తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ముత్యపుపందిరి వాహనంపై భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.
ధనుర్భంగం (సీతా స్వయంవరం) ఘట్టాన్ని తలపిస్తూ, శ్రీవారు శ్రీరామచంద్ర. మూర్తి, అమ్మవార్లు సీతా లక్ష్మణుల అలంకారంలో దర్శనమివ్వడం విశేష ఆకర్షణగా నిలిచింది.
స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
వైభవంగా సాగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
గోవింద నామస్మరణలతో మాడ వీధులు మార్మోగగా, పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు.


