ఎన్నికల కోడ్‌ను ఎత్తివేసిన ఈసీ

Election Commission Lifts Model Code Of conduct - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మార్చి 10న విధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ఆదివారం ప్రకటించింది. ఈమేరకు కేబినెట్‌ కార్యదర్శి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఎన్నికల కోడ్‌ ఎత్తివేత వెంటనే అమల్లోకి వస్తుందని ఈసీ సమాచారం అందించింది. అధికారంలో ఉన్న పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం అధికారిక యంత్రాంగాన్ని ఉపయోగించుకోకుండా ఉండేందుకు ఎన్నికల కోడ్‌ను విధిస్తారు. అలాగే ఓటర్లను భయపెట్టి లేదా మతం, లంచం ఆశ చూపి ఓట్లు అడిగే రాజకీయ నాయకులను గుర్తించడానికి ఈసీ ఈ కోడ్‌ను ఉపయోగిస్తుంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top