గ్లోబల్‌ బ్రాండ్‌గా ‘ప్రీత్‌’ ట్రాక్టర్‌ ! | Preet Tractors now Global Brand | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ బ్రాండ్‌గా ‘ప్రీత్‌’ ట్రాక్టర్‌ !

Aug 20 2019 9:27 AM | Updated on Aug 20 2019 9:27 AM

Preet Tractors now Global Brand - Sakshi

హైదరాబాద్‌: పంజాబ్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రీత్‌ గ్రూప్‌నకు చెందిన  ‘ప్రీత్‌ ట్రాక్టర్‌’  గ్లోబల్‌ బ్రాండ్‌గా అవతరించింది. ఇటీవలనే నేపాల్‌ దేశానికి 111 ప్రీత్‌ ట్రాక్టర్లను ఎగుమతి చేశామని ప్రీత్‌ గ్రూప్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రీత్‌ ట్రాక్టర్లు 25 దేశాల్లో అమ్ముడవుతున్నాయని, యూరప్‌ దేశాల్లో తమ ట్రాక్టర్లకు డిమాండ్‌ పెరుగుతోందని కంపెనీ డైరెక్టర్, గుర్‌ప్రీత్‌ సింగ్‌ పేర్కొన్నారు. పెరుగుతున్న డిమండ్‌ను తట్టుకోవడానికి 20 నుంచి 26 హార్స్‌పవర్‌ ఇంజిన్‌ సామర్థ్యం గల కొత్త మోడళ్లను అందించనున్నామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement