breaking news
retire employee
-
KK Garg: రిటైర్డ్ రైల్వే ఇంజనీర్ ఘనత ట్రాక్టర్ స్కూల్
భారతీయ రైల్వే (Indian Railways) ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పంజాబ్ అంతటా పర్యటించిన కెకె గార్గ్ (KK Garg) ఎన్నో ప్రాంతాలలో, చదువుకు దూరమైన ఎంతోమంది పిల్లలను చూశాడు. రైల్వే ట్రాక్‌ల పక్కన మురికి వాడల్లో వందలాదిమంది చిన్నారులు పేదరికంలో నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రిటైర్మెంట్ తరువాత మొబైల్ పాఠశాలను ప్రారంభించాడు గార్గ్.పంజాబ్ వ్యవసాయాధారిత రాష్ట్రం కావడంతో ట్రాక్టర్లు ఎక్కువగా కనిపిస్తాయి. తన నైపుణ్యాలను ఉపయోగించి ఒక ట్రాక్టర్ ర్యాలీని మొబైల్ స్కూల్‌గా మార్చాడు గార్గ్. పైపింగ్‌తో వాటర్ ప్రూఫ్ ప్ల్యానల్స్ రూపొందించాడు. వేడిని బయటకు పంపడానికి అవసరమైన ఏర్పాటు చేశాడు.లైట్లు, ఫ్యాన్, బ్లాక్‌బోర్డ్ లాంటివి మొబైల్ స్కూల్లో ఉంటాయి.బఠిండాలోని ఎన్జీఒ ‘గుడ్‌విల్ సొసైటీ’ సహకారంతో ‘మొబైల్ స్కూల్’ పట్టాలకెక్కింది.స్కూల్ ట్రాలీలు బఠిండాలోని వివిధ ప్రాంతాల గుండా ప్రయాణిస్తాయి.మురికివాడలు, బడులు అందుబాటులో లేని ప్రాంతాలు, స్కూల్ డ్రాపవుట్ రేటు ఎక్కువగా ఉన్నప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి మొబైల్ క్లాస్‌రూమ్‌లో ప్రాథమిక అభ్యాసన సామాగ్రి ఉంటుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు.చదవండి: స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్క్లాసులో విజువల్ ఎయిడ్స్ ఉపయోగిస్తారు. స్టోరీ టెల్లింగ్, ఇంటరాక్టివ్ గేమ్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం వందలాది వలస కుటుంబాలు బఠిండాకు వచ్చి పోతుంటాయి. చాలామంది పిల్లలకు పాఠశాలల్లో చేరడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఉండవు. మొబైల్ స్కూల్ ఈ సమస్యను పరిష్కరించింది. మొబైల్ స్కూల్స్ ద్వారా సుమారు వెయ్యిమంది పిల్లలకు విద్య అందిస్తున్నారు. ఏడాది చదువు తరువాత పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడంలో మొబైల్ స్కూళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ‘పిల్లల తల్లిదండ్రుల నుంచి స్పందన బాగుంది’ సంతోషంగా అంటున్నాడు గార్గ్.ఇదీ చదవండి: Pahalgam : ఈ దుఃఖాన్ని ఆపడం ఎవ్వరి తరము? గుండెల్నిపిండేసే వీడియోలు -
చదువుకు దాచిన డబ్బులు... సైబర్ నేరగాళ్ల పాలు!
ఆంధ్రప్రదేశ్‌లో షాకింగ్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ సీబీఐ, కస్టమ్స్, నార్కోటిక్స్ అండ్ ఇన్‌కంటాక్స్ ఆఫీసర్ల ముఠా ఒక రిటైర్డ్ ఉద్యోగిని నిలువునా ముంచేసింది. ఒకటీ, రెండూ కాదు ఏకంగా రూ.85 లక్షలను స్వాహా చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.ఒక ఎంఎన్సీ(జర్మనీకి చెందిన ఫార్మా)లో అసోసియేట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగి తన కొడుకు చదువుకోసం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. మే 2న రిటైర్మెంట్ సెటిల్మెంట్ డబ్బులు అతని ఉత్తమ్ నగర్ బ్రాంచ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న ఆయన కుమారుడి వీసా అపాయింట్మెంట్ మే 17న ఉంది. ఇక్కడే ముఠా తమ పథకాన్ని పక్కాగా అమలు చేసింది. మే 14న, తండ్రి రికార్డులను తనిఖీ చేస్తామంటూ నకిలీ ముఠా రంగంలోకి దిగింది. పథకం ప్రకారమే రెండు రోజుల పాటు స్కైప్‌లో 'ఇంటరాగేషన్’ చేసి, ఫేక్ ఐడీ కార్డులు చూపించి ఆయన్ను నమ్మించింది. నకిలీ సైబర్ క్రైమ్ డీసీపీ అంటూ బాధితుడికి మరో వ్యక్తి ఫోన్ చేశాడు. మాదక ద్రవ్యాలు , మనీలాండరింగ్ అలాంటి అనేక కేసుల్లో నీ పేరు వచ్చిందని, ఈ కేసులన్నింటికీ తన ఆధార్ లింక్ చేసి ఉన్నట్టు బెదించారు. అంతేకాదు మరొక వ్యక్తికి డయల్ చేసి,ఇతనిపై (రిటైర్డ్ ఉద్యోగి)ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా అంటూ నాటకమాటాడు. ఇంటి నుండి బయటకు వెళ్లకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు అంటూ ఆదేశించాడు. లేదంటే జైలుకెళతావని కూడా బెదిరించాడు. దీంతో తీవ్ర భయానికి, ఒత్తిడికి లోనైనాడు. ఇంతలోనే నకిలీ డీసిపీ మళ్లీ ఫోన్ చేసి మీరు నిర్దోషిగా కనిపిస్తున్నారు, కాబట్టి. రూ.85 లక్షలు తక్షణమే చెల్లించండి. వెరిఫికేషన్ తర్వాత 15 నిమిషాల్లో తిరిగి ఇస్తానని నకిలీ అధికారులు హామీ ఇవ్వడంతో దీన్ని నమ్మిన బాధితుడు చెక్కు ద్వారా చెల్లింపు చేశారు. విశాఖపట్నంలో పోలీసులకు దాఖలు చేసిన ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) ప్రకారం ఈ నగదును ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో హెచ్‌డిఎఫ్‌సి ఖాతాను నిర్వహిస్తున్న 'రాణా గార్మెంట్స్' అనే కంపెనీకి బదిలీ చేసింది. తరువాత దేశవ్యాప్తంగా ఉన్న మరో 105 ఖాతాలకు ఈ సొమ్మును బదిలీ చేసినట్టు తేలింది. విశాఖ బ్యాంకులోని కొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉందని, రిటైర్మెంట్ తర్వాత అతను పొందిన డబ్బులు, తన ఖాతా గురించి మొత్తం సమాచారం ఈ ముఠాకు తెలుసునని ఆరోపించారు. అలాగే రాణా గార్మెంట్స్ KYC వివరాలు బ్యాంకు దగ్గర లేవా ఆయన అని ప్రశ్నించారు.హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉత్తమ్ నగర్ బ్రాంచ్ కూడాపోలీసులకు ఫిర్యాదు చేసింది. విశాఖ క్రైం బ్రాంచ్ ఈ కేసును టేకోవర్ చేసింది. కేసు దర్యాప్తులో ఉందని, తమకు కొన్ని ఆధారాలు లభించాయని పోలీసు వర్గాలు తెలిపాయి. -
కాల్వలో పడి రిటైర్డ్ ఉద్యోగి దుర్మరణం
గోపాల్పేట : వనపర్తిలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చి తిరిగి స్వంత గ్రామానికి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కేఎల్ఐ డీ–8 కాల్వలో పడిన ఓ రిటైర్డ్ ఇరిగేషన్ ఏఈ దుర్మరణం చెందాడు. ఈ ఘటన మంగళవారం మండలంలోని ఏదుట్ల శివారులో వెలుగు చూసింది. ఏఎస్సై ఇలియాజ్ తెలిపి న వివరాలిలా ఉన్నాయి. రేవల్లి మండల కేంద్రానికి చెందిన జిల్లెల రాంరెడ్డి(73) ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈగా పని చేసి రిటైర్ అయ్యారు. కుటుంబంతో సహా హైదరాబాదులో స్థిరపడ్డారు. రేవల్లిలో ఉన్న సొంత ఇంటిని ఇటీవలే తహసీల్దార్ కార్యాలయా నికి అద్దెకు ఇచ్చిన రాం రెడ్డి.. సోమవారం వనపర్తి లో ఉంటున్న మనవడైన న్యాయవాది విజయకుమార్‌రెడ్డి ఇంటికి వచ్చి రాత్రి రేవల్లి బయలుదేరాడు. రాత్రి 8.30 గంటల సమయంలో బైకుపై బయలుదేరగా ఏదుట్ల శివారులో డీ–8 కాల్వ రోడ్డుకు అడ్డంగా వెళ్లడంతో పైపులతో ప్రత్యామ్నాయ వంతెన వద్ద మూలమలుపును గమనించ ప్రమాదవశాత్తు బైకుతో సహా కాల్వలో పడిపోయాడు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదలగా మంగళవారం ఉద యం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమి చ్చారు. ఏఎస్సై ఇలియాజ్ సిబ్బందితో టన స్థలానికి చేరుకుని మృతుడి వద్ద ఉన్న ఫోన్ సాయంతో కుమారుడికి సమాచారం అందించారు. మృతుడికి భార్య అనసూయమ్మ, కుమారుడు అశోక్‌రెడ్డిని ఎమ్మెల్యే చిన్నారెడ్డి, ఎంపీపీ జానకీరాంరెడ్డి పరామర్శించారు. -
గుండెపోటుతో విశ్రాంత ఉద్యోగి మృతి
చెన్నేకొత్తపల్లి : మండల కేంద్రానికి చెందిన విశ్రాంత ఉద్యోగి ఆలమూరు సంజీవరెడ్డి(74) మంగళవారం గుండెపోటుతో మరణించారు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు... గుండెపోటుకు గురైన సంజీవరెడ్డిని కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆయన మంగళవారం కన్ను మూశారు. ఆయనకు భార్య లక్ష్మిదేవితో పాటు కుమారులు చెన్నారెడ్డి, రాంగోపాల్‌రెడ్డి, కుమార్తెలు మారుతీదేవి, ప్రభావతి ఉన్నారు.