రాష్ట్రపతికి నూతన ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ | EC submits list of newly-elected MPs to President | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతికి నూతన ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ

May 26 2019 5:13 AM | Updated on May 26 2019 5:13 AM

EC submits list of newly-elected MPs to President - Sakshi

రాష్ట్రపతి కోవింద్‌కు ఎంపీల జాబితా సమర్పిస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునిల్‌ అరోరా, ఎన్నికల కమిషనర్లు అశోక్‌ లావాసా, సుశీల్‌ చంద్ర

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ంపీల జాబితాను ఎన్నికల కమిషన్‌ (ఈసీ) రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు అందజేసింది. 17వ లోక్‌సభ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునిల్‌ ఆరోరా, ఇద్దరు కమిషనర్లు అశోక్‌ లావాసా, సుశీల్‌ చంద్రలు.. శనివారం కోవింద్‌ను రాష్ట్రపతి భవన్‌లో కలిశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కొత్త లోక్‌సభ ఏర్పాటుకు ఫలితాల్లో వెల్లడైన ఎంపీల పేర్లను రాష్ట్రపతికి అందజేశారు. ఇది లోక్‌సభ ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించడానికి రాష్ట్రపతికి ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినందుకు ఎన్నికల ప్రధానాధికారి, ఇతర కమిషనర్లను రాష్ట్రపతి కోవింద్‌ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement