breaking news
submit report
-
మృతదేహాలకు పరీక్షలెందుకు చేయరు?
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా మృతదేహాల నుంచి రక్త నమూనాలు సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు ఎందుకు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పాజిటివ్ వస్తే మృతుడి కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు చేయడం ద్వారా వైరస్ వ్యాప్తి కాకుండా చేయొచ్చని చెప్పింది. లేకపోతే ఎందుకు చనిపోయాడో ఎప్పటికీ తెలియదని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించింది. కరోనా వైద్యం చేసే వారికి వైద్య పరికరాలిచ్చేలా ఉత్త ర్వులు జారీ కోరుతూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిల్‌ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం విచారించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం ప్రాథమిక లక్షణాలున్న వారికే కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిం చినట్లు తెలిసిందని, ఇది మంచి నిర్ణయం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా లక్షణాలుం టేనే పరీక్షలు చేసే విధానానికి ఉన్న శాస్త్రీయత ఏమిటో చెప్పాలని కోరింది. లక్షణాలున్న వారితో సన్నిహితంగా ఉన్న వారికి, కుటుంబసభ్యులకూ పరీక్షలు చేస్తేనే వైరస్ వ్యాప్తి కట్టడికి వీలుంటుందని తేల్చి చెప్పింది. వీటితోపాటు మృతదేహాలకు పరీక్షలు నిర్వహించకపోతే కరోనా వ్యాప్తి లెక్కలు తేలవని, పైగా గణాంకాల గారడీతో జనాన్ని మభ్యపెట్టడమే అవుతుందని వ్యాఖ్యా నించింది. ప్రభుత్వం వాస్తవ పరిస్థితుల కోణంలో చూడాలని, మనల్ని మనమే మోసం చేసుకోవద్దని హితవు పలికింది. తొలుత పిటిషనర్ న్యాయవాది ప్రభాకర్ వాదిస్తూ.. జంటనగరాల్లోని 32 కంటైన్మెంట్ జోన్స్‌లోని వారికి పరీక్షలు నిర్వహించాలని కోరారు. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఐసీఎంఆర్, కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా వైద్యులు విధుల్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. మార్గదర్శకాల్లో ప్రాథమిక లక్షణాలున్నవారికే పరీక్షలు చేయాలని ఏమీ లేదని గుర్తు చేసింది. కరోనా వైరస్ అనుమానితులతో పాటు కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయడమే కాకుండా క్వారంటైన్ సెంటర్స్‌కు పంపాలని మార్గదర్శకాల్లో ఉందని చెప్పింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశిస్తూ కోర్టు విచారణను ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది. -
రాష్ట్రపతికి నూతన ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ంపీల జాబితాను ఎన్నికల కమిషన్ (ఈసీ) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేసింది. 17వ లోక్‌సభ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ సునిల్ ఆరోరా, ఇద్దరు కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్రలు.. శనివారం కోవింద్‌ను రాష్ట్రపతి భవన్లో కలిశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కొత్త లోక్‌సభ ఏర్పాటుకు ఫలితాల్లో వెల్లడైన ఎంపీల పేర్లను రాష్ట్రపతికి అందజేశారు. ఇది లోక్‌సభ ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించడానికి రాష్ట్రపతికి ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినందుకు ఎన్నికల ప్రధానాధికారి, ఇతర కమిషనర్లను రాష్ట్రపతి కోవింద్ అభినందించారు. -
సుప్రీం కోర్టుకు బీసీసీఐ నివేదిక
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన నివేదిక సమర్పించింది. భారత క్రికెట్ బోర్డులో ఉంటూ ఐపీఎల్లో లాభదాయక పదవుల్లో ఉంటున్న వారి జాబితాను సుప్రీం కోర్టుకు సమర్పించింది. బీసీసీఐ అందజేసిన జాబితాలో మాజీ క్రికెటర్లు గవాస్కర్, గంగూలీ, శ్రీకాంత్, రవిశాస్త్రి పేర్లు ఉన్నాయి. వీరందరూ ఐపీఎల్లో కామెంటేటర్లుగా పనిచేస్తున్నారు. సుప్రీం కోర్టు ఐపీఎల్ కేసును బుధవారం విచారించింది. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ ఐపీఎల్ ప్రాంఛైజీ చెన్నయ్ సూపర్ కింగ్స్‌కు యజమానిగా ఉండటంపైనా కోర్టు ప్రశ్నించింది. అలాగే బీసీసీఐ పరిధిలో ఉంటూ వ్యక్తిగత లాభం కోసం ఐపీఎల్లో పనిచేయడాన్ని ప్రశ్నించింది.