2026 JEE ఫలితాలు వచ్చేశాయి…ఈ ర్యాంకుతో మీ భవిష్యత్తు నిర్ణయించబడుతుందా? - నెక్స్ట్ వేవ్ సీఈఓ రాహుల్ అత్తులూరి అభిప్రాయం | 2026 JEE Results Out Will This Rank Determine Your Future Next Wave CEO Rahul Attuluri Opinio | Sakshi
Sakshi News home page

2026 JEE ఫలితాలు వచ్చేశాయి…ఈ ర్యాంకుతో మీ భవిష్యత్తు నిర్ణయించబడుతుందా? - నెక్స్ట్ వేవ్ సీఈఓ రాహుల్ అత్తులూరి అభిప్రాయం

Apr 20 2026 8:41 PM | Updated on Apr 23 2026 4:11 PM

2026 JEE Results Out Will This Rank Determine Your Future Next Wave CEO Rahul Attuluri Opinio

దాదాపు 14.5 లక్షల మంది విద్యార్థులు తమ ర్యాంకులు చూసుకుంటున్న ఈ సమయంలో… అసలు భవిష్యత్తును నిర్ణయించేది ఏంటో తెలుసుకుందాం. 
– రాహుల్ అత్తులూరి, సీఈఓ మరియు కో-ఫౌండర్, నెక్స్ట్ వేవ్. 

ఈరోజు చాలా ముఖ్యమైన రోజు.

నెలల తరబడి కఠినమైన ప్రిపరేషన్, నిద్రలేని రాత్రులు, కేవలం ఒక జేఈఈ అభ్యర్థికి మాత్రమే తెలిసిన ఆ ఒత్తిడి.. వీటన్నిటి తర్వాత మొత్తానికి ఈరోజు రిజల్ట్స్ వచ్చేశాయి.

మీలో కొందరికి ఈరోజు పండగలా ఉండొచ్చు. కానీ చాలామందికి అనుకున్న ఫలితం రాకపోయి ఉండొచ్చు. స్కోరు చూసిన తర్వాత కలిగే బాధ ఉందే… అది మీరు ఇప్పటిదాకా మోసిన ఏ బరువు కంటే కూడా చాలా ఎక్కువగా అనిపించవచ్చు.

మీరు అలా ఫీలవ్వడం సహజమే.

కానీ ఒక్క నిమిషం ఆగి మీరు ఏం చేశారో ఆలోచించండి. మీరు పోరాడారు, కష్టపడ్డారు, మీ తప్పు లేకుండా ప్రయత్నించారు. ఆ ప్రయత్నం ఒక్కటి చాలు మిమ్మల్ని అభినందించడానికి.

మీ జేఈఈ ర్యాంక్ బట్టి మీరేంటో డిసైడ్ చేసేసుకోకండి. ఒక్కసారి నేను చెప్పే విషయం ఆలోచించండి. ఈ ఏడాది సుమారుగా 14.5 లక్షల మంది జేఈఈ రాశారు. ఉన్న ఐఐటీ సీట్లు మాత్రం సుమారుగా 18,000 మాత్రమే. అంటే ప్రతి వంద మందిలో ఒక్కరికి మాత్రమే సీటు వస్తుంది.

మరి మిగిలిన 99 శాతం మంది పరిస్థితి ఏంటి? వాళ్లంతా ఫెయిల్ అయినట్టా? వాళ్లకు తెలివితేటలు లేవనా? వాళ్లు ఇక దేనికి పనికిరారని అర్థమా?
ఖచ్చితంగా కాదు!

అసలు జేఈఈ అంటే ఏంటో నిజాయితీగా మాట్లాడుకుందాం.

జేఈఈ అనేది ఒక 'ఫిల్టర్' మాత్రమే. ఉన్న కొన్ని సీట్లను నింపడానికి పెట్టిన ఒక పద్ధతి. అంతే తప్ప, మీ తెలివితేటలను జడ్జ్ చేయడానికి పెట్టింది కాదు ఇది. సాధారణంగా మంచి ర్యాంకు ఉంటేనే తెలివైనవాళ్లు అని అందరూ అనుకుంటారు, కానీ మీలో ఉన్న టాలెంట్‌ను కొలవడానికి ఇది సరైన కొలమానం కాదు. మీలాంటి యువకుల జీవితం ఎలా ఉండాలో డిసైడ్ చేయడానికి అసలే కాదు.

అయినా సరే, లక్షలాది కుటుంబాలు ఈ ఒక్క ఎగ్జామ్ చుట్టూనే తమ పిల్లల జీవితాలను తిప్పుతున్నాయి. 

కానీ రిజల్ట్స్ రోజున ఎవరూ బయటకు చెప్పని ఒక చేదు నిజం ఉంది. ఒక విద్యార్థి ఐఐటీలో సీటు సాధించాడా లేదా అన్నదానికి, వాళ్లు భవిష్యత్తులో ఎంత సక్సెస్ అవుతారన్నదానికి అసలు సంబంధం లేదు.

ఐఐటీలో చదవకపోయినా సరే.. అద్భుతమైన కెరీర్ బిల్డ్ చేసుకున్న వాళ్లని, టాప్ పొజిషన్లలో ఉన్నవాళ్లని, విజయవంతంగా స్టార్టప్‌లను నడుపుతున్న వాళ్లని నేను చాలా మందిని చూశాను. వాళ్లకు అప్పట్లో వచ్చిన జేఈఈ ర్యాంకుకు, ఈరోజు వాళ్లు ఉన్న పొజిషన్‌కు అసలు పోలికే లేదు.

ఈ ఒక్క రోజుతో అంతా అయిపోలేదు.. ఇదొక కొత్త మలుపు మాత్రమే.

ర్యాంకు పైన కాకుండా, స్కిల్స్ మీద ఫోకస్ పెట్టడమే ఇప్పుడు మీరు తీసుకోబోయే అత్యంత ముఖ్యమైన నిర్ణయం.

నిన్నటి వరకు మీ సక్సెస్‌ను స్కోర్లు, కటాఫ్‌లు, పర్సంటైల్స్‌తో కొలిచారు. అందులో ఉన్నది ఒకే ఛాన్స్, ఒకే నంబర్. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది... ఆ పాత విధానం ఇక్కడితో ముగిసింది!

ముందున్న దశ పూర్తిగా వేరుగా ఉంటుంది. స్కిల్స్ అనేవి 'సింగిల్ అటెంప్ట్' మీద ఆధారపడవు. ప్రతి రోజూ కొత్తగా నేర్చుకోవడానికి, ఏదైనా సృష్టించడానికి మనకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. "సరైన సమయం" కోసం ఎదురుచూడకుండా ఈ మార్పును ఎవరైతే ముందుగా గుర్తిస్తారో, వారికి మిగిలిన విద్యార్థుల కంటే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండి నాలుగేళ్ల తర్వాత ఎవరూ ఊహించని గొప్ప పొజిషన్ లో ఉంటారు. 

'ఇంటెలిజెన్స్ ఏజ్' ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఇందులో మీ స్థానం ఏంటి అని కేవలం ఒక పరీక్ష నిర్ణయించలేదు.

ఈ నాలుగేళ్లలో ప్రపంచం పూర్తిగా మారిపోయింది. రూల్స్ అన్నీ మారిపోయాయి. ఈ ఏడాది ఇంజనీరింగ్‌లో చేరుతున్న స్టూడెంట్స్… ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు(2022లో) చాట్ జీపీటీ, క్లాడ్, లేదా జెమిని లాంటివి లేనే లేవు.

మీరు నాలుగేళ్ల తర్వాత డిగ్రీ పూర్తి చేసి బయటకు వచ్చేసరికి (2030 నాటికి) ప్రపంచం ఇంకోలా ఉంటుంది. అప్పుడు సక్సెస్ అనేది ర్యాంక్ లతో నిర్ణయించబడదు… ఈ నాలుగేళ్లలో నిజమైన టెక్ ప్రాజెక్ట్స్ చేస్తూ, టెక్నాలజీపై పట్టు సాధించి, ఎక్స్‌పీరియన్స్ సంపాదించిన వాళ్లే రేపటి లీడర్లుగా నిలుస్తారు.

ఏఐ వల్ల మార్పులు వస్తున్న మాట నిజమే. అది ఎంట్రీ లెవల్ ఉద్యోగాల మీద ప్రభావం చూపుతోంది. కానీ 'వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్' ఇదే ఏఐ వల్ల 1.7 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయి అని చెబుతుంది. ఈ అవకాశాలు  ఎవరికి వస్తాయో  తెలుసా? ర్యాంకు చూసి కాదు.. ఒక సమస్యను గుర్తించి, దానికి టెక్నాలజీతో పరిష్కారం వెతికే 'బిల్డర్ మైండ్‌సెట్' ఉన్నవాళ్లకి.

మార్కుల కంటే స్కిల్స్‌కే ప్రాధాన్యత ఇస్తే ఫలితం ఎలా ఉంటుందంటే..

జేఈఈ పరీక్ష అయిపోయిన తర్వాత, కొందరు విద్యార్థులు ర్యాంకుల గురించి అనవసరంగా టెన్షన్ పడకూడదని నిర్ణయించుకున్నారు. రేపటి భవిష్యత్తుకు ర్యాంకుల కంటే స్కిల్స్ ముఖ్యమని ముందే గ్రహించారు.

ఉదాహరణకు, హరీష్ అనే విద్యార్థి ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదాన్ని చూశాడు. అక్కడ సకాలంలో సాయం అందకపోవడం వల్ల ప్రాణాలు పోవడం అతన్ని కలిచివేసింది. ఆ సమస్య కు పరిష్కారం కోసం 'ఎన్ఐఏటి 5.0 ఇన్నోవేషన్ ల్యాబ్స్' సహాయంతో ప్రాణాలు కాపాడే ఒక 'స్మార్ట్ హెల్మెట్'ను తయారు చేశాడు. కేవలం మూడు రోజుల పాటు రాత్రింబవళ్లు కష్టపడి తన ఆలోచనకు ప్రాణం పోశాడు. ఈరోజు ఆ ప్రాజెక్ట్ చూసి ఇన్వెస్టర్లు సైతం పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

అలాగే నితీష్ కటకం మరియు హర్షిణి లాంటి వాళ్లు, కంపెనీలు అసలు అభ్యర్థుల నుండి ఏం కావాలని కోరుకుంటున్నాయో అర్థం చేసుకుని, టెక్నికల్ స్కిల్స్ మీద పట్టు సాధించి, మొదటి ఏడాదిలోనే మంచి స్టైపెండ్‌తో  ఇంటర్న్‌షిప్ సాధించారు. సాధారణంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇలా స్టైపెండ్ తో ఇంటర్న్‌షిప్ అవకాశం రావడం చాలా అరుదు.

అలాగే, జి. హృషికేష్ అనే ఒక 19 ఏళ్ల విద్యార్థి తన రోజువారీ పనిలో పదే పదే ఎదురవుతున్న ఒక సమస్యను గమనించాడు. ఎన్ఐఏటి అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ద్వారా కొన్ని నెలల వ్యవధిలోనే దానికి పరిష్కారంగా 'జిఎస్' అనే ఒక ఏఐ ఆటోమేషన్ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేశాడు. తను ఇంకా చదువుకుంటున్న దశలోనే, ఆ ప్లాట్‌ఫామ్ ద్వారా నెలకు సుమారు 10 లక్షల రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నాడు.

చాలామంది విద్యార్థులు ఇప్పుడు 'ఎన్ఐఏటి 5.0 ఇన్నోవేషన్ ల్యాబ్స్' ద్వారా రైతులకు సాయపడే ఏఐ సిస్టమ్స్, హ్యూమనాయిడ్ రోబోలు, ఏఐ డ్రోన్లు.. ఇలా ఎన్నో తయారు చేస్తున్నారు. ఇలాంటి వందలాది ఇన్నోవేషన్ కథల వెనుక ఉన్న అసలు నిజం ఒక్కటే. ర్యాంకుల కంటే స్కిల్స్ గొప్పవని ఈ విద్యార్థులు చాలా త్వరగా తెలుసుకున్నారు.

పరిశ్రమలకు ఖచ్చితంగా ఎలాంటి నైపుణ్యాలు కావాలో, అవే నేర్పించడానికి ఎన్ఐఏటి అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. సరైన వేదికను, వాతావరణాన్ని అందించడం ద్వారా విద్యార్థులను మొదటి రోజు నుంచే 'టెక్ బిల్డర్స్'గా ఎన్ఐఏటి తీర్చిదిద్దుతుంది.

దీని ఫలితంగానే, కేవలం మొదటి ఏడాదిలోనే 200 మందికి పైగా విద్యార్థులు స్టైపెండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్స్ సాధించగలిగారు. 22 మంది కి పైగా విద్యార్థులు సొంత స్టార్టప్స్ స్థాపించగలిగారు. ఎన్నో సమస్యలకు ‘ఎన్ఐఏటి 5.0 ల్యాబ్స్’ ద్వారా పరిష్కారం చూపగలిగారు.

మీ టాలెంట్‌ను కేవలం ఒక జేఈఈ ర్యాంకుతో ముడిపెట్టకుండా, దాన్ని ఒక ఆరంభంలా భావిస్తే వచ్చే మార్పు ఇదే!

స్టూడెంట్స్ అందరికీ ఒకే ఒక్క మాట..

మీ జేఈఈ రిజల్ట్ అనేది ఒక మైలురాయి మాత్రమే, అదే మీ కెరీర్ పై ఫైనల్ నిర్ణయం కాదు. రాబోయే నాలుగేళ్లలో మీరు ఏం చేస్తారన్నదే ముఖ్యం. ఈరోజు రిజల్ట్ కంటే మీలో ఉన్న టాలెంట్ చాలా గొప్పది.

ఇది కొత్త స్కిల్స్ నేర్చుకోవాల్సిన సమయం, అనవసరమైన టెన్షన్ పడే టైమ్ కాదు. భవిష్యత్తులో మీకు ఎన్నో దారులు ఉన్నాయి. మీరు ఎంచుకునే వాతావరణం, నేర్చుకునే స్కిల్స్, మీరు పరిష్కరించే సమస్యలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.

ప్రపంచంలోని టాప్ కంపెనీలు 'బిల్డర్స్' కోసం ఎదురుచూస్తున్నాయి.

ఆ బిల్డర్ అయ్యే అవకాశం మీ అందరికీ ఉంది. రాబోయే 4 ఏళ్లలో స్కిల్స్ నేర్పించే చోటునే మీ గమ్యంగా ఎంచుకోండి.

ఆల్ ది బెస్ట్!

మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement