మంత్రివర్గంలో చేరబోమన్న జేడీయూ

JDU wont be part of Narendra Modi Ministry - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రెండోసారి ఎన్డీయే సర్కార్‌ కొలువు తీరకముందే లుకలుకలు మొదలయ్యాయి. బీజేపీ మిత్రపక్షం అయిన జేడీయూ మంత్రివర్గ కూర్పుపై అలకబూనింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ఏర్పడనున్న మంత్రివర్గంలో తమకు ఒకటే మంత్రి పదవి కేటాయించడంపై జేడీయూ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రివర్గంలో చేరబోమంటూ ప్రకటన చేసింది. కేవలం మిత్రపక్షంగానే కొనసాగుతామని జేడీయూ చీఫ్‌ నితీశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. కాగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానమంత్రిగా ఇవాళ రాత్రి 7గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ వేడుకలో దేశ, విదేశాల నుంచి వచ్చిన సుమారు 8వేల మంది అతిథులు పాల్గొంటున్నారు. మోదీ కేబినెట్‌లో మొత్తం 60 మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే 46 మందికి కేబినెట్‌లో బెర్త్‌లు ఖరారు అయ్యాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top