హీరోగా మెగా డైరెక్టర్ కొడుకు.. కూతురు ఇప్పటికే హీరోయిన్ | Director Shankar Son Arjith Shankar First Movie Launch | Sakshi
Sakshi News home page

Arjith: హీరోగా స్టార్ డైరెక్టర్ కొడుకు.. హీరోయిన్‌గా కృతి శెట్టి

Jun 18 2026 6:53 PM | Updated on Jun 18 2026 7:26 PM

Director Shankar Son Arjith Shankar First Movie Launch

మెగా ఫ్యాన్స్‌ని భయపెట్టిన దర్శకుల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఉండే పేరు శంకర్. గతంలో ఒకే ఒక్కడు, జెంటిల్మన్, రోబో లాంటి అద్భుతమైన సినిమాలు తీసిన ఈయన.. గత కొన్నేళ్లలో దారుణమైన డిజాస్టర్స్ అందుకున్నాడు. రామ్ చరణ్‌తో తీసిన 'గేమ్ ఛేంజర్', కమల్ 'ఇండియన్ 2' ఫలితాల దెబ్బకు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అలాంటి ఈయన వారసుడు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న సీరియల్ హీరోహీరోయిన్)

డైరెక్టర్ శంకర్‌కి ముగ్గురు పిల్లలు. అందులో ఇదరమ్మాయిలు. పెద్ద కుమార్తె ఐశ్వర్యకు ఇప్పటికే పెళ్లయిపోయింది. తర్వాత పుట్టిన అదితీ ఇప్పటికే హీరోయిన్‌గా సినిమాలు చేసింది. కార్తీ, శివకార్తికేయన్ లాంటి హీరోలతో కలిసి పనిచేసింది. 'భైరవం' మూవీతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. వీళ్ల తర్వాత పుట్టిన కొడుకు అర్జిత్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

'లవర్ బాయ్' పేరుతో ఓ సినిమా ప్రారంభమైంది. కృతి శెట్టి హీరోయిన్. చెన్నైలో గురువారం లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. అశోక్ కుమార్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతుండగా.. జన నాయగణ్, టాక్సిక్, చిరు-బాబీ సినిమాలని నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్, ప్యాషన్ స్టూడియోస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

(ఇదీ చదవండి: 'సేవ్ ది టైగర్స్ 3' రివ్యూ.. ఈసారి కూడా నవ్వులే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement