గోరంట్ల మాధవ్‌కు అక్కడ కూడా ఫ్యాన్స్‌! | Gorantla Madhav Fan Following In Karnataka | Sakshi
Sakshi News home page

గోరంట్ల మాధవ్‌కు కర్ణాటకలోనూ ఫ్యాన్స్‌

May 28 2019 10:58 AM | Updated on Jul 12 2019 5:45 PM

Gorantla Madhav Fan Following In Karnataka - Sakshi

దొడ్డబళ్లాపురం : సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి మొదటిసారి ఎన్నికల్లో పోటీచేసి ఎంపీగా అఖండ విజయం సాధించిన గోరంట్ల మాధవ్‌కు కర్ణాటకలోనూ ఫ్యాన్స్‌ నీరాజనాలు పడుతున్నారు. గెలిచినా ఎటువంటి భేషజాలకు పోకుండా ఆచితూచి ఆయన చెబుతున్న మాటలు కూడా చాలామందికి నచ్చుతున్నాయి. ఇప్పటికే గోరంట్ల మాధవ్‌ గురించి కన్నడ పత్రికలు, మీడియా కూడా ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఆయన గెలుపు ఒక ఎత్తయితే.. గెలిచిన తరువాత పై అధికారులకు సెల్యూట్‌ చేసిన ఫోటోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘గెలుపంటే ఇదీ...గొప్ప వ్యక్తి...గొప్పవాళ్లు ఇలాగే ప్రవర్తిస్తారు’ అంటూ ప్రశంసిస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement