రాహుల్‌ ‘రాజీ’నామా డ్రామా

Kailash Vijayvargiya Mocks Rahul Gandhis Resignation Offer - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ రాజీనామా ప్రతిపాదనను బీజేపీ ఎద్దేవా చేసింది. రాహుల్‌ రాజీనామాకు సిద్ధపడటాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేత, పార్టీ పశ్చిమ బెంగాల్‌ ఇన్‌చార్జ్‌ కైలాష్‌ విజయ్‌వర్గియ డ్రామాగా అభివర్ణించారు. మనకు ఇచ్చేది, తీసుకునేంది అంతా భగవంతుడేనని, రాజీనామా చేస్తానని రాహుల్‌ అనడం డ్రామానేనని ఆయన ఆరోపించారు.

లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయం నేఫథ్యంలో రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను సీడబ్ల్యూసీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో పార్టీ ఓటమిని నేతలు సమక్షించారు. కీలక సమయంలో పార్టీ నాయకత్వ స్ధానంలో కొనసాగాలని రాహుల్‌ను కోరారు. పార్టీ చీఫ్‌గా కొనసాగాలని, కిందిస్ధాయి నుంచి ప్రక్షాళన చేసి బలోపేతం చేయాలని సీడబ్య్లూసీ సభ్యులు ఓ తీర్మానాన్ని ఆమోదించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top