జార్ఖండ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ రాజీనామా

Jharkhand Congress Chief Ajoy Kumar Resigns After Poll Debacle - Sakshi

రాంచీ : లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యంతో జార్ఖండ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ అజయ్‌ కుమార్‌ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో పార్టీ పరాజయానికి పూర్తి బాధ్యత తనదేనని ఆయన స్పష్టం చేశారు. కాగా అజయ్‌ కుమార్‌ రాజీనామాపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఇంకా ఆమోదించలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

జార్ఖండ్‌లోని 14 లోక్‌సభ స్ధానాల్లో బీజేపీ, ఏజేఎస్‌యూ కూటమి 12 స్ధానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్‌-జేఎంఎం కూటమి చెరో స్ధానానికి పరిమితమయ్యాయి. ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో పలు రాష్ట్రాల చీఫ్‌లు రాజీనామాలతో ముందుకు రాగా దీనిపై హైకమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఓటమి షాక్‌ నుంచి తేరుకున్న తర్వాత పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారిస్తారని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top