అంబర్‌పేట శంకర్‌కు నోటీసులు | Amberpet Shankar Questioned By Police In Builder Complaint Case, Notices Issued To 7 Accused | Sakshi
Sakshi News home page

అంబర్‌పేట శంకర్‌కు నోటీసులు

Jun 11 2026 7:21 AM | Updated on Jun 11 2026 11:58 AM

 Police Case Against Amberpet Shanka

హైదరాబాద్‌:   తనను గదిలో బంధించి కొట్టి బెదిరింపులకు పాల్పడ్డాడంటూ ఓ బిల్డర్‌ఇచ్చిన పిర్యాదుమేరకు చిన్నబోయిన శంకర్‌ అలియాస్‌ అంబర్‌పేట శంకర్‌ను బుధవారం బంజారాహిల్స్‌ పోలీసులు విచారించి నోటీసులు జారీ చేశారు. అంబర్‌పేట శంకర్‌తో పాటు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కాకర్ల సాంబశివరావు, రవి, సుధాకర్, వినోద్, రాజా రమేష్‌ మదన్‌ సతీష్‌ లకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.

 విచారణకు హాజరైన అంబర్‌పేట శంకర్‌ను పోలీసులు  మూడు గంటల పాటు విచారించారు. ఆ రోజు ఏం జరిగిందన్న విషయాలపై ఆరా తీశారు. కమాలాపురి కాలనీలో కార్యాలయం ఎందుకు పెట్టారు..దాని వెనుకగల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గాజులరామారం ప్రాగా టూల్స్‌ కాలనీకి చెందిన ఆంజనేయులు అనే బిల్డర్‌ తనకు రావాల్సిన ప్లాట్లను తెలియకుండా అమ్మేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అంబర్‌పేట శంకర్‌తో పాటు మిగతా ఆరుగురుపై బెదిరింపుల కేసు నమోదు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement