రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు

Railway employees to get 78 days salary as bonus - Sakshi

రైల్వే సిబ్బందికి  78 రోజుల వేతనం బోనస్‌

వరుసగా ఇది ఆరవసారి

11 లక్షల మందికి ప్రయోజనం, రూ. 2024 కోట్ల వ్యయం

సాక్షి, న్యూఢిల్లీ:  రైల్వే ఉద్యోగులకు  కేంద్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ మేరకు  కేంద్ర కేబినెట్‌  బుధవారం నిర్ణయం తీసుకుంది. తద్వారా 11 లక్షల మంది  ఉద్యోగులకు దసరా, దీపావళి సందర్బంగా ముందస్తు తీపి కబురు అందించింది.  రైల్వే సిబ్బందికి బోనస్ అందించడం వరుసగా ఇది ఆరవ సంవత్సరం అని కేబినెట్‌ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్  ప్రకటించారు. ఈ నిర్ణయంతో  ప్రభుత్వానికి రూ . 2024 కోట్ల వ్యయం అవుతుందన్నారు.


మీడియా సమావేశంలో  కేంద్రమంత్రులు ప్రకాశ్‌ జవదేకర్‌, నిర్మలా సీతారామన్‌

                                    

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top