సాక్షి,న్యూఢిల్లీ: ప్రతి సంవత్సరం, దుర్గా పూజ, దసరా సెలవులకు ముందు, రైల్వే సిబ్బంది ఒక ప్రకటన కోసం ఎదురుచూస్తుంటారు. ఈ సంవత్సరం రావాల్సిన ఆ ప్రకటన వచ్చింది, దీనివల్ల సుమారు 11.40 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం అర్హులైన రైల్వే ఉద్యోగులకు 78 రోజుల జీతానికి సమానమైన బోనస్ను ఆమోదించింది. దీని మొత్తం చెల్లింపు రూ. 2,009.61 కోట్లు కాగా, ఇది 11,40,770 మంది సిబ్బందికి అందనుంది. ఈ బోనస్ నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగుల కోసం ఉద్దేశించబడింది.
ట్రాక్ మెయింటెయినర్లు, లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లకు బోనస్ వర్తింపు.టెక్నీషియన్లు,పాయింట్స్మెన్, సూపర్వైజర్లు, ఇతర గ్రూప్-C ఉద్యోగులకూ ప్రయోజనం జరగనుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రైల్వేల పనితీరు అత్యుత్తమంగా ఉందని కేంద్రం వెల్లడించింది. రికార్డు స్థాయిలో 1,670 మిలియన్ టన్నుల సరుకును రైల్వేలు రవాణా చేశారు. అంతేకాదు 2025–26లో సుమారు 7.41 బిలియన్ మంది ప్రయాణికులను రైల్వేలు గమ్యస్థానాలకు చేర్చారు.
ఇదీ చదవండి: ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల కోసం మేం ప్రయత్నించం: టీవీకే


