breaking news
Railway employees
-
కేంద్రం శుభవార్త: ఆ ఉద్యోగులకు రూ.2,029 కోట్ల బోనస్
దసరా, దీపావళి వచ్చిందంటే.. ఉద్యోగుల్లో ఆనందం రెట్టింపు అవుతుంది. ఎందుకంటే ఈ సమయంలో చాలా కంపెనీలు బోనస్, ఇంక్రిమెంట్స్ వంటివి అందిస్తాయి. మరికొన్ని ప్రైవేట్ సంస్థలైతే ఖరీదైన కార్లు, బైకులను శాతం గిఫ్ట్‌గా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా కేంద్రం రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.రైల్వే ఉద్యోగులకు రూ. 2,029 కోట్ల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది 11,72,140 మంది కార్మికులకు ప్రయోజనం చేకూర్చుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అర్హత కలిగిన ఉద్యోగులందరికీ.. రూ. 7000 కనీస వేతనం కింద 78 రోజులకు బోనస్ అందించనున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ఎస్బీఐ చైర్మన్ కీలక ప్రకటన: ఈ ఆర్థిక సంవత్సరంలో..రైల్వే శాఖలో ట్రాక్ మెయింటెనెర్స్, స్టేషన్ మాస్టర్స్, టెక్నీషియన్స్, సూపర్ వైజర్స్, పాయింట్స్ మెన్, గార్డ్స్, లోకో పైలెట్స్, మినిస్టీరియల్ స్టాప్, గ్రూప్-సీ విభాగాలకు చెందిన ఉద్యోగులు బోనస్ పొందనున్నారు. 58,642 ఖాళీల భర్తీ ప్రక్రియ కూడా కొనసాగుతుందని, రిక్రూట్మెంట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అశ్విని వైష్ణవ్ అన్నారు.रेलवे इम्प्लॉईज़ के लिए 2 हजार 29 करोड़ रुपये का प्रोडक्टिविटी लिंक्ड बोनस माननीय प्रधानमंत्री जी की अध्यक्षता में कैबिनेट में अप्रूव हुआ है-माननीय रेल मंत्री @ashwinivaishnaw जी#ShramevJayate pic.twitter.com/15bHeQufpZ— Ministry of Railways (@RailMinIndia) October 3, 2024 -
భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. వారికి భారీగా పెరగనున్న జీతాలు
రైల్వే ఉద్యోగులకు శుభవార్త. సూపర్వైజరీ స్థాయి ఉద్యోగులకు వేతనాలు పెంచనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్రం నుంచి ఆమోదం లభించినట్లు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే త్రిపాఠి తెలిపారు. దీని ద్వారా దాదాపు 80 వేల మంది ఉద్యోగులకు రూ.2500-4000 వరకు జీతాలు పెరుగుతాయని చెప్పారు. ఈ నిర్ణయంతో రైల్వే శాఖపై అదనపు భారమేమీ పడదని త్రిపాఠి స్పష్టం చేశారు. ఇందుకు తగినట్లు ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా రైల్వే శాఖ ఖర్చులు ఆదా చేస్తున్నట్లు వివరించారు. ఈ వేతనాల పెంపుతో ఉద్యోగ స్తబ్ధత ఎదుర్కొంటున్న వేల మంది రైల్వే సిబ్బంది గ్రూప్ ఏ అధికారులతో సమానంగా వేతనాలు పొందుతారని త్రిపాఠి వివరించారు. 80వేల మంది సూపర్వైజరీ స్థాయి ఉద్యోగులు హై పే గ్రేడ్‌కు అర్హులు అవుతారని చెప్పారు. సూపర్వైజరీ క్యాడర్ అప్‌గ్రేడేషన్‌కు సంబంధించిన డిమాండ్ 16 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని త్రిపాఠి వెల్లడించారు. తాజాగా నిర్ణయంతో 50 శాతం మంది లెవెల్7 ఉద్యోగులు లెవెల్ 8కు చేరుకునేందుకు మార్గం సుగమమైందని చెప్పారు. వేతనాల పెంపుతో స్టేషన్ మాస్టర్లు, టికెట్ చెకర్స్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు వంటి 40వేల మంది ఫీల్డ్ లెవెల్ వర్కర్లకు ప్రయోజనం చేకూరుతుందని త్రిపాఠి వివరించారు. చదవండి: ధైర్యముంటే భారత్ జోడో యాత్రను ఆపండి.. రాహుల్ గాంధీ ఛాలెంజ్ -
ఆ ఉద్యోగులకు దీపావళి కానుక.. 78 రోజుల బోనస్ ప్రకటించిన కేంద్రం
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించింది. పండగ సందర్భంగా 78 రోజుల బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈమేరకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. అయితే ఇది పర్మామెన్స్ ఆధారిత బోనస్ అని ఆయన స్పష్టం చేశారు. మొత్తం 11.27లక్షల మంది రైల్వే ఉద్యోగులు గరిష్ఠంగా రూ.17,951 పొందుతారని వివరించారు. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు పర్మామెన్స్ ఆధారిత ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు కేంద్రం ఇదివరకే తెలిపింది. అలాగే ఆయిల్ సంస్థలకు రూ.22వేల గ్రాంట్‌ను మంజూరు చేయనున్నట్లు ఠాకూర్ తెలిపారు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్(సవరణ)బిల్లు-2022కి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. చదవండి: శశి థరూర్‌తో నన్ను పోల్చకండి.. మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు -
పెద్దపల్లి: రైలు ఢీకొని ముగ్గురు రైల్వే ఉద్యోగులు మృతి
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ నుంచి బెంగుళూరు వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొని ముగ్గురు రైల్వే ఉద్యోగులు దుర్మరణం చెందారు. చీకురాయి, కొత్తపల్లి గ్రామాల మధ్య రైలు పట్టాలపై మరమత్తులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఒకరు పర్మినెంట్ ఉద్యోగి మొకద్దం దుర్గయ్య కాగా.. ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులు శ్రీనివాస్, వేణుగా గుర్తించారు. రైల్వే ఉద్యోగుల మరణంతో బాధితుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. చదవండి: జనగామ: కిడ్నాపైన బాలుడు షబ్బీర్ హత్య -
ఢిల్లీ రైల్వే స్టేషన్లో గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కీర్తినగర్ మెట్రో స్టేషన్లో దారుణం జరిగింది. ఇద్దరు రైల్వే ఉద్యోగులు ఓ మహిళపై లైంగికదాడికి పాల్పడ్డారు. మరో ఇద్దరు వారికి సహకరించారు. మొత్తం నలుగురినీ పోలీసులు అరెస్ట్ చేశారు. భర్త నుంచి వేరుగా ఉంటున్న ఓ ఒంటరి మహిళను ఉద్యోగం ఇప్పిస్తానంటూ రైల్వే ఉద్యోగి ఒకరు నమ్మించాడు. తన కుమారుడి బర్త్‌డే వేడుకకు రావాలంటూ ఆహ్వానించాడు. ఈనెల 21వ తేదీన కీర్తినగర్ మెట్రో స్టేషన్‌కు చేరుకున్న ఆమెను రాత్రి 10.30 గంటల సమయంలో ఆ ఆవరణలోనే ఉన్న రైల్వే ఎలక్ట్రికల్ సిబ్బంది గదికి తీసుకెళ్లాడు. ఇప్పుడే వస్తానంటూ వెళ్లి, మరో ఫ్రెండ్‌ను తీసుకొచ్చాడు. బయట మరో ఇద్దరు సహోద్యోగులు కాపలా కాస్తుండగా వీరు ఆమెపై అత్యాచారం చేశారు. శనివారం ఉదయం బాధితురాలు రైల్వే అధికారులకు తన ఆవేదనను వివరించింది. అధికారుల ఆదేశాల మేరకు, పోలీసులు బాధ్యులైన నలుగురు ఉద్యోగులను అరెస్ట్ చేశారు. -
రూపే కార్డులు : రైల్వే ఉద్యోగులకు సలహా
సాక్షి, న్యూఢిల్లీ : తమ డెబిట్ లేదా ఏటీఎం కార్డులను రూపే ఆధారిత కార్డుల్లోకి మార్చుకోవాలని 12 లక్షలకుపైగా తన ఉద్యోగులకు రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. ఆత్మనిర్భర్ భారత్ ప్రచారం, డిజిటల్ ఇండియా చొరవల్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనితోపాటు దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ రైల్వే ఇప్రెస్ట్ హోల్డర్లకూ ఈ తరహా విజ్ఞప్తినే చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉద్యోగులు రుపే కార్డులను ఎంచుకునేలా ప్రోత్సహించడానికి ఈ విషయంలో విస్తృత ప్రచారం ఇవ్వడానికి శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాయన్నారు.తమ ప్రస్తుత ఇప్రెస్ట్ కార్డులను రూపే కార్డులుగా మార్చుకోవాలని కోరుతోందని తెలిపారు. -
మోదీ పిలుపు.. రైల్వే ఉద్యోగుల భారీ విరాళం
న్యూఢిల్లీ : కరోనా వైరస్‌పై పోరులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కు పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రైల్వే ఉద్యోగులు కూడా తమ ఒక్క రోజు జీతాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళమిచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం ట్విటర్ వేదికగా ప్రకటించారు. ‘ప్రధాని మోదీ పిలుపు మేరకు నేను, రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగాడి మా ఒక్క నెల జీతాన్ని, 13లక్షల మంది రైల్వే , పీఎస్‌యూ ఉద్యోగులు తమ ఒక్క రోజు వేతానాన్ని విరాళంగా ఇస్తున్నాం. రూ. 151 కోట్లను పీఎం కేర్స్ ఫండ్‌కు అందజేస్తాం’ అని పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. అలాగే తన సహచర ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. మన దేశం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని తామంతా ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. కాగా, పీఎం కేర్స్ ఫండ్‌కు ప్రధాని మోదీ చైర్మన్‌గా ఉండగా, రక్షణశాఖ, ఆర్థిక, హోం శాఖ మంత్రులు సభ్యులుగా ఉన్నారు. -
రైల్వేలో 78 రోజుల బోనస్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. రైల్వేశాఖలోని ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్(పీఎల్బీ) అందించాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ..‘78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్ ఇవ్వాలన్న నిర్ణయం కారణంగా రైల్వేశాఖలో 11.52 లక్షలమందికిపైగా ఉద్యోగులు లబ్ధి పొందుతారు. దీనివల్ల కేంద్రం ప్రభుత్వంపై రూ.2,024.40 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ బోనస్‌తో ఉద్యోగులు మరింత ఉత్సాహంతో పనిచేయడానికి వీలవుతుంది. తద్వారా రైల్వేశాఖలో ఉత్పాదకత పెరుగుతుంది’ అని తెలిపారు. అయితే కేంద్రం కేవలం 78 రోజుల బోనస్ మాత్రమే ప్రకటించడంపై రైల్వే యూనియన్లు అసంతృప్తి వ్యక్తంచేశాయి. ఈ విషయమై అఖిలభారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య స్పందిస్తూ..‘రైల్వే ఉద్యోగుల పనితీరు, ఉత్పాదకత ఆధారంగా బోనస్ అందించాలని మేం కోరాం. ఈ విషయంలో రైల్వేబోర్డు ఉన్నతాధికారులతో చర్చలు కూడా జరిపాం. రైల్వే ఉద్యోగులు కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో పగలు–రాత్రి తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. మేం న్యాయమైన బోనస్‌నే కోరాం. కానీ దురదృష్టవశాత్తూ అది అమలుకాలేదు’ అని విమర్శించింది. -
రైల్వే ఉద్యోగులకు బోనస్ బొనాంజా
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. తద్వారా 11 లక్షల మంది ఉద్యోగులకు దసరా, దీపావళి సందర్బంగా ముందస్తు తీపి కబురు అందించింది. రైల్వే సిబ్బందికి బోనస్ అందించడం వరుసగా ఇది ఆరవ సంవత్సరం అని కేబినెట్ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి రూ . 2024 కోట్ల వ్యయం అవుతుందన్నారు. మీడియా సమావేశంలో కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, నిర్మలా సీతారామన్ -
ఉద్యోగాల పేరుతో రైల్వే ఉద్యోగుల మోసం
సాక్షి, గాజువాక(విశాఖ) : రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను గాజువాక పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ కేసులో రైల్వే ఉద్యోగులైన మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన కె.రఘునాథరావు, పి.శ్రీనివాసరావు పలువురు నిరుద్యోగులను నమ్మించారు. ఇద్దరు రైల్వే ఉద్యోగుల అండతో 2017, 2018వ సంవత్సరంలో 43 మంది నుంచి రూ.2.50కోట్లు వసూలు చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేశారు. వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లను కూడా తయారు చేసి ఇవ్వడంతోపాటు వైద్య పరీక్షలను కూడా చేయించి ఉద్యోగాల్లో చేరాలని చెప్పారు. నిరుద్యోగులు ఆ ఆర్డర్లను తీసుకొని భువనేశ్వర్‌లోని ఈస్టుకోస్టు రైల్వే ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఆ ఆర్డర్లను పరిశీలించిన రైల్వే అధికారులు అవి నకిలీ ఉత్తర్వులని నిర్థారించారు. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్న నిరుద్యోగులు గాజువాక పోలీసులను ఆశ్రయించారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అప్పటి నుంచి నిందితుల కోసం గాలిస్తున్నారు. చివరకు ఇద్దరు వ్యక్తులు పట్టుబడటంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు గాజువాక సీఐ సూరినాయుడు తెలిపారు. -
వార్షికాదాయ లక్ష్యం..రూ.20వేల కోట్లు!
విశాఖ కేంద్రంగా మంజూరైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. విశాఖను జోన్ ప్రధాన కేంద్రం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఇక్కడ ఉన్న రైల్వే డివిజన్‌ను విడగొట్టి రాయగడ, విజయవాడ డివిజన్లలో సర్దుబాటు చేసే ప్రక్రియతోపాటు.. రైల్వేజోన్ ఏర్పాట్లూ సాగుతున్నాయి. సరిహద్దులు, స్టేషన్లు, ఆదాయ వనరులు, సిబ్బంది, రైల్వే ప్రాజెక్టుల వర్గీకరణ వంటివాటికి ఒక రూపం ఇస్తున్నారు. ఈ వివరాలన్నింటితో రెండు నెలల్లో సమగ్ర నివేదిక(డీపీఆర్)ను రైల్వే బోర్డుకు అందజేయనున్నారు. ప్రధానంగా వాల్తేర్ డివిజన్ విభజన వల్ల ఏర్పడే ఆదాయ లోటును భర్తీ చేస్తూ.. జోన్ పరిధిలో ఏటా రూ.20 వేల కోట్ల ఆదాయం సాధించాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చర్యలు ముమ్మరమయ్యాయి. అందులో భాగంగా వాల్తేరు డివిజన్‌ను విభజించి ఒక భాగాన్ని కొత్తగా ఏర్పాటవుతున్న రాయగడ డివిజన్లో, మరో భాగాన్ని విజయవాడ డివిజన్లో కలిపేందుకు ఇప్పటికే మ్యాపింగ్ సిద్ధమవుతోంది. మరోవైపు దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌ను రెండు నెలల్లో సిద్ధం చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. కొత్త జోన్లో సుమారు 50 వేల మంది ఉద్యోగులు ఉండే అవకాశం ఉందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. వాల్తేర్ డివిజన్ విభజనపై వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దానిపై కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ.. కొత్త జోన్‌కు అడ్డంకులు లేకపోవడంతో రైల్వే బోర్డు సన్నాహాలతో ముందుకెళ్తోంది. ప్రారంభంలోనే 50 వేల మంది సిబ్బంది.. కొత్త జోన్‌ను ఏదో నామమాత్రంగా కాకుండా పక్కాగానే ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఆ దిశగా ప్రతిపాదనలు చేస్తున్నారు. సాధారణంగా జోన్ ఏర్పాటు సమయంలో 30 వేల నుంచి 40 వేల మంది ఉద్యోగులు మాత్రమే ఉండేవారు. క్రమంగా ఆ సంఖ్యను పెంచడం ఆనవాయితీ. కానీ దక్షిణ కోస్తా రైల్వే జోన్ మాత్రం 50 వేల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ప్రస్తుతం వాల్తేరు డివిజన్ కార్యాలయంలో 17,755 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వాల్తేర్ డీఆర్ఎం కార్యాలయంలో 900 మంది ఉద్యోగులున్నారు. ఈ డివిజన్‌ను విడదీస్తున్నందున వీరిని రెండు డివిజన్లకు సర్దుబాటు చేస్తున్నారు. విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లు సౌత్ కోస్ట్ జోన్ పరిధిలోకి వస్తున్నాయి. ఈ మూడు డివిజన్లు కలిపి మొత్తం 50 వేల ఉద్యోగులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రెండు నెలల్లో సమగ్ర నివేదిక.. కొత్త జోన్ ఏర్పాటుకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్) తయారీలో ఓఎస్డీతో పాటు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అధికారులు తలమునకలయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు కొత్త జోన్లో చేరుతున్నాయి. జోన్ స్వరూపం ఎలా ఉండాలి.. డివిజన్లతో సమన్వయం ఎలా కుదుర్చుకోవాలి.. జోన్ పరిధిలోకి వచ్చే రైల్వే స్టేషన్లు, ఉద్యోగుల విభజన, పని విభజన, తదితర అంశాలతో నివేదిక సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా వివిధ కేటగిరీల రైల్వే స్టేషన్లు, వాటిని కొత్త జోన్లో అభివృద్ధి చేసేందుకు ఉన్న వనరులు, జోన్ కేంద్రంగా కొత్తగా నడపాల్సిన రైళ్ల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు 30 శాతం వివరాలు సేకరించామని.. మిగతా వివరాల సేకరించి.. డీపీఆర్ నివేదిక తయారీకి మరో రెండు నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. మిగిలిన జోన్లతో పోలిస్తే.. విశాఖ కేంద్రంగా> ఏర్పాటవుతున్న సౌత్ కోస్ట్ జోన్ పటిష్టంగా ఉండబోతోందని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ జోన్ వార్షికాదాయం రూ.20 వేల కోట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వారు పేర్కొన్నారు. -
ఆ డాక్టర్ మాకొద్దు!
సాక్షి, గుంటుపల్లి (కృష్ణా) : వ్యాగన్ వర్క్‌షాపు రైల్వే వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ నిర్లక్ష్యంపై గురువారం ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు, కార్మికులు మధ్యాహ్నం భోజన సమయంలో వైద్యశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బ్రాంచి కార్యదర్శి గద్దా సురేష్ మాట్లాడుతూ ఆస్పత్రి వైద్యురాలు సుమలత రైల్వే కాలనీలో నివశిస్తున్న ఉద్యోగులు, కార్మికుల కుటుంబ సభ్యులు వైద్యశాలకు వెళితే దుర్భాషలాడుతున్నారని, మహిళా రోగులపై విరుచుకుపడుతోందని ఆరోపించారు. రోగులనే కనికరం లేకుండా అసభ్య పదజాలంతో దూషించటం వలన వారి మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. సరైన వైద్యం చేయకుండా మానసిక వత్తిడికి గురి చేస్తున్నారని ఉద్యోగులు విమర్శించారు. విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకునే ఉద్దేశ్యంతో యూనియన్ నాయకులు వైద్యశాలకు వెళితే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా ‘ఏం చేసుకుంటారో చేసుకోమని’ తెగేసి చెప్పటం దారుణమైన విషయమన్నారు. గతంలో వైద్యుల నిర్లక్ష్యంతో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, పలువురు అంగవైకల్యంతో మిగిలారని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ జె.ప్రదీప్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. -
రైల్వే ఉద్యోగులకు ‘సీజీహెచ్ఎస్’ చికిత్స
న్యూఢిల్లీ: భద్రతా ప్రమాణాలను పెంచడంలో భాగంగా రైల్వే ఉద్యోగులకు పలు చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. లోకో పైలట్లు, ట్రాక్మెన్లు, గ్యాంగ్మెన్లకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) కింద ఫిజియో థెరపీ, వృత్తి సంబంధ థెరపీ, స్పీచ్ థెరపీ వంటి చికిత్సలను అందించనున్నారు. ఇప్పటి వరకు ఈ చికిత్సలు రైల్వే ఉద్యోగులకు అందుబాటులో లేవు. ఒక వేళ బయట వేరే చోట చికిత్స చేయించుకున్నా వారికి రీయింబర్స్మెంట్ ఉండేది కాదు. ‘రైల్వేలో పెద్ద సంఖ్యలో డ్రైవర్లు, ట్రాక్మెన్లు, గ్యాంగ్మెన్లు పలు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ప్రయాణికుల భద్రత వీరిపైనే ఆధారపడి ఉన్న నేపథ్యంలో వారికి మెరుగైన చికిత్స అందించాలని నిర్ణయించాం’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
రైల్వే ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దసరా సందర్భంగా ఈ ఏడాది కూడా 78రోజులకు బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను రైల్వే ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్(పీఎల్బీ) కింద రూ. 2,044.31 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి రవిశంకర్‌ప్రసాద్ బుధవారం వెల్లడించారు. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్ లభించనుంది. దీని కింద ఉద్యోగులు తమ వేతనంతో పాటు రూ.17,951 అదనంగా బోనస్ కింద పొందనున్నారు. పీఎల్బీ బోనస్ కింద సుమారు 12.26లక్షల మంది రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్(ఆర్పీఎస్ఎఫ్) ఉద్యోగులకు ఇది వర్తించదు. -
రైల్వే ఉద్యోగులకు హెల్త్ కార్డులు
న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రస్తుతం ఇస్తున్న మెడికల్ కార్డులకు బదులుగా హెల్త్‌కార్డులను జారీ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. విశిష్ట గుర్తింపు సంఖ్యతో దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యేలా క్రెడిట్ కార్డు తరహాలో అందజేయనుంది. రైల్వే బోర్డు ఉత్తర్వుల ప్రకారం.. యూనిక్ ఐడీ నంబర్ ఉన్న హెల్త్ కార్డులను ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. ‘ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర లబ్ధిదారులకు హెల్త్ కార్డులను అందజేయాలని నిర్ణయించాం. ఇవి డెబిట్, క్రెడిట్ కార్డుల తరహాలో ఉంటాయి. కేటగిరీని బట్టి కలర్ ఉంటుంది. వీటి కాల పరిమితి ఐదేళ్లు’అని రైల్వే బోర్డు ఉత్తర్వుల్లో పేర్కొంది. -
3 రోజులు రైల్వే ఉద్యోగుల ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే ఉద్యోగుల యూనియన్ దేశవ్యాప్తంగా 72 గంటల నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. ఏడవ వేతన కమిషన్ ప్రొవిజన్లు అమలు చేయకపోవడం, ఈ రవాణా వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం నుంచి ఈ దీక్ష చేపట్టనున్నట్టు రైల్వే ఉద్యోగుల యూనియన్ పేర్కొంది. ఈ మేరకు ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్(ఏఐఆర్ఎఫ్) ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆర్గనైజేషన్ నాయకులతో ఏఐఆర్ఎఫ్ ఇప్పటికే పలుమార్లు సమావేశమైందని, హోం మంత్రి, ఆర్థికమంత్రి, రైల్వే మంత్రి, రైల్వే సహాయ మంత్రులు మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ఏడవ వేతన సంఘ సిఫారసులు అమల్లోకి వచ్చాక కనీస వేతనం మెరుగు పరచాలని, ఫిట్మెంట్ ఫాక్టర్ విషయంపైనా, పెన్షన్ విషయంలోనూ పలుమార్లు ప్రభుత్వానికి విన్నపించుకున్నామని ఏఐఆర్ఎఫ్ తెలిపింది. రెండేళ్ల సమయం వృద్ధా అయిన ఇప్పటివరకు వీటిపై ఎలాంటి ప్రకటన వెలువడ చేయలేదని ఏఐఆర్ఎఫ్ తెలిపింది. దీంతో ఏఐఆర్ఎఫ్తో అనుసంధానమైన అన్ని బ్రాంచులు మే 8 నుంచి మూడు రోజుల పాటు వరుసగా నిరాహార దీక్ష చేయున్నట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వేలో ఈ దీక్షలు చేపట్టనున్నామని చెప్పింది. మే 13-14 తేదీల్లో ఏఐఆర్ఎఫ్, జనరల్ కౌన్సిల్, వర్కింగ్ కమిటీతో మీటింగ్ నిర్వహించనుంది. -
ఆందోళన బాట పట్టిన రైల్వే ఉద్యోగులు
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఏకంగా పార్లమెంట్ ముందే నిరసన తెలిపేందుకు సిద్ధపడ్డారు. మంగళవారం నిర్వహించనున్న నిరసన ప్రదర్శనలో 40వేల మంది ఉద్యోగులు పాల్గొంటారని సమాచారం. దీనిపై ఆల్ ఇండియా రైల్వే ఫెడరేరషన్ సెక్రటరీ శివ్ గోపాల్ మిశ్రా మాట్లాడుతూ.. జాతీయ పెన్షన్ విధానాన్ని(ఎన్పీఎస్) రద్ధు చేయడంతో పాటు, తమ జీతాలను పెంచాలని కేంద్రాన్ని కోరామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రస్తుత ఎన్పీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఈ విధానంపై సమీక్షించడానికి గత సంవత్సరం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు అయినప్పటికీ ఎలాంటి పురోగతి లేదన్నారు. 2004 తర్వాత ఉద్యోగాల్లో చేరినవారికి కనీసం పెన్షన్ భద్రత కూడా లేదన్నారు. అన్నీ రైల్వే డివిజన్లకు చెందిన ఉద్యోగులు నిరసనలో పాల్గొంటారని తెలిపారు. కనీస వేతనాన్ని 18వేల నుంచి 26వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. తమ ఆందోళనల వల్ల రైళ్లలో ప్రయాణించేవారికి ఎటువంటి అంతరాయం ఉండబోదన్నారు. -
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్
-
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్
కేంద్ర మంత్రివర్గం ఆమోదం... ఖజానాపై రూ.2,245 కోట్ల భారం న్యూఢిల్లీ: రైల్వే నాన్‌గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇచ్చే ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. దీంతో 12.3 లక్షల మంది నాన్‌గెజిటెడ్ ఉద్యోగులు వారి ఉత్పాదకత ఆధారంగా గరిష్టంగా రూ.17,951ల బోనస్‌ను అందుకోనున్నారు. అయితే రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్), రైల్వే రక్షక ప్రత్యేక దళం (ఆర్పీఎస్ఎఫ్) ఉద్యోగులకు మాత్రం ఈ బోనస్ వర్తించదు. బోనస్‌ను దసరా సెలవులకు ముందే ఉద్యోగులకు అందజేయనున్నారు. లెక్కప్రకారం 201617 ఏడాదికి 72 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాల్సి ఉందనీ, అయితే గత ఆరేళ్ల నుంచి 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్నందున ఈ సారి కూడా దానిని కొనసాగించామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ‘ఉత్పాదకత ఆధారంగా బోనస్ ఇవ్వడం అనేది ఉద్యోగుల పనికి ప్రోత్సాహకంలా ఉంటుంది. కాబట్టి మరింత మంది రైల్వే ఉద్యోగులు తమ పనితీరును మెరుగుపరుచుకుని ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించేందుకు ఆస్కారం ఉంటుంది’ అని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. బోనస్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.2,245.45 కోట్ల భారం పడుతుందని ప్రకటన పేర్కొంది. మరోవైపు జమ్మూ కశ్మీర్లో యువతకు ఉద్యోగ శిక్షణ ఇచ్చే ఉడాన్ పథకం గడువును 2018 డిసెంబరు 31 వరకు పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 17 ముద్రణశాలల విలీనం దేశవ్యాప్తంగా ఉన్న 17 ప్రభుత్వ ముద్రణాలయాలను విలీనం చేసి వాటిని ఐదింటికి పరిమితం చేయాలన్న ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, మింటో రోడ్, మయపురి, మహారాష్ట్రలోని నాశిక్, కోల్‌కతాలోని టెంపుల్ స్ట్రీట్‌లో ఉన్న ముద్రణాలయాలు మాత్రమే ఇకపై పని చేస్తాయనీ, మిగిలిన వాటిని వాటిలో విలీనం చేస్తామని జైట్లీ చెప్పారు. ఆ ఐదింటినీ ఆధునీకరిస్తామనీ, మూతపడే ముద్రణాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను వాటిలోకి బదిలీ చేస్తామని ఆయన తెలిపారు. పౌష్టికాహార చార్జీల పెంపు అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద చిన్నారులు, కిశోర బాలికలు (11 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న వారు) , గర్భిణులు, బాలింతలకు ఇచ్చే పౌష్టికాహరానికి చెల్లించే చార్జీలను ప్రభుత్వం స్వల్పంగా పెంచింది. ఆరు నెలల నుంచి మూడేళ్ల మధ్య వయసున్న పిల్లలకు రోజుకు ఇచ్చే పౌష్టికాహారం చార్జీలను రూ.8 కి, గర్భిణులు, బాలింతలకు రూ.9.5కు ప్రభుత్వం పెంచింది. తీవ్ర పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు ఇచ్చే పౌష్టికాహారం చార్జీలను రోజుకు రూ. 12.5కు, కిశోర బాలికలకు రూ.9.5కు కేంద్రం పెంచింది. -
రైల్వే కార్మికులకు 78 రోజుల వేతనం బోనస్
గుంతకల్లు: రైల్వే కార్మికులకు తీపి కబురు అందింది. ఈ నెలలో దసరా, వచ్చే నెల దీపావళి పండుగలు జరగనున్న నేపథ్యంలో రైల్వేలో పనిచేసే కార్మికులకు 78 రోజుల వేతనం (వేజ్స్)ను బోనస్‌గా ఇవ్వాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. గుంతకల్లు రైల్వే డివిజన్ మొత్తం మీద దాదాపు 13500 మంది ౖపైగా రెల్వే కార్మికులు, ఉద్యోగులకు బోనస్ లభిస్తుందని తెలిసింది. ఒక్కో కార్మికుడికి నెలకు గరిష్టంగా రూ.8,975లు వేజేస్ లభిస్తే ఒక్క రోజుకు రూ.299.16లు వంతున లభిస్తుందని నిర్ధారించారు. ఈ లెక్కన రైల్వే బోర్డు ఆదేశాల మేరకు 78 రోజుల వేతనం బోనస్‌గా ఇవ్వాలంటే ఒక్కో కార్మికుడికి రూ.17950లు వస్తుంది. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చే అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలతో పాటు నెల్లూరు, మహబూబ్‌నగర్, రాయచూరు, బళ్లారి జిల్లాలలో పనిచేసే 13500 మంది రైల్వే కార్మికులు, ఉద్యోగులకు రూ.24 కోట్లను పంపిణీ చేయాల్సి ఉంటుందని ఒక రైల్వే అధికారి తెలిపారు. -
రైల్వే ఉద్యోగులకు పండుగ బోనస్
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం దసరా, దీపావళి కానుక అందించింది. రాబోయే పండుగలకు భారతీయ రైల్వే ఉద్యోగులకు అందించే బోనస్ పై ముఖ్యమైన ప్రకటన చేసింది. ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత లింక్డ్ బోనస్ (ప్రొడక్షన్ లింక్డ్ బోనస్ ) ప్రకటించింది. ఈ పథకం కింద రూ. 2,245 కోట్లను కేటాయించింది. అర్హతగల రైల్వే ఉద్యోగికి నెలకు కనిష్టంగా రూ.7వేల జీతం, గరిష్టంగా రూ.17,951 వేతన జీవులకు 78రోజుల వేతనం బోనస్‌గా అందించనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తద్వారా 12 లక్షల మందికి పైగా నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. అంతేకాదు పండుగకుముందే ఈ నెలాఖరుకు ఈ బోనస్‌ను చెల్లించనున్నట్టు వెల్లడించింది. బోనస్ ఇవ్వడం ద్వారా, ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు ప్రోత్సాహంతోపాటు, వారి ఉత్పాదకతను మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే రైల్వే కస్టమర్లకు భద్రత, వేగం, తదితర మెరుగైన సేవలను అందించడానికి, ప్రేరేపించడానికి దారి తీస్తుందని తెలిపింది. అలాగే కోలకత్తాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మెట్రో రైల్వే ఉద్యోగులకు జీతాలను ముందుగా చెల్లించనుంది. సెప్టెంబర్ 30కి బదులుగా సెప్టెంబర్ 22వ తేదీనే వీరికి జీతాలను అందించేందుకు మంత్రిత్వ శాఖ ఆమోదిం తెలిపింది. -
జాబ్‌మేళా.. జనమేళా
♦ రైల్వే జాబ్‌మేళాకు వివిధ ప్రాంతాల నుంచి 25 వేల మంది హాజరు ♦ ప్రారంభించిన కేంద్ర మంత్రి దత్తాత్రేయ హైదరాబాద్: రైల్వే ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లల కోసం దక్షిణమధ్య రైల్వే, కేంద్ర కార్మిక శాఖ తొలిసారిగా నిర్వహించిన జాబ్ మేళా ‘మన కోసం’ కు అనూహ్య స్పందన వచ్చింది. తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన ఈ మేళాను కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. వివిధ కంపెనీల్లోని 10 వేల ఉద్యో గాల కోసం నిర్వహించిన ఈ మేళాకు 21 వేల మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకోగా... 25 వేల మంది హాజరయ్యారు. దీంతో ప్రాంగణం కిటకిట లాడింది. పరిసర ప్రాంతాల్లో ఐదు గంటలకు పైగా ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దక్షిణమధ్య రైల్వే 6వ డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, విజయ వాడ, గుంతకల్లు, నాందేడ్ సర్కిళ్ల రైల్వే ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ జాబ్‌మేళాలో వివిధ కంపెనీలు ఐదువేల మందికి నియామక ఉత్తర్వులిచ్చాయి. మిగిలిన ఐదువేల మందికి వారం తరువాత ఉత్తర్వులిచ్చి, శిక్షణ కార్య క్రమాలు చేపడతామన్నాయి. అయితే ఇందులో పాల్గొన్న 109 కంపెనీల్లో చాలావరకు టెలీకాలర్, సేల్స్, డెలివరీ బాయ్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ వంటి ఉద్యోగాలే ప్రకటించడంతో ఎంతో ఆశతో వచ్చిన నిరుద్యోగులు నిరుత్సాహపడ్డారు. 100 కెరీర్ గైడెన్స్ కేంద్రాలు: దత్తాత్రేయ దేశoలో 60 శాతం ఉన్న యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ వివిధ పథ కాలు తెస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవా లని దత్తాత్రేయ పిలుపునిచ్చారు. బ్రెజిల్ తదితర దేశాలతో ఉద్యోగ నియామకాలపై అవగాహన ఒప్పందాలు కుదిరాయన్నారు. దేశ వ్యాప్తంగా 100 జాతీయ కెరీర్ సేవల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఓ కేంద్రం ప్రారంభించామని, త్వరలో వరంగల్, కరీంన గర్లతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌లో గుంటూరు, విజయవాడ, చిత్తూరు, వైజాగ్‌లలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇందులో ఉద్యోగాలు రాని వారి కోసం ఆగస్టు మొదటి వారంలో మరో జాబ్‌మేళా నిర్వహిస్తామని దక్షిణమధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ చెప్పారు. -
రైల్వే ఉద్యోగుల రెఫరల్ ఆస్పత్రిగా ‘గౌరీగోపాల్’
గుంతకల్లు : గుంతకల్లు రైల్వే డివిజన్లోని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అత్యవసర సేవలు కర్నూలులోని గౌరీ గోపాల్ ఆస్పత్రిలో పొందొచ్చు. అత్యవసర, మెరుగైన వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ‘గౌరీ గోపాల్’ ఆస్పత్రిని రెఫరల్ హాస్పిటల్‌గా ఎంపిక చేస్తూ రైల్వే జనరల్ మేనేజర్ అనుమతి ఇచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ గుంతకల్లు డివిజన్ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నంద్యాల, డోన్ తదితర ప్రాంతాల్లో పని చేస్తున్న రైల్వే ఉద్యోగుల దృష్ట్యా కర్నూలు నగరంలోని గౌరి గోపాల్ హాస్పిటల్లో వైద్యపరీక్షలు చేయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని రైల్వే జనరల్ మేనేజర్‌ను బుధవారం జరిగిన సంఘ్ సమావేశంలో కోరినట్లు ఆయన తెలిపారు. -
రైల్వే సిబ్బందికి 78 రోజుల బోనస్
- సీబీఈసీ ఐటీ ప్రాజెక్టుకు ఆమోదం - కేంద్ర కేబినెట్ నిర్ణయాలు న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు శుభవార్త. 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ఐదు సంవత్సరాలుగా ఇదే మొత్తంలో రైల్వే ఉద్యోగులకు కేంద్రం బోనస్ అందిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గానూ అర్హులైన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు(ఆర్పీఎఫ్, ఆర్పీఎస్ఎఫ్ సిబ్బందిని మినహాయించి) 78 రోజుల వేతనాన్ని ఉత్పాదకత ఆధారిత బోనస్(పీఎల్బీ)గా ఇవ్వనున్నారు. దసరా ముందు దాదాపు 12 లక్షల మంది రైల్వే ఉద్యోగులు ఈ బోనస్‌ను అందుకోనున్నారు. ఈ బోనస్ వల్ల రూ. 2090.96 కోట్ల భారం పడనుంది. తాము డిమాండ్ చేసిన మొత్తాన్ని బోనస్‌గా ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించడంపై ‘నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్’ సంస్థ ప్రధాన కార్యదర్శి ఎం రాఘవయ్య హర్షం వ్యక్తం చేశారు. ‘సాక్ష్యం’ ప్రాజెక్టుకు ఓకే వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వ్యవస్థతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్, కస్టమ్స్(సీబీఈసీ)ను అనుసంధానించేందుకు ఉద్దేశించిన ఐటీ ప్రాజెక్టు ‘సాక్ష్యం’కు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు వ్యయం రూ. 2,256 కోట్లు. ‘జీఎంబీఎం’ను అంగీకరించం పౌర విమానయానరంగ కార్బన్‌డై ఆక్సైడ్ ఉద్గారాల స్థాయిని 2020 నాటికి కనిష్టస్థాయికి తగ్గించాలన్న నిర్ణయానికి భారత్ తలొగ్గబోదని, అది అన్యాయమని కేబినెట్ భేటీ అనంతరం జవదేకర్ స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా తమకు మరింత సమయం అవసరమన్నారు. ఐరాసకు చెందిన ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రతిపాదిస్తున్న ‘గ్లోబల్ మార్కెట్ బేస్డ్ మెజర్స్(జీఎంబీఎం)’ తమకు ఆమోదనీయం కాదని తేల్చిచెప్పారు. కేబినెట్ భేటీలో జీఎంబీఎంపై చర్చించామన్నారు. పారిస్ ఒప్పందానికి ఓకే చరిత్రాత్మక పారిస్ వాతావరణ ఒప్పందానికి కేంద్ర కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా భూతాపోన్నతిని తగ్గించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై అంతర్జాతీయ స్థాయిలో ఈ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. వాతావరణ మార్పుపై పోరులో భారత్ నాయకత్వ స్థాయిని ఈ నిర్ణయం ప్రతిఫలిస్తుందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. కనీసం 55 దేశాలు అధికారికంగా ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. కాగా, సృజనాత్మకత, సాంకేతిక అభివృద్ధిలో పరస్పర సహకారానికి ఉద్దేశించి సింగపూర్‌తో కుదుర్చుకోనున్న అవగాహన ఒప్పందానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. -
రైల్వే ఉద్యోగులకు శుభవార్త!
న్యూఢిల్లీ: రానున్న పండుగల సీజన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. గత నాలుగు సంవత్సరాల మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేసినట్టు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మెన్ ప్రధాన కార్యదర్శి రాఘవయ్య పీటీఐ కి చెప్పారు. రైల్వే శాఖ నష్టాల మూలంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రొడక్టవిటీ లింక్డ్ బోనస్ (పీఎల్బీ) కింద 78 రోజుల వేతనాన్ని బోనస్ గా చెల్లించాలని కోరినట్టు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందన్నారు. 78 రోజుల బోనస్ ప్రతిపాద వచ్చే వారం క్యాబినెట్ ఆమోదం పొందనుందని తెలిపారు. గత నాలుగేళ్లగా దసరా పండుగ ముందు ఏటా సుమారు 12 లక్షల రైల్వే ఉద్యోగులకు ఇలా చెల్లించడం ఆనవాయితీగా వస్తోందని ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివ్ గోపాల్ మిశ్రా తెలిపారు. దీంతో ప్రతి ఉద్యోగి కనీసం రూ .18,000 బోనస్ లభిస్తుందని భావిస్తున్నామన్నారు. దీనికి కేంద్రం ఆమోదం లభిస్తే రైల్వేలకు సుమారు రూ 2000 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. గత ఏడాది చెల్లించిన కనీస బోనస్ ఉద్యోగి ప్రతి రూ 8.975 లభించిందనీ, ఈ ఏడాది ఇది రెట్టింపు అయ్యే అవకాశం ఉందన్నారు. బోనస్ చెల్లింపు నిర్ణయం ప్రజా రవాణా మెరుగుదలకు ఉద్యోగులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న నాన్ గెజిటెడ్ ఉద్యోగులు (ఆర్పీఎఫ్ / ఆర్పీఎఫ్ఎస్ఎఫ్ సిబ్బంది మినహా) ఇది వర్తిస్తుందని మిశ్రా చెప్పారు. కాగా రైలు ప్రయాణికుల సంఖ్య, లోడింగ్ గణనీయంగా క్షీణించిన కారణంగా రైల్వేసుమారు రూ 10,000 కోట్లను నష్టపోయింది. -
సన్నాఫ్ స్పీకర్.. వాటాల కోసం గూండాగిరీ
కోడెల ‘పెదబాబు’ దాష్టీకం... - రైల్వే కూలీలు, ఉద్యోగులపై అనుచరుల దాడి - పనుల వద్ద ఏర్పాటు చేసిన షెడ్లను పీకేసి దౌర్జన్యం - మూడు లారీలు, ఒక రైల్వే ఉద్యోగి కారు ధ్వంసం - డ్రైవర్, సూపర్ వైజర్ల కిడ్నాప్ - పర్సంటేజీ ఇవ్వకుండా పనిచేస్తారా అంటూ వార్నింగ్ - ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయకపోతే తగలబెడతామంటూ బెదిరింపులు సాక్షి, గుంటూరు : ‘‘పెదబాబుకు చెప్పకుండా.. ఆయన అనుమతి లేకుండా.. పనులు చేయడానికి మీకెంత ధైర్యంరా...’’ అంటూ రైల్వే కూలీలు, ఉద్యోగులపై కొందరు గూండాలు విచక్షణారహితంగా దాడి చేయడం ఆదివారం గుంటూరు జిల్లాలో కలకలం సృష్టించింది.. అధికార పార్టీ నేతల గూండాగిరికి ఇదో మచ్చుతునక.. ఎక్కడ ఏ పని జరిగినా అందులో వాటా ఇవ్వాల్సిందేనంటూ ‘తమ్ముళ్లు’ సాగిస్తున్న దౌర్జన్యకాండకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. ‘పెదబాబు’ అంటే స్పీకర్ కోడెల శివప్రసాదరావు పెద్దకుమారుడు శివరామకృష్ణే అని సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాలలో ఎవరినడిగినా చెబుతారు. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలానికి చెందిన సుమారు 35 మంది శివరామకృష్ణ అనుచరులు పెదనెమలిపురి గ్రామ పరిధిలో నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే పనులు చేస్తున్న ప్రాంతంలో విధ్వంసం సృష్టించారు. అక్కడ పనులు పర్యవేక్షిస్తున్న వారితోపాటు, పనులు చేస్తున్న కూలీలపై విచక్షణా రహితంగా దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతటితో ఆగకుండా వారు నివాసం ఉండేందుకు ఏర్పాటు చేసుకున్న షెడ్లను, అక్కడ పనులు నిర్వహిస్తున్న టిప్పర్ వాహనాలను, అధికారుల వాహనాలను సైతం ధ్వంసం చేశారు. ఓ డ్రైవర్‌తోపాటు, సైట్ సూపర్వైజర్ను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు.దీంతో కూలీలు, రైల్వే ఉద్యోగులు, తీవ్ర భయాందోళనతో పరుగులు తీశారు. తమకు వాటా ఇవ్వకుండా పనులు నిర్వహిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోడెల తనయుడు గతంలోనే రైల్వే కాంట్రాక్టరును పలుమార్లు బెదిరించారన్న ఆరోపణలున్నాయి. మాట వినకపోవడంతో రెండు నెలల క్రితం రైల్వే పనులు జరుగుతున్న ప్రాంతంలో దాడి చేశారు. అయినా దారికి రాకపోవడంతో రైల్వే ఉద్యోగులు, కాంట్రాక్టర్, కూలీలపై మరోమారు ఆదివారం దాడులకు తెగబడ్డారు. బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కర్రలు, రాడ్లతో దాడి ఆదివారం మధ్యాహ్న సమయంలో మూడు కార్లు, పలు ద్విచక్ర వాహనాలలో సుమారు 35 మంది దుండగులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కర్రలు, రాడ్లతో బీభత్సం సృష్టించారు. ఇక్కడ పనులు నిలిపివేయకుంటే ప్రాణాలు తీస్తాం, షెడ్లను తగలబెడతామంటూ బెదిరింపులకు దిగారు. కూలీలు ఉండే రేకుల షెడ్లను పీకేశారు. మూడు టిప్పర్ల అద్దాలను ధ్వంసం చేశారు. రైల్వే శాఖకు చెందిన బొలేరో కారు అద్దాలను ధ్వంసం చేశారు. రైల్వే సిబ్బందిగా ఉన్న డ్రైవర్ కృష్ణ, సూపర్వైజర్ ఎమ్డీ ఉస్మాన్‌లను కొట్టుకుంటూ తమ వాహనాల్లో ఈడ్చి పడేసి కిడ్నాప్ చేశారు. కర్రలతో, రాడ్లతో కార్మికులపై దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశారు. తీవ్రంగా భయపడిన కూలీలు అక్కడి నుంచి పరుగులు తీశారు. కొద్ది సేపటి తరువాత తేరుకున్న కూలీలు రైల్వే శాఖ ఉద్యోగులకు సమాచారం అందించి, స్వల్ప గాయాలైన క్షతగాత్రులను పిడుగురాళ్లలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఘటనపై పలువురు సిబ్బంది మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పనులకు స్థానిక నాయకులు వాటాలు అడుగుతూ అడ్డు తగలడం దారుణమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే పనులు నిలిపివేస్తామన్నారు. వాటా కోసం కాంట్రాక్టర్‌పై ఒత్తిడి... రాజుపాలెం మండలం పెదనెమలిపురి గ్రామం వద్ద నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే పనులు గత ఐదు నెలలుగా జరుగుతున్నాయి. పెదనెమలిపురి నుంచి రొంపిచర్ల వరకు 16 కిలోమీటర్ల మేర రైల్వే నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. ఇక్కడ భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటికే నష్టపరిహారం అందించి భూములను సైతం స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రతి పనికి పర్సంటేజీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలెదుర్కొంటున్న కోడెల తనయుడు తన వాటా పంపాలంటూ సదరు కాంట్రాక్టర్‌కు పలు మార్లు కబురు పంపారని తెలుస్తోంది. అయితే వాటిని కాంట్రాక్టరు పట్టించుకోకపోవడంతో కోడెల తనయుడి అనుచరులు రెండు నెలల క్రితం దాడి చేసి టిప్పర్లు, వాహనాలను ధ్వంసం చేయడంతోపాటు, పోలీసులతో బెదిరించినట్లు ఆరోపణలొచ్చాయి. అప్పట్లో దీనిపై సదరు కాంట్రాక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద పంచాయతీ కూడా పెట్టాడని సమాచారం. అయితే ఎవరు చెప్పినా తన వాటా ఇవ్వనిదే పనులు కొనసాగనిచ్చేందుకు అంగీకరించని కోడెల తనయుడు తన అనుచరులతో ఆదివారం రైల్వే పనులు చేపడుతున్న కార్మికులపై దాడికిదిగారు. షెడ్లు ఖాళీ చేయకుంటే తగలబెడతామన్నారు పది నిమిషాల్లో షెడ్లు ఖాళీ చేయాలని, లేకుంటే తగలబెడతాం అని రాళ్లతోను, ఇనుప రాడ్లతోను కూలీలపై ఎగబడ్డారు. అధికార పార్టీ నాయకులకు చెప్పకుండా పనులు చేస్తారా, మేమంటే లెక్కలేదా అంటూ దుర్భాషలాడారు. -జి రవికుమార్, సైట్ ఇంజనీర్ పది నిమిషాల్లో బీభత్సం పనులు వెంటనే నిలిపివేసి పదినిమిషాల్లో ఈప్రాంతాన్ని ఖాళీ చేయాలని హెచ్చరిస్తూ తెలుగుదేశం నాయకులు బీభత్సం సృష్టించారు. పెదబాబుకు చెప్పకుండా, ఆయన అనుమతి లేకుండా పనులు చేయడానికి మీకు ఎంత ధైర్యంరా... అంటూ మాపై ఎగబడ్డారు. అడ్డు వచ్చిన వారిని చితకబాదారు. -బి ప్రవీణ్‌రెడ్డి, సైట్ సూపర్వైజర్ స్థానిక నేతలకు చెప్పే పనిలేదా పనులు ప్రారంభించే సమయంలో అధికార పార్టీ సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు, ఎంపీపీకి చెప్పే పనిలేదురా.. అంటూ దుర్భాషలాడారు. మా నాయకుడిని ఎదిరించే ధైర్యం మీకెవరిచ్చార్రా.... క్షణాల్లో ఖాళీ చేయకపోతే జీపులు, టిప్పర్లు తగలబెడతాం అంటూ బెదిరించారు. -జి రామిరెడ్డి, సైట్ సూపర్వైజర్ -
జూలై 11 నుంచి రైల్వే నిరవధిక సమ్మె నోటీసు
రైల్ నిలయం వద్ద నేడు బహిరంగ సభ హైదరాబాద్: ఏడో వేతన సంఘం సిఫార్సులు రైల్వే కార్మికులకు తీవ్ర నిరాశను కలిగించాయని..ఈ సిఫార్సులకు నిరసనగా జూలై 11 నుంచి అఖిల భారత రైల్వే నిరవధిక సమ్మెకు రైల్వే సంఘాలు పిలుపునిచ్చినట్లు రైల్ మజ్దూర్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుభాష్ మాల్గి తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మజ్దూర్ యూనియన్ సభ్యులతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జూలై 11 నుంచి అఖిల భారత రైల్వే నిరవధిక సమ్మెకు పిలుపునిస్తూ రైల్వేలోని రెండు గుర్తింపు సంఘాలు నోటీసులు జారీచేశాయన్నారు. రైల్వే ఉద్యోగులు తమ న్యాయమైన కోరికలను సాధించుకొనేందుకు ఈ సమ్మెకు పిలుపునిచ్చామన్నారు. సమ్మె విజయవంతం చేయడానికి సోమవారం సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద బహిరంగ సభ ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని అన్ని సంఘాల నాయకులను కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు గీరం రాంప్రభు, హరిబాబు, పి. మోహన్, ఆదినారాయణ, మధుసూదన్‌రెడ్డిలు పాల్గొన్నారు. -
జూలై 11 నుంచి కేంద్ర ఉద్యోగుల నిరవధిక సమ్మె
- ఎన్ఎఫ్ఐఆర్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య - జంతర్‌మంతర్‌లో భారీ ఎత్తున ధర్నా న్యూఢిల్లీ : వచ్చే నెల 11వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రైల్వే కార్మికులు, కేంద్ర కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరూ నిరవధిక సమ్మెలో పాల్గొంటారని నేషనల్ ఫెడరేషన్ ఫర్ ఇండియన్ రైల్వేమెన్(ఎన్ఎఫ్ఐఆర్) ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 'కేంద్రం అనుసరిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మా 11 డిమాండ్లను వెంటనే నెరవేర్చాలంటూ జంతర్‌మంతర్‌లో రైల్వే, రక్షణ, తపాలా, తదితర కేంద్ర కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులతో ధర్నా నిర్వహించాం. దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయించాం. జులై 11 నుంచి నిరవధిక సమ్మె నిర్వహిస్తాం. జులై 11లోగా కేంద్రం సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరిస్తే సమ్మెపై పునరాలోచిస్తాం. రైల్వే సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బందులు కలిగితే మమ్మల్ని క్షమించాలని కోరుతున్నాం. కష్ట పరిస్థితుల్లో కూడా భారత రైల్వేను ప్రపంచంలో ప్రథమ స్థానంలో నిలిపాం. మాతో చేసుకున్న ఒప్పందాలను అమలుచేయడంలో రైల్వే శాఖ విఫలమైంది. ఏడో పీఆర్సీతో మాకు అన్యాయం చేశారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాల్సి ఉంది. కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి. ఉమ్మడిగా 32 లక్షల మంది కార్మికులు నిరవధిక సమ్మెలో పాల్గొంటారు. ప్రభుత్వం మాతో సంప్రదింపులకు రావాలి. రాజకీయాలతో మాకు సంబంధం లేదు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సమ్మెను అణచివేసేలా వ్యవహరిస్తే ప్రతిఘటిస్తాం..' అని పేర్కొన్నారు. రైల్వేలో కనీస వేతనం రూ.18 వేలకు పెంచాలని, పాత పెన్షన్ విధానం అమలుచేయాలని, రైల్వే ప్రైవేటీకరణకు అనుమతించరాదని తదితర డిమాండ్లతో సమ్మె చేపడుతున్నట్టు వివరించారు. బోనస్ పెంచాలని, కార్మికుడి పదవీకాలంలో 5 పదోన్నతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల సంస్కరణలను నిలిపివేయాలని కోరారు. -
ఇద్దరు రైల్వే ఉద్యోగుల అనుమానాస్పద మృతి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని క్యాంటీన్లో పనిచేసే ఇద్దరు రైల్వే ఉద్యోగులు అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని జనహార్ క్యాంటీన్లో బి. శంకర్, సాయిలు మల్లయ్య పని చేస్తుంటారు. అయితే మంగళవారం మధ్యరాత్రి 3గంటల సమయంలో క్యాంటీన్లో ఉన్న వీరిద్దరూ వాంతులు, విరోచనాలకు గురయ్యారు. అయితే స్థానికులు వెంటనే వీరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా సాయిలు మృతి చెందాడు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శంకర్ బుధవారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. ఇద్దరి మృత దేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
సమ్మె సైరన్ మోగిస్తాం
- నిరవధిక సమ్మెకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు : శివగోపాల్ మిశ్రా - సమ్మె తేదీలోపు ప్రభుత్వం స్పందించాలి - కార్మికులు సమ్మెకు దిగితే భారీ నష్టాలు వాటిల్లుతాయి - సమ్మె పోస్టర్ ఆవిష్కరణ హైదరాబాద్ : ఉద్యోగులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా జులై 11వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయనున్నామని ఎన్‌జేసీఏ కన్వీనర్, ఏఐఆర్ఎఫ్ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ సెంట్రల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇదివరకు కార్మికులపై కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక తీరుకు నిరసనగా 1968, 1974లో రైల్వేతో పాటు అన్ని శాఖల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం తాము చేపట్టనున్న సమ్మెలో 33 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటారన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వ్యతిరేకతకు నిరసనగా అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని తెలిపారు. తమ న్యాయపరమైన డిమాండ్లు ఏడవ వేతన సిఫార్సులో సవరణలు, కనీస వేతనం 18వేల నుంచి 26 వేల రూపాయలు ఇవ్వాలని, కొత్త పెన్షన్ విధానం వద్దని, వీటన్నింటిని వెంటనే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా వారు స్పందించడం లేదని ఆరోపించారు. ఎస్సీఆర్ఎంయూ ప్రధాన కార్యదర్శి సీహెచ్. శకర్రావు మాట్లాడుతూ.. ఎన్డీఏ సర్కార్ కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేసి పేద ప్రజలకు, కార్మికులకు అన్యాయం చేస్తోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతుంటే మన దగ్గర మాత్రం మోదీ సర్కార్ ధరలు తగ్గించకుండా సామాన్య ప్రజానీకం నడ్డి విరుస్తుందని ఎద్దేవా చేశారు. రైల్వేలో, డిఫెన్స్‌లో ఎఫ్‌డీఐను ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. 7 రోజులు రైల్వే సమ్మె జరిగితే థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూతపడతాయి, 10 రోజుల రైల్వే వ్యవస్థ సమ్మెతో పరిశ్రమలు మూత పడతాయి,15 రోజులు సమ్మె చేస్తే దేశం స్తంభించిపోతుందని తెలిపారు. అందువల్ల సమ్మె జరగకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలిస్తే బాగుంటుందని హెచ్చరించారు. తొలుత సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను శివగోపాల్ మిశ్రా ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పలు విభాగాల ఉద్యోగులు, మజ్దూర్ యూనియన్ నాయకులు సత్యనారాయణ, అరుణ్ కుమార్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వేలో సమ్మె సైరన్
కార్మికుల న్యాయపరమైన డిమాండ్ల సాధనకు జులై 11 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు సమ్మె నోటీసును సికింద్రాబాద్ రైల్ నిలయంలోని దక్షిణ మధ్యరైల్వే జీఎం రవీందర్‌కు కార్మిక నేతలు గురువారం సమ్మె నోటీసును అందజేశారు. రైల్వే కార్మిక సంఘం నేత రాఘవయ్య నేతృత్వంలో సికింద్రాబాద్ నుంచి భారీ ర్యాలీతో వచ్చి సమ్మె నోటీసు అందజేశారు. కొత్త పెన్షన్ విధానం, బిబేక్ దెబ్రయ్ కమిటీ రద్దుతోపాటు, ఖాళీ ఉద్యోగా లభర్తీ, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సమ్మెనోటీసు ఇచ్చిన రాఘవయ్య తెలిపారు. జులై 11లోపు తమ సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. -
మోగిన రైల్వే సమ్మె సైరన్
చెన్నై: దేశ వ్యాప్త రైల్వే సమ్మెకు సైరన్ మోగింది. ఏప్రిల్ 11 నుంచి దేశ వ్యాప్తంగా రైల్వే సమ్మె చేయనున్నట్లు సదరన్ రైల్వే మజ్దూర్ యూనియన్(ఎస్ఆర్ఎంయూ) స్పష్టం చేసింది. ఈ మేరకు రైల్వే కార్మికులంతా సిద్ధంగా ఉండాలని యూనియన్ పిలుపునిచ్చింది. దీంతో సమ్మెకు 45లక్షల మంది రైల్వే ఉద్యోగులు వెంటనే మద్దతు పలికారు.మొత్తం 36 అంశాల డిమాండ్లతో ఎస్ఆర్ఎంయూ సమ్మెకు దిగుతోంది. -
ఆ సేవలను పరిగణనలోకి తీసుకోవాల్సిందే
రైల్వేలో తాత్కాలిక ఉద్యోగిగా సేవలందించిన కాలంపై హైకోర్టు 13 ఏళ్ల నాటి ప్రశ్నకు విస్తృత ధర్మాసనం సమాధానం పదవీ విరమణ ప్రయోజనాలు దాతృత్వం కాదని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: రైల్వే ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల లెక్కింపునకు సంబంధించి ఉమ్మడి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘భారతీయ రైల్వేల్లో రోజువారీ వేతనంపై ఓ క్యాజువల్ లేబర్ పని చేసేవాడు. తర్వాత తాత్కాలిక ఉద్యోగిగా నియమితుడయ్యాడు. అనంతరం రెగ్యులర్ ఉద్యోగి అయ్యాడు. ఆ ఉద్యోగి పదవీ విరమణ ప్రయోజనాలను లెక్కించేటప్పుడు అతను తాత్కాలిక ఉద్యోగిగా సేవలందించిన కాలాన్ని, క్యాజువల్ లేబర్‌గా సేవలందించిన కాలంలో 50 శాతం కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా?’ అనే 2002 నాటి ప్రశ్నకు హైకోర్టు విస్తృత ధర్మాసనం సమాధానం ఇచ్చింది. ఆ కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. తాత్కాలిక, రెగ్యులర్ ఉద్యోగిగా ఎలాంటి అంతరాయం లేకుండా ఆ వ్యక్తి సేవలు అందించి ఉంటే ఆ ఉద్యోగి తాత్కాలిక ఉద్యోగ కాలం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.భోసలే, న్యాయమూర్తులు జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన విస్తృత ధర్మాసనం ఈ నెల 18న తీర్పునిచ్చింది. ధర్మాసనం తరఫున జస్టిస్ నవీన్‌రావు తీర్పు రాశారు. రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా చూడాలి.. ‘రైల్వేబోర్డు రూల్ 20 ప్రకారం ఓ ఉద్యోగి సర్వీసును అతను మొదట ఏ పోస్టులో చేరారో అప్పటి నుంచి లెక్కించాలి. అది తాత్కాలిక ఉద్యోగమైనా సరే. అయితే ఆ ఉద్యోగాన్ని నిరాటంకంగా చేసి ఉండాలి. ఈ విషయంలో తాత్కాలిక ఉద్యోగిని కూడా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా చూడాలి. కాబట్టి పదవీ విరమణ ప్రయోజనాలు లెక్కించేటప్పుడు అతను పనిచేసిన కాలంలో 50 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం ఎంత మాత్రం అర్థం లేని పని.’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ప్రయోజనాలు దాతృత్వంతో ఇచ్చేవి కావు.. ‘ఓ నిబంధన ఎక్కువ మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుస్తుంటే, ఆ నిబంధన పట్ల ఉదారతతో వ్యవహరించి ఆ మేర భాష్యం చెప్పాల్సి ఉంటుంది. పదవీ విరమణ ప్రయోజనాలు దాతృత్వంతో ఇచ్చేవి ఎంత మాత్రం కావు. ఓ ఉద్యోగి ఎంతో కష్టపడి, నిబద్ధతతో అందించిన సేవలకు గాను నగదు రూపంలో ఇచ్చే గుర్తింపు.’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది. -
ఆ ఎమ్మెల్యేకు అరెస్ట్ వారెంట్
టీనగర్: మదురై ఎమ్మెల్యేకు అరెస్టు వారెంట్ జారీ అయింది. రామేశ్వరం రైల్వే స్టేషన్లో 2013లో జరిగిన రైల్వే ఉద్యోగుల కార్మిక సంఘం ఎన్నికల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీనికి సంబంధించి చర్యలు తీసుకున్న పోలీసులు కొందరిని అరెస్టు చేశారు. రైల్వే ఉద్యోగులు, సీపీఎం కార్యకర్తలపై పోలీసులు దాఖలు చేసిన కేసులను రద్దు చేయాలని కోరుతూ మదురై సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నాదురై నేతృత్వంలో ఆ పార్టీ వారు రామేశ్వరంలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ర్యాలీ జరిపారు. దీనికి సంబంధించిన కేసులో ఎమ్మెల్యే అన్నాదురై, రామేశ్వరం సీపీఎం నిర్వాహకులు వడకొరియ, జస్టిన్ అనే ముగ్గురు హాజరుకాలేదు. కేసుపై విచారణ జరిపిన మెజిస్ట్రేట్ ఇళవరసి ఎమ్మెల్యే అన్నాదురై సహా ముగ్గురికి అరెస్టు వారెంట్ జారీ చేశారు. -
యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు
శనివారం మధ్యాహ్నం నుంచి రైళ్లు పునఃప్రారంభం హొసూరు: బెంగళూరు-ఎర్నాకుళం ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం ఉదయం పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 9 మంది మంది మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. హొసూరు సమీపంలోని ఆనేకల్-హొసూరు మధ్య కర్పూర గ్రామం వద్ద బోగీలు పట్టాలు తప్పాయి. శుక్రవారం ఉదయం నుంచి బెంగళూరు-హొసూరు మీదుగా వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి యుద్ధ ప్రాతిపదికన రైలు మార్గం పునరుద్ధరణ పనులు చేపట్టారు. దెబ్బతిన్న రైలు బోగీలను క్రేన్ల సాయంతో బయటకు తీశారు. ప్రమాదానికి గురైన డి8, డి9, డి10, డి11 బోగీలను పక్కకు తొలగించారు. మిగతా బోగీలను ఆనేకల్ రైల్వేస్టేషన్‌కు తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి రైలు పట్టాల మధ్య శ్రమించిన రైల్వే ఉద్యోగులు 500 మంది మరమ్మతు పనులను శనివారం ఉదయానికే పూర్తి చేశారు. తెగిపోయిన పట్టాలను 400 మీటర్ల వరకు సరిచేశారు. 20 కిలోమీటర్ల వేగం కొత్తగా ఏర్పాటు చేసిన పట్టాలపై వారం రోజులు 20 కిలోమీటర్ల వేగంతో మాత్రమే రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. శనివారం ఉదయం 10.30 గంటలకు రైలు మార్గం మరమ్మతులు పూర్తయ్యాయి. మొదట గూడ్స్ రైలును పట్టాలపై నడిపి అధికారులు పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం 2.20 నిమిషాలకు లోకమాన్యతిలక్ ఎక్స్‌ప్రెస్ రైలును మొదటి సారిగా నడిపారు. -
మామా అల్లుళ్లే సూత్రధారులు!
ఆర్ఆర్సీ పరీక్షపత్రం లీక్, ‘హైటెక్ కాపీయింగ్’పై కదులుతున్న డొంక పరారీలో మామ మచ్ఛేందర్, అల్లుడు మహేందర్ మహారాష్ట్రలోనూ ఇదే తంతు సాగించినట్లు వెల్లడి నిందితుల్లో తొమ్మిది మంది రైల్వే ఉద్యోగులు ఎలక్ట్రానిక్ పరికరాలు విక్రయించిన దుకాణం సీజ్ సాక్షి, హైదరాబాద్: సంచలనం రేపిన ఆర్ఆర్సీ (రైల్వే నియామక విభాగం) పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో డొంక కదులుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోనే కాకుండా ఈ ముఠా మహారాష్ట్రలో కూడా ప్రశ్నపత్రం లీకేజీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. నవంబర్‌లో ఆర్ఆర్సీ రైల్వే గ్రూప్-డీ ఉద్యోగాల కోసం ఐదు దఫాలుగా 3.91 లక్షల మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించింది. చివరగా నవంబర్ 30న జరిగిన పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్‌ను సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు గుట్టు రట్టు చేసి పదిమంది అభ్యర్థులు, వారికి సహకరించిన ఇరవై మంది సభ్యుల ముఠాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరందరినీ మల్కాజ్గిరి ఇన్స్పెక్టర్ శేఖర్‌గౌడ్ సోమవారం కోర్టులో హాజరుపర్చి, జ్యుడీషియల్ కస్టడీ కోసం చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే పోలీసుల విచారణలో నిందితులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గత నెల 23న (ఆదివారం) నాలుగో దఫా పరీక్షల్లో కూడా ఇదే పద్ధతుల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రశ్నపత్రం లీక్ చేసి అభ్యర్థులకు సమాధానాలు చేరవేశారని తేల్చింది. ఈ వ్యవహారానికి సూత్రధారిగా ఉన్న రైల్వే ఎలక్ట్రానిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న మచ్ఛేంద్ర మౌలాలిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం మాదిరిగానే మహారాష్ట్రలో కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. తన అల్లుడు మహేందర్‌తో కలసి ఈ మొత్తం వ్యవహారం నడిపించాడు. వీరికి రెండు పరికరాలు కీలకంగా మారాయి. ఒకటి.. మెడలో వేసుకునే తాయెత్తు మాదిరిగా తయారు చేసిన ‘సిమ్’ కార్డులు కలిగిన అతి చిన్న ఎలక్ట్రానిక్ డివైస్ (సెల్‌ఫోన్), రెండోది..చెవిలో పెట్టుకునే ‘వైర్లెస్ ఇయర్‌ఫోన్’. ఈ అత్యాధునిక పరికరాలను నిందితులు బేగంపేటలోని ఓ సెల్‌ఫోన్ దుకాణం నుంచి కొనుగోలు చేశారని తేలింది. ఈ దుకాణంపై పోలీసులు సోమవారం దాడి చేసి, సీజ్ చేశారు. ఇక్కడి నుంచి కీలక సాక్ష్యాధారాలను (సిమ్‌కార్డులు, సెల్ఫోన్లు) పోలీసులు సేకరించారు. దుకాణం యజమాని పరారీలో ఉన్నాడు. ఈ పరికరాలను ఢిల్లీ, ముంబాయి నుంచి తెప్పించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నిందితుల వద్ద లభించిన 27 సిమ్‌కార్డుల వివరాలపైనా దర్యాప్తు సాగుతోంది. నిందితులను తిరిగి కస్టడీకి తీసుకునే అవకాశం ఉందని మల్కాజ్గిరి ఏసీపీ ఎం.రవిచందన్‌రెడ్డి తెలిపారు. సూత్రధారులైన మచ్ఛేందర్, మహేందర్ల కోసం గాలిస్తున్నామన్నారు. మామా అల్లుళ్ల పథకం ఇలా... మచ్చేందర్ లాలాగూడలోని లోకోషెడ్‌లో గ్రేడ్ వన్ టెక్నీషియన్‌గా, మహేందర్ తాండూరు రైల్వే ఎలక్ట్రికల్ విభాగంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. ఆర్ఆర్బీ పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజీ ద్వారా డబ్బు సంపాదించుకోవాలనుకున్న వీరు.. కొందరు రైల్వే ఉద్యోగులు, నిరుద్యోగులతో ముఠా తయారు చేశారు. ప్రశ్నపత్రం బయటకు రావడానికి మచ్ఛేందర్ పరీక్ష జరిగే రోజు పరీక్షా సెంటర్ వద్దకు తనతోపాటు అల్లుడు మహేందర్‌ను వెంటబెట్టుకెళ్లేవాడు. అక్కడి ఇన్విజిలేటర్లకు స్క్వాడ్‌గా పరిచయం చేసుకొని పరీక్ష హాల్లోకి వెళ్లేవాడు. ఆ సమయంలో మహేందర్ తన ఫోన్లో ప్రశ్నపత్రం ఫొటో తీసి బయట ఉన్న వ్యక్తికి పంపేవాడు. ప్రశ్నపత్రం అందుకున్న వ్యక్తి దానికి జిరాక్స్ తీయించి నలుగురైదుగురు నిపుణులైన వారితో జవాబులు తయారుచేయించేవాడు.వాటిని సెల్ ఫోన్లతో పరీక్షహాల్లో అభ్యర్థులకు చేరవేసేవారు. పట్టుబడినవారిలో ఏడుగురు విద్యార్థులు, గృహిణి, ఏడుగురు రైల్వే ఉద్యో గులున్నారు. విద్యార్థుల్లో ఎల్ఎల్బీ, ఎంటెక్, బీఈడీ చదువుతున్న వారు, రైల్వే ఉద్యోగుల్లో జూనియర్ ఇంజనీర్, ముగ్గురు లోకోషెడ్ ఉద్యోగులు, ఇద్దరు కళాసీలు, పంప్ ఆపరేటర్ ఉన్నారు. ఆర్ఆర్సీ పరీక్షల రద్దు యోచన లేదు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో వెల్లడి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌పై దక్షిణమధ్య రైల్వే అధికారికంగా స్పందించింది. నవంబర్ నెలలో 5 విడుతలుగా జరిగిన ఆర్ఆర్సీ పరీక్షలను రద్దు చేసే యోచన లేదని, 30వ తేదీన హైదరాబాద్‌లో జరిగిన మాస్ కాపీయింగ్‌పై ఉన్నత స్థాయి విచారణ చేపట్టామని దక్షిణమధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి కె.సాంబశివరావు తెలిపారు. హైటెక్ తరహాలో జరిగిన ఈ ఘటనలో రైల్వే ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు తేలితే వారిపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం తన చాంబర్లో ఈ విషయమై విలేకరులతో మాట్లాడారు. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన వివిధ విభాగాల నుంచి కూడా నివేదికలను తెప్పిస్తున్నట్లు చెప్పారు. -
టీటీఐలకు భద్రత కల్పించాలి
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: రైళ్లలో పనిచేసే టీటీఐలు, టీటీఈలకు భద్రత కల్పించాలని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ బ్రాంచి సెక్రటరీ కుప్పాల గిరిధర్‌కుమార్ డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన టీటీఐ విజయకుమార్‌ను టికెట్లు లేని ప్రయాణికులు నడుస్తున్న రైల్లో నుంచి తోసేసిన ఘటనకు నిరసనగా బుధవారం తిరుపతిలో యూనియన్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిరిధర్‌కుమార్ మాట్లాడుతూ రైల్వే శాఖలోని కమర్షియల్ విభాగంలో వేలాది ఖాళీలను భర్తీ చేయకుండా టీటీఐలకు వసూలు లక్ష్యాలను పెంచడంతోనే ఇలాంటి సంఘటనలకు దారి తీస్తోందన్నారు. గతంలో ఒక్కో టీటీఐ నెలకు రూ.40 వేలు టికెట్లు లేని ప్రయాణికుల నుంచి వసూలు చేయాల్సి ఉండగా ప్రస్తుతం ఆ లక్ష్యాన్ని రూ.1.65 లక్షలకు పెంచడం విడ్డూరమన్నారు. లక్ష్యాలను పెంచడంతో రైళ్లలో టికెట్లు లేకుండా ప్రయాణించే వారిపై కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందన్నారు. దీంతో టికెట్లు లేని ప్రయాణికులు టీటీఐలను నడుస్తున్న రైళ్లలో నుంచి తోసేస్తూ ఆందోళనకర వాతావరణాన్ని సృష్టిస్తున్నారని వాపోయారు. వసూలు లక్ష్యాల కోసం రాత్రింబవళ్లు మానసిక వేధనలకు కూడా టీటీఐలు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇకనైనా రైల్వే శాఖ టీటీఐల సమస్యలను పరిష్కరించి, రైళ్లలో విధుల నిర్వహణ సమయంలో భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ చైర్మన్ ఎన్వీ రమణరావు, సీటీటీఐ కృష్ణానాయక్, నాయకులు టీవీ రావు, ఎస్.విజయకుమార్, వేణుమాధవ్, బుకింగ్ సిబ్బంది వేణు, ఏఎస్ రావు, పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిషిద్ధ వస్తువులతో రెలైక్కిన నేవీ ఉద్యోగి
బాంబులుగా అనుమానించి రైళ్లు నిలిపివేత విశాఖ స్టేషన్లో అర్ధరాత్రి ముమ్మర తనిఖీలు విశాఖపట్నం, న్యూస్‌లైన్: ప్రశాంతమైన విశాఖ రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి కలకలం రేగింది. మంగళవారం రాత్రి 11.30 నుంచి 1.30 గంటల వరకూ రైల్వే ఉద్యోగులను పరుగులు పెట్టిం చింది. వం దలాది మంది ప్రయాణికులను ఆందోళనకు గు రి చేసింది. ఓ వ్యక్తి వద్ద బాంబులున్నాయంటూ రేగిన కలకలం దావానంలా వ్యాపించి రైల్వే, ఆర్పీఎఫ్, నగరపోలీస్, నేవల్ అధికారుల్లో అల జడి రేపింది. ఉన్నతాధికారులను అప్రమత్తం చేసింది. 11.30 గంటలకు రైలు బయల్దేరాల్సిన వే ళలో ప్రయాణికులంతా ఒక్క ఉదుటన దిగేశా రు. ఎవరిని అడిగినా బాంబు ఉందట అనే మా టతోనే అంతా పరుగులంకించుకున్నారు. ఓ బోగీ వద్ద ప్లాట్‌ఫారంపై పోలీసులు పెద్ద ఎత్తు న గుమిగూడడంతో అక్కడే బాంబు ఉందంటూ వ దంతులు వ్యాపించాయి. అంతే అంతా పరుగులు.. ఆర్పీఎఫ్ బూటు చప్పళ్లతో విశాఖ రైల్వే స్టేషన్ మార్మోగిపోయింది. మంగళవారం అర్ధరాత్రి విశా ఖ నుంచి ఎల్టీటీ వెళ్లాల్సిన లోకమాన్య తిలక్ టెర్మినస్(ఎల్టీటీ) ఎక్స్‌ప్రెస్ వద్ద ఈ సంఘటన జరిగింది. పోలీసు అధికారులంతా సంఘటన స్థలానికి చేరుకుని ఆ బాంబులున్న వ్యక్తి నేవల్‌లో అధికారిగా నిర్ధారించుకుని ఆర్పీఎఫ్ స్టేషన్‌కు తీసుకుపోయారు. రైలుకు ప చ్చజెండా ఊపేశారు. ఈ రైలు కోసం మూడు నాలుగు రైళ్లు బయల్దేరకుండా ఆగిపోయాయి. విష యం ఏంటంటే హైదరాబాద్ నేవల్ కెనాల్లో విష్ణుకుమార్ అరియార్ అనే బీహార్ వ్యక్తి అధికారిగా పనిచేస్తున్నా రు. ఇటీవల ఆయన విశాఖ నేవల్ డాక్‌యార్డ్‌లో డాగ్‌స్క్వాడ్‌కు శిక్షణిచ్చేందుకు వచ్చారు. తిరిగి లోకమాన్యతిలక్ ఎక్స్‌ప్రెస్‌లో ప్ర యాణమయ్యేందుకు మంగళవారం రాత్రి విశాఖ స్టేషన్‌కు వచ్చారు. అరియార్ ప్రవర్తన, మాటతీరు, భాష కాస్త డిఫరెంట్ గా ఉండడంతో ఆయన బాంబు పెట్టేందుకే వచ్చి ఉంటాడని అంతా కేకలు పెట్టారు. పోలీసుల తనిఖీల్లో కూడా పేలుడు పదార్థాలు, బాంబులను నిర్వీర్యం చేసే కొన్ని పరికరాలు, బాం బులను అమర్చేందుకు ఏర్పాటు చేసే సామగ్రి అంతా ఉండడంతో పోలీసులు కూడా అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. వాస్తవంగా ఆయన వద్ద ఓ స్నైపర్ డాగ్, రెండు శాంపి ల్స్ ఉన్న పేలుడు పదార్ధాల పెట్టె వుంది. రాత్రంగా ఆయన వద్ద ఉన్న గుర్తింపు కార్డులు చూసి వివరాలు అడిగి తెలుసుకుని నేవల్ పోలీసులతో నిర్ధారించుకున్న తర్వాత ఆయనను విడచిపెట్టారు. -
దక్షిణ మధ్య రైల్వేలో మోగనున్నసమ్మె సైరన్!
హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వేలో సమ్మె సైరన్ మోగనుంది. డిమాండ్ల సాధనకు రైల్వే కార్మికులు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. సమ్మెకు భారీ స్థాయిలో రైల్వే ఉద్యోగులు మద్దతు తెలపడంతో సమ్మె అనివార్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి స్ట్రైక్ బ్యాలెట్ ఫలితాలను మజ్దూర్ యూనియన్ సోమవారం ప్రకటించింది. 68, 640 మంది ఉద్యోగులు ఓటింగ్ లో పాల్గొనగా, 68,190 మంది ఉద్యోగులు సమ్మెకు మద్దతు తెలిపారు. దీనిపై వచ్చే నెల 15, 16, 17 తేదీల్లో సమావేశమై సమ్మె తేదీలను ప్రకటిస్తామని యూనియన్ ప్రదాన కార్యదర్శి శంకర్ రావు తెలిపారు. ఇందులో భాగంగా కార్మికుల అభిప్రాయం తెలుసుకునేందుకు ఆలిండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ దేశవ్యాప్తంగా 17 రైల్వే జోన్లలో స్ట్రైక్ బ్యాలెట్ నిర్వహించింది. శుక్రవారం ప్రారంభమైన ఈ కార్యక్రమం శనివారం కూడా కొనసాగింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 80 వేల మంది ఇందులో పాల్గొననున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, గుంతకల్, తిరుపతి లాంటి ముఖ్య స్టేషన్లలో వేలాదిగా కార్మికులు పాల్గొన్నారు. దీనిలో వ్యక్తమైన అభిప్రాయంపై చర్చించి సమ్మెపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ద.మ. రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శంకరరావు చెప్పారు. -
రైల్వేలో సమ్మె కూత?
పెండింగులో ఉన్న తమ డిమాండ్లను రైల్వేశాఖ పట్టించుకోవటం లేదని గుర్రుగా ఉన్న రైల్వే సిబ్బంది సమ్మెకు సిద్ధమవుతున్నారు. కొంతకాలంగా రైల్వే బోర్డును హెచ్చరిస్తూ వస్తున్న కార్మిక సంఘాలు, ఇక సమ్మెకు దిగటమే ఉత్తమమని నిర్ణయించాయి. అయితే సమ్మె విషయంలో సిబ్బంది అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ‘స్ట్రైక్ బ్యాలెట్’ నిర్వహించాలని రైల్వే కార్మిక సంఘాల సమాఖ్య నిర్ణయించింది. బ్యాలెట్ తేదీలను ఖరారు చేసే బాధ్యతను స్టీరింగ్ కమిటీకి అప్పగించింది. మెజార్టీ అభిప్రాయం ఆధారంగా సమ్మెపై నిర్ణయం తీసుకోనున్నారు. విశాఖపట్టణంలో డిసెంబరు 10 నుంచి 12 వరకు జరిగే సమాఖ్య జనరల్ బాడీ మీటింగ్‌లో సమ్మె తేదీలను ఖరారు చేస్తారు. బ్యాలెట్‌పై కార్మికుల్లో చైతన్యం తెచ్చేందుకు ముమ్మరంగా ప్రచారం నిర్వహించాలలని ఆయా యూనియన్లకు ఆదేశాలు అందటంతో అవి ఆ పనుల్లో నిమగ్నమయ్యాయి. ఏడో వేతన సంఘం ఏర్పాటు, కొత్త పింఛన్ విధానం రద్దు, డీఏతో కూడిన వేతనం, ఆదాయపన్ను నుంచి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మినహాయింపు, టెక్నికల్-2 కేడర్ సిబ్బంది వేత న సవరణ, 12 గంటల డ్యూటీ విధానం రద్దు... తదితర 17 డిమాండ్లను గతంలోనే యూనియన్లు రైల్వే బోర్డు ముందుంచాయి. వీటికి స్పందన రాకపోవటంతో సమ్మె దిశగా కార్మికులు అడుగులేస్తున్నారు.