పెండింగులో ఉన్న తమ డిమాండ్లను రైల్వేశాఖ పట్టించుకోవటం లేదని గుర్రుగా ఉన్న రైల్వే సిబ్బంది సమ్మెకు సిద్ధమవుతున్నారు.
పెండింగులో ఉన్న తమ డిమాండ్లను రైల్వేశాఖ పట్టించుకోవటం లేదని గుర్రుగా ఉన్న రైల్వే సిబ్బంది సమ్మెకు సిద్ధమవుతున్నారు. కొంతకాలంగా రైల్వే బోర్డును హెచ్చరిస్తూ వస్తున్న కార్మిక సంఘాలు, ఇక సమ్మెకు దిగటమే ఉత్తమమని నిర్ణయించాయి. అయితే సమ్మె విషయంలో సిబ్బంది అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ‘స్ట్రైక్ బ్యాలెట్’ నిర్వహించాలని రైల్వే కార్మిక సంఘాల సమాఖ్య నిర్ణయించింది. బ్యాలెట్ తేదీలను ఖరారు చేసే బాధ్యతను స్టీరింగ్ కమిటీకి అప్పగించింది.
మెజార్టీ అభిప్రాయం ఆధారంగా సమ్మెపై నిర్ణయం తీసుకోనున్నారు. విశాఖపట్టణంలో డిసెంబరు 10 నుంచి 12 వరకు జరిగే సమాఖ్య జనరల్ బాడీ మీటింగ్‌లో సమ్మె తేదీలను ఖరారు చేస్తారు. బ్యాలెట్‌పై కార్మికుల్లో చైతన్యం తెచ్చేందుకు ముమ్మరంగా ప్రచారం నిర్వహించాలలని ఆయా యూనియన్లకు ఆదేశాలు అందటంతో అవి ఆ పనుల్లో నిమగ్నమయ్యాయి.
ఏడో వేతన సంఘం ఏర్పాటు, కొత్త పింఛన్ విధానం రద్దు, డీఏతో కూడిన వేతనం, ఆదాయపన్ను నుంచి ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ మినహాయింపు, టెక్నికల్-2 కేడర్ సిబ్బంది వేత న సవరణ, 12 గంటల డ్యూటీ విధానం రద్దు... తదితర 17 డిమాండ్లను గతంలోనే యూనియన్లు రైల్వే బోర్డు ముందుంచాయి. వీటికి స్పందన రాకపోవటంతో సమ్మె దిశగా కార్మికులు అడుగులేస్తున్నారు.