ఇద్దరు రైల్వే ఉద్యోగుల అనుమానాస్పద మృతి | The mysterious death of two railway employees | Sakshi
Sakshi News home page

ఇద్దరు రైల్వే ఉద్యోగుల అనుమానాస్పద మృతి

Jun 22 2016 7:31 PM | Updated on Sep 4 2017 3:08 AM

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని క్యాంటీన్‌లో పనిచేసే ఇద్దరు రైల్వే ఉద్యోగులు అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.

 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని క్యాంటీన్‌లో పనిచేసే ఇద్దరు రైల్వే ఉద్యోగులు అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని జనహార్ క్యాంటీన్‌లో బి. శంకర్, సాయిలు మల్లయ్య పని చేస్తుంటారు. అయితే మంగళవారం మధ్యరాత్రి 3గంటల సమయంలో క్యాంటీన్‌లో ఉన్న వీరిద్దరూ వాంతులు, విరోచనాలకు గురయ్యారు. అయితే స్థానికులు వెంటనే వీరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా సాయిలు మృతి చెందాడు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శంకర్ బుధవారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. ఇద్దరి మృత దేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement