చప్పట్లు కొడుతూ మోదీ తల్లి హర్షాతిరేకం.. | Modi Mother Heeraben Watching The Swearing- In Ceremony | Sakshi
Sakshi News home page

మోదీ ప్రమాణాన్ని టీవీలో వీక్షించిన హీరాబెన్‌

May 30 2019 8:09 PM | Updated on May 30 2019 8:10 PM

Modi Mother Heeraben Watching The Swearing- In Ceremony - Sakshi

సాక్షి, అహ్మదాబాద్‌ : కుమారుడి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ తన నివాసంలోనే టీవీలో వీక్షించారు. మోదీ సోదరుడు పంకజ్‌ కూడా తల్లితో కలిసి ఈ వేడుకను తిలకించారు. గాంధీనగర్‌ సమీపంలోని రాయ్‌సన్‌ గ్రామంలో ఆమె తన నివాసంలో టీవీలో చూస్తూ... కొడుకు ప్రధానిగా ప్రమాణం చేస్తుండగా చప్పట్లు కొట్టి మురిసిపోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా ఆదివారం నరేంద్ర మోదీ గుజరాత్‌ వెళ్లి తల్లి వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా తల్లికి పాదాభివందనం చేసి, కాసేపు ఆమెతో గడిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement