి రోజూ కొత్తగా నేర్చుకోవడానికి, ఏదైనా సృష్టించడానికి మనకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. "సరైన సమయం" కోసం ఎదురుచూడకుండా ఈ మార్పును ఎవరైతే ముందుగా గుర్తిస్తారో, వారికి మిగిలిన విద్యార్థుల కంటే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండి నాలుగేళ్ల తర్వాత ఎవరూ ఊహించని గొప్ప పొజిషన్ లో ఉంటారు. 'ఇంటెలిజెన్స్ ఏజ్' ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఇందులో మీ స్థానం ఏంటి అని కేవలం ఒక పరీక్ష నిర్ణయించలేదు.ఈ నాలుగేళ్లలో ప్రపంచం పూర్తిగా మారిపోయింది. రూల్స్ అన్నీ మారిపోయాయి. ఈ ఏడాది ఇంజనీరింగ్‌లో చేరుతున్న స్టూడెంట్స్… ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు(2022లో) చాట్ జీపీటీ, క్లాడ్, లేదా జెమిని లాంటివి లేనే లేవు.మీరు నాలుగేళ్ల తర్వాత డిగ్రీ పూర్తి చేసి బయటకు వచ్చేసరికి (2030 నాటికి) ప్రపంచం ఇంకోలా ఉంటుంది. అప్పుడు సక్సెస్ అనేది ర్యాంక్ లతో నిర్ణయించబడదు… ఈ నాలుగేళ్లలో నిజమైన టెక్ ప్రాజెక్ట్స్ చేస్తూ, టెక్నాలజీపై పట్టు సాధించి, ఎక్స్పీరియన్స్ సంపాదించిన వాళ్లే రేపటి లీడర్లుగా నిలుస్తారు.ఏఐ వల్ల మార్పులు వస్తున్న మాట నిజమే. అది ఎంట్రీ లెవల్ ఉద్యోగాల మీద ప్రభావం చూపుతోంది. కానీ 'వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్' ఇదే ఏఐ వల్ల 1.7 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయి అని చెబుతుంది. ఈ అవకాశాలు ఎవరికి వస్తాయో తెలుసా? ర్యాంకు చూసి కాదు.. ఒక సమస్యను గుర్తించి, దానికి టెక్నాలజీతో పరిష్కారం వెతికే 'బిల్డర్ మైండ్‌సెట్' ఉన్నవాళ్లకి.మార్కుల కంటే స్కిల్స్‌కే ప్రాధాన్యత ఇస్తే ఫలితం ఎలా ఉంటుందంటే..జేఈఈ పరీక్ష అయిపోయిన తర్వాత, కొందరు విద్యార్థులు ర్యాంకుల గురించి అనవసరంగా టెన్షన్ పడకూడదని నిర్ణయించుకున్నారు. రేపటి భవిష్యత్తుకు ర్యాంకుల కంటే స్కిల్స్ ముఖ్యమని ముందే గ్రహించారు.ఉదాహరణకు, హరీష్ అనే విద్యార్థి ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదాన్ని చూశాడు. అక్కడ సకాలంలో సాయం అందకపోవడం వల్ల ప్రాణాలు పోవడం అతన్ని కలిచివేసింది. ఆ సమస్య కు పరిష్కారం కోసం 'ఎన్ఐఏటి 5.0 ఇన్నోవేషన్ ల్యాబ్స్' సహాయంతో ప్రాణాలు కాపాడే ఒక 'స్మార్ట్ హెల్మెట్'ను తయారు చేశాడు. కేవలం మూడు రోజుల పాటు రాత్రింబవళ్లు కష్టపడి తన ఆలోచనకు ప్రాణం పోశాడు. ఈరోజు ఆ ప్రాజెక్ట్ చూసి ఇన్వెస్టర్లు సైతం పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు.అలాగే నితీష్ కటకం మరియు హర్షిణి లాంటి వాళ్లు, కంపెనీలు అసలు అభ్యర్థుల నుండి ఏం కావాలని కోరుకుంటున్నాయో అర్థం చేసుకుని, టెక్నికల్ స్కిల్స్ మీద పట్టు సాధించి, మొదటి ఏడాదిలోనే మంచి స్టైపెండ్‌తో ఇంటర్న్‌షిప్ సాధించారు. సాధారణంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇలా స్టైపెండ్ తో ఇంటర్న్‌షిప్ అవకాశం రావడం చాలా అరుదు.అలాగే, జి. హృషికేష్ అనే ఒక 19 ఏళ్ల విద్యార్థి తన రోజువారీ పనిలో పదే పదే ఎదురవుతున్న ఒక సమస్యను గమనించాడు. ఎన్ఐఏటి అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ద్వారా కొన్ని నెలల వ్యవధిలోనే దానికి పరిష్కారంగా 'జిఎస్' అనే ఒక ఏఐ ఆటోమేషన్ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేశాడు. తను ఇంకా చదువుకుంటున్న దశలోనే, ఆ ప్లాట్‌ఫామ్ ద్వారా నెలకు సుమారు 10 లక్షల రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నాడు.చాలామంది విద్యార్థులు ఇప్పుడు 'ఎన్ఐఏటి 5.0 ఇన్నోవేషన్ ల్యాబ్స్' ద్వారా రైతులకు సాయపడే ఏఐ సిస్టమ్స్, హ్యూమనాయిడ్ రోబోలు, ఏఐ డ్రోన్లు.. ఇలా ఎన్నో తయారు చేస్తున్నారు. ఇలాంటి వందలాది ఇన్నోవేషన్ కథల వెనుక ఉన్న అసలు నిజం ఒక్కటే. ర్యాంకుల కంటే స్కిల్స్ గొప్పవని ఈ విద్యార్థులు చాలా త్వరగా తెలుసుకున్నారు.పరిశ్రమలకు ఖచ్చితంగా ఎలాంటి నైపుణ్యాలు కావాలో, అవే నేర్పించడానికి ఎన్ఐఏటి అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. సరైన వేదికను, వాతావరణాన్ని అందించడం ద్వారా విద్యార్థులను మొదటి రోజు నుంచే 'టెక్ బిల్డర్స్'గా ఎన్ఐఏటి తీర్చిదిద్దుతుంది.దీని ఫలితంగానే, కేవలం మొదటి ఏడాదిలోనే 200 మందికి పైగా విద్యార్థులు స్టైపెండ్‌తో కూడిన ఇంటర్న్షిప్స్ సాధించగలిగారు. 22 మంది కి పైగా విద్యార్థులు సొంత స్టార్టప్స్ స్థాపించగలిగారు. ఎన్నో సమస్యలకు ‘ఎన్ఐఏటి 5.0 ల్యాబ్స్’ ద్వారా పరిష్కారం చూపగలిగారు.మీ టాలెంట్‌ను కేవలం ఒక జేఈఈ ర్యాంకుతో ముడిపెట్టకుండా, దాన్ని ఒక ఆరంభంలా భావిస్తే వచ్చే మార్పు ఇదే!స్టూడెంట్స్ అందరికీ ఒకే ఒక్క మాట..మీ జేఈఈ రిజల్ట్ అనేది ఒక మైలురాయి మాత్రమే, అదే మీ కెరీర్ పై ఫైనల్ నిర్ణయం కాదు. రాబోయే నాలుగేళ్లలో మీరు ఏం చేస్తారన్నదే ముఖ్యం. ఈరోజు రిజల్ట్ కంటే మీలో ఉన్న టాలెంట్ చాలా గొప్పది.ఇది కొత్త స్కిల్స్ నేర్చుకోవాల్సిన సమయం, అనవసరమైన టెన్షన్ పడే టైమ్ కాదు. భవిష్యత్తులో మీకు ఎన్నో దారులు ఉన్నాయి. మీరు ఎంచుకునే వాతావరణం, నేర్చుకునే స్కిల్స్, మీరు పరిష్కరించే సమస్యలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.ప్రపంచంలోని టాప్ కంపెనీలు 'బిల్డర్స్' కోసం ఎదురుచూస్తున్నాయి.ఆ బిల్డర్ అయ్యే అవకాశం మీ అందరికీ ఉంది. రాబోయే 4 ఏళ్లలో స్కిల్స్ నేర్పించే చోటునే మీ గమ్యంగా ఎంచుకోండి.ఆల్ ది బెస్ట్!మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టాప్ 10లో ఆ రాష్ట్రం నుంచి అతనొక్కడే!
బిహార్‌లోని గయకు చెందిన శుభం కుమార్ జేఈఈ మెయిన్ 2026లో 100 పర్సంటైల్ సాధించి ‘వావ్’ అనిపించుకున్నాడు. కుమార్ తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. తండ్రి శివ్ కుమార్ హార్ట్‌వేర్ షాప్ యజమాని. తల్లి కాంచన్‌దేవి గృహిణి. శుభం కుమార్ ఆల్ ఇండియా స్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు. దేశస్థాయిలో టాప్ 10లో ఉన్న ఏకైక బిహారి యువకుడిగా ఘనత సాధించాడు. బిహార్ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ఆమోదించిన సందర్భంగా... ‘శుభం కుమార్ విజయం రాష్ట్రానికి గర్వకారణం’ అని స్పీకర్ డాక్టర్ ప్రేమ్ కుమార్ అని ప్రశంసించారు. శాసనసభ్యులు చప్పట్లు కొట్టారు.‘రాష్ట్రానికి ప్రేరణ ఇచ్చే విజయం ఇది’ అని శుభం కుమార్‌ను ప్రశంసించారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ చౌదురి.శిక్షణా కేంద్రాలకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని కోటకు వెళ్లడానికి ముందు ఇంట్లోనే పరీక్షలకు ప్రిపేరయ్యాడు కుమార్. కోటకు (Kota) వచ్చిన కొత్తలో కుమార్ కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉంది. కుమార్ కోటలో ఉండలేని పరిస్థితి వచ్చింది. అయినా తల్లిదండ్రులు వెనకడుగు వేయకుండా, ఆర్థిక ప్రతికూలతలను అధిగమించి కుమార్ తీసుకునే కోచింగ్‌కు అంతరాయం కలగకుండా చూశారు. దాని ఫలితం ఊరకే పోలేదు. కుమార్ దేశస్థాయిలో గుర్తింపు తెచ్చుకునేలా చేసింది. ఒకవైపు తల్లిదండ్రులు గుర్తుకు వస్తున్నా.. తన లక్ష్యంపైనే గురి పెట్టాడు. రోజుకు పది నుంచి పన్నెండు గంటలు ప్రిపేరయ్యేవాడు. ప్రాక్టీస్ పరీక్ష దశలో 14 గంటల వరకు చదివాడు.‘నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వం, కష్టపడి చదవడం వల్లే ఈ విజయం సాధ్యమైంది’ అంటున్నాడు శుభం కుమార్ (Shubham Kumar).చదవండి: విభాగాల వారీగా జేఈఈ మెయిన్ టాపర్లు వీరే -
ర్యాంకర్లూ కటాఫ్!
సాక్షి, హైదరాబాద్: కేంద్రీయ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్–2025 అర్హత పరీక్ష ఫలితాల్లో దాదాపు అన్ని కేటగిరీల్లో కటాఫ్ పర్సంటైల్ గతేడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. అలాగే జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల్లో అర్హుల సంఖ్యలోనూ స్వల్పంగా తగ్గుదల కనిపించింది. మరోవైపు గతేడాదితో పోలిస్తే 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థుల సంఖ్య కూడా సగానికి పడిపోయింది.గతేడాది జేఈఈ మెయిన్ ఫలితాల్లో 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు 56 మంది ఉండగా ఈసారి కేవలం 24 మందే 100 పర్సంటైల్ సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ర్యాంకర్లు సైతం భారీగా తగ్గిపోయారు. గతేడాది జేఈఈ మెయిన్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 21 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా తాజాగా ఆ జాబితాలో నలుగురు (హర్షి ఎ. గుప్తా, వంగల అజయ్‌రెడ్డి, బణిబ్రత మజీ, గుత్తికొండ సాయి మనోజ్ఞ) మాత్రమే ఉండటం గమనార్హం. సాయి మనోజ్ఞ మహిళల కేటగిరీలో టాపర్‌గా నిలవగా అజయ్‌రెడ్డి ఈడబ్ల్యూఎస్ విభాగంలోనూ టాపర్‌గా నిలిచాడు. భారీగా దరఖాస్తులు... జేఈఈ మెయిన్–2025 కోసం విద్యార్థులు భారీగానే పోటీ పడ్డారు. జనవరి, ఏప్రిల్ రెండు సెషన్లకు కలిపి 15,39,848 మంది దరఖాస్తు చేసుకోగా 14,75,103 మంది హాజరయ్యారు. తుది ఫలితాల్లో నిర్దేశించిన కటాఫ్ పర్సంటైల్ సాధించి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 2,50,236 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్‌లో కటాఫ్ మార్కులు స్వల్పంగా తగ్గాయి. ఓపెన్ కేటగిరీలో 93.102 పర్సంటైల్‌గా కటాఫ్‌ను నిర్ణయించగా గతేడాది ఇది 93.236గా నమోదైంది.ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కటాఫ్‌ను 80.383గా నిర్ణయించగా గతేడాది 81.326గా నమోదైంది. ఓబీసీ కేటగిరీలో గతేడాది 79.675 పర్సంటైల్ ఉండగా ఈ ఏడాది 79.431గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో మాత్రం కటాఫ్ పర్సంటైల్ స్వల్పంగా పెరిగింది. మరోవైపు పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డ 110 మంది విద్యార్థుల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిలిపేసింది. ఈ నెల 23 నుంచి ‘అడ్వాన్స్డ్’కు రిజిస్ట్రేషన్ జేఈఈ మెయిన్ ఫలితాల్లో 2,50,236 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించడంతో అందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. మే 2 వరకు దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు ఉంది. మే 18న రెండు పేపర్లుగా అడ్వాన్స్డ్ పరీక్షలు జరగనున్నాయి. అడ్వాన్స్డ్ ఫలితాలను జూన్ 2న ప్రకటించనున్నట్లు ఐఐటీ కాన్పూర్ ప్రాథమికంగా వెల్లడించింది. అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాల ఆధారంగా ఐఐటీల్లోని 17 వేలకుపైగా సీట్లను భర్తీ చేయనున్నారు. అలాగే జేఈఈ మెయిన్ ద్వారా ప్రవేశం కల్పించే ఎన్ఐటీల్లో దాదాపు 24 వేలు, ట్రిపుల్ ఐటీల్లో 8,500, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర విద్యాసంస్థల్లో దాదాపు 9 వేల సీట్లు అందుబాటులో ఉంటాయి. -
జేఈఈ మెయిన్‌లో తెలుగు తేజాలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్)లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా వారిలో నలుగురు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. తెలంగాణకు చెందిన హర్షి ఎ. గుప్తా, వంగల అజయ్‌రెడ్డి, బనిబ్రత మజీతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ 100 పర్సంటైల్ సాధించారు. అలాగే టాప్–100 ర్యాంకుల్లో 15 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. 99 పర్సంటైల్‌లో వంద మందికిపైగా చోటు సాధించారు. జేఈఈ మెయిన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసింది. రాజస్తాన్‌కు చెందిన ఎండీ అనాస్, ఆయుష్ సింగల్ తొలి రెండు ర్యాంకులు సాధించారు. జేఈఈ మొదటి విడత పరీక్ష జనవరిలో జరిగింది. రెండో సెషన్‌ను ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో నిర్వహించారు. దేశవ్యాప్తంగా 10,61,849 మంది ఈ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో 9,92,350 మంది పరీక్ష రాశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. జేఈఈ మొదటి, రెండో విడత పరీక్ష ఫలితాలను ఆధారంగా చేసుకొని ర్యాంకులు ప్రకటించారు. వాటి ల్లో 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేశారు. ఈ పరీక్షకు ఈ నెల 23 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 2న పరీక్ష ఉంటుంది. -
జేఈఈ మెయిన్‌లో మనోళ్ల సత్తా
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాల్లో మళ్లీ తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. సోమవారం విడుదలైన ఈ ఫలితాల్లో తెలంగాణకు చెందిన బట్టేపాటి కార్తికేయ జాతీయస్థాయిలో ఐదో ర్యాంకు కైవసం చేసుకున్నారు. తెలంగాణకే చెందిన అడెల్లి సాయికిరణ్ ఏడో ర్యాంకు, కె.విశ్వంత్ 8వ ర్యాంకు, ఇందుకూరి జయంత్ ఫణి సాయి 19వ ర్యాంకును సాధించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండా రేణు 9వ ర్యాంకు, బొజ్జ చేతన్ రెడ్డి 21వ ర్యాంకును సాధించారు. బీఈ, బీటెక్‌లో ప్రవేశాలకు సంబంధించిన ఈ ఏడాది జనవరి 8 నుంచి 12 వరకు తొలి దఫా, ఆ తర్వాత ఏప్రిల్ 7 నుంచి 12వరకు జరిగిన రెండో దఫా జేఈఈ మెయిన్ పేపర్–1 పరీక్ష జరిగింది. జనవరిలో జరిగిన తొలిదఫా పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇప్పటికే ప్రకటించగా, ఏప్రిల్‌లో జరిగిన రెండో దఫా పరీక్ష ఫలితాలను సోమవారం రాత్రి ప్రకటించింది. ఢిల్లీకు చెందిన శుభాన్ శ్రీవాత్సవ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకును కైవసం చేసుకోగా, కర్ణాటకకు చెందిన కెవిన్ మార్టిన్ రెండో ర్యాంకు, మధ్యప్రదేశ్‌కు చెందిన ధ్రువ్ అరోరా మూడో ర్యాంకు సాధించారు. జాతీయ స్థాయిలో ఎన్టీఏ ప్రకటించిన టాప్–24 ర్యాంకర్లలో తెలంగాణ నుంచి నలుగురు, ఏపీ నుంచి ఇద్దరికి చోటు లభించింది. జనవరిలో జరిగిన తొలి దఫా జేఈఈ మెయిన్ పరీక్షకు 8,74,469 మంది, ఏప్రిల్‌లో జరిగిన రెండో దఫా పరీక్షకు 8,81,096 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 6,08,440 మంది విద్యార్థులు రెండు సార్లు పరీక్ష రాశారు. ఈ రెండు పరీక్షల్లో వచ్చిన ఉత్తమ మార్కులను పరిగణలోకి తీసుకుని వీరికి ఎన్టీఏ ర్యాంకులను కేటాయించింది. రెండు దఫాల్లో కలిపి మొత్తం 11,47,125 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్ష రాశారు. రెండో దఫాల్లో 608440 మంది పరీక్షలు రాయగా, అందులో 297932 మంది తమ ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. కాగా, మొత్తంగా 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. సూర్యాపేట పట్టణానికి చెందిన గురుమూర్తి, పద్మ దంపతుల కుమారుడు కె.విశ్వంత్ జాతీయ స్థాయిలో 8వ ర్యాంకు సాధించారు. ఆయన తల్లిదండ్రులిద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులే. నెల్లూరు జిల్లా ఇందుకూరు పేట మండలం నర్సాపురం గ్రామానికి చెందిన బట్టేపాటి కార్తికేయ హైదరాబాద్‌లో ఉండి చదువుకుంటున్నారు. సిద్దిపేటకు చెందిన దయానంద్, సునంద దంపతుల కుమారుడు అడెల్లి సాయికిరణ్ జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించారు. మే 27న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిలో మెరిట్ ప్రకారం తొలి 2.24 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేయనున్నారు. ఈ అభ్యర్థులకు మే 27న అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారితంగా పేపర్–1ను మే 27న ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్–2ను మధ్యాహ్నం 2 గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకు నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిట్ సాధించిన అభ్యర్ధులకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం మే 5 నుంచి దరఖాస్తుకు చివరి తేదీ మే 9 ఫీజు చెల్లింపునకు గడువు మే 10 హాల్‌టికెట్ల డౌన్లోడ్ మే 20నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష మే 27 ఆన్లైన్ కీ విడుదల జూన్ 4 జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు జూన్ 14 -
ఐఐటీ జేఈఈ ఫలితాల్లో ‘సూపర్ 30’ హవా
పట్నా: ప్రతిభగల నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ కోచింగ్ అందించే బిహార్‌లోని ‘సూపర్ 30’ సంస్థ ఈ ఏడాదీ సత్తా చాటింది. ఐఐటీ-జేఈఈ 2016 ఫలితాల్లో సంస్థలోని 30 మంది విద్యార్థులకుగాను ఏకంగా 28 మంది అర్హత సాధించారు. వారిలో దినసరి కూలీ, సన్నకారు రైతు, వలస కార్మికుల పిల్లలు ఉన్నట్లు సూపర్ 30 వ్యవస్థాపక డెరైక్టర్ ఆనంద్ కుమార్ ఆదివారం పట్నాలో తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకుల కష్టానికి దక్కిన ఘనత ఇది అని వ్యాఖ్యానించారు. సరైన అవకాశాలు కల్పిస్తే పేద కుటుంబాల పిల్లలు కూడా ఐఐటీలలో సీట్లు సాధించగలరని ఈ ఏడాది ఫలితాలు మరోసారి నిరూపించాయన్నారు. ఏటా పోటీ పరీక్ష ద్వారా 30 మంది పేద విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచితంగా కోచింగ్‌తోపాటు భోజన, వసతి సౌకర్యాలను సూపర్ 30 కల్పిస్తోంది. రోజుకు 16 గంటల చొప్పున ఏడాదిపాటు విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ‘ద బెస్ట్ ఆఫ్ ఆసియా 2010’ జాబితాలో సూపర్ 30ని ఎంపిక చేసింది.’


