
ఒక చిన్న అగ్గిపెట్టె పరిమాణంలోని బాక్స్ జేబులో పెట్టుకొని తిరిగితే, లైటు వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, కంప్యూటర్, మొబైల్ వంటి వాటికి పవర్ వస్తుంది. ఇది మ్యాజిక్ కాదు, జపాన్ సైంటిస్టుల కొత్త ఆవిష్కరణ.
వారు తయారు చేసిన ఈ చిన్న మ్యాచ్‌బాక్స్ సైజ్ జనరేటర్ రోజుకు ఇరవై నాలుగు గంటలూ, ఏడాదంతా నిరంతరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. దీని కోసం పెద్ద వనరులు అవసరం లేదు. కేవలం గాలిలో తేమ చాలు. ప్రత్యేకమైన లేయర్డ్ నానోఫిల్మ్ టెక్నాలజీ ఉపయోగించి, గాలిలోని తేమను ఇది నేరుగా విద్యుత్‌గా మార్చేస్తుంది. ఎలాంటి మోషన్ పార్ట్స్ లేవు, మెయింటెనెన్స్ కూడా జీరో. ఒక్కసారి సెట్ చేస్తే చాలు.
ఈ మధ్యనే దక్షిణ ఆసియా పంట పొలాల్లో టెస్టులు జరిపినప్పుడు ఎటువంటి బ్రేక్‌డౌన్ , చార్జింగ్ అవసరం లేకుండా నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేసింది. త్వరలోనే దీన్ని మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
(చదవండి: చేపలంటే నోరూరించే వంటకాలు కాదు..! ఇకపై ఫ్యాషన్..)
·