చెన్నై: తమిళనాడులో అధికారంలో ఉన్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ.. ప్రతిపక్ష ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా ప్రయత్నించబోదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అరుణ్రాజ్ స్పష్టం చేశారు. ఎవరైనా ఎమ్మెల్యేలు తమ సొంత పార్టీ నాయకత్వంతో విభేదించి టీవీకేలోకి వస్తామంటే, అప్పుడు ఆ విషయాన్ని పరిశీలిస్తామని ఆయన తెలిపారు.
ఎమ్మెల్యేల రాజీనామాలపై కోర్టు కీలక తీర్పు
ఏఐఏడీఎంకే నుంచి రాజీనామా చేసి టీవీకేలో చేరిన ఎమ్మెల్యేల వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తూ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. అయితే గతంలో పార్టీ విప్కు వ్యతిరేకంగా ఓటు వేసిన అంశంపై అనర్హత వేటు ప్రక్రియ కొనసాగవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలని స్పీకర్ను ఆదేశించింది.
ఉప ఎన్నికల్లో టీవీకే అభ్యర్థుల విజయం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది కానీ, సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాల మెజారిటీకి మాత్రం తక్కువగా నిలిచింది. ఎన్నికల అనంతరం ఇతర పార్టీల ఎమ్మెల్యేల మద్దతుతో టీవీకే అధినేత విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: పరువు నష్టం కేసు.. ట్రంప్ డిపాజిషన్ వాయిదా!


