హైదరాబాద్ : భారత్–వెస్టిండీస్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో బుధవారం టి20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల జోష్ కనిపించింది.
యువత కేరింతలు..తిరంగా వేషధారణలతో సందడి నెలకొంది. విదేశీయులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో యువకులు తరలివచ్చారు.
టీమ్ ఇండియాకు మద్దతుగా నినాదాలు చేశారు. తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించడంతో సెలవు రోజులు అయినా యూనిఫాంలోనే రావడం విశేషం.
సాయంత్రం 4 గంటల నుంచే అభిమానులు స్టేడియం పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. మెట్రో రైలు సౌకర్యాన్ని ఎక్కువమంది వినియోగించుకోవడంతో గత మ్యాచ్లతో పోలిస్తే ఈసారి స్టేడియం పరిసరాల్లో కార్ల రాకపోకలు తక్కువగా కనిపించాయి.
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో స్టేడియంలో బతుకమ్మ వైభవాన్ని ప్రదర్శించారు. జానపద కళారూపాలు మరింత శోభను చేకూర్చాయి.
మ్యాచ్ విరామ సమయంలో తెలంగాణ పర్యాటక శాఖ రూపొందించిన పర్యాటక ప్రచార చిత్రాన్ని ప్రదర్శించారు.
ఫొటోలు : రాజేష్ రెడ్డి (సాక్షి స్టాఫ్ ఫోటో గ్రాఫర్, హైదరాబాద్)


