breaking news
shcool
-
KK Garg: రిటైర్డ్ రైల్వే ఇంజనీర్ ఘనత ట్రాక్టర్ స్కూల్
భారతీయ రైల్వే (Indian Railways) ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పంజాబ్ అంతటా పర్యటించిన కెకె గార్గ్ (KK Garg) ఎన్నో ప్రాంతాలలో, చదువుకు దూరమైన ఎంతోమంది పిల్లలను చూశాడు. రైల్వే ట్రాక్‌ల పక్కన మురికి వాడల్లో వందలాదిమంది చిన్నారులు పేదరికంలో నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రిటైర్మెంట్ తరువాత మొబైల్ పాఠశాలను ప్రారంభించాడు గార్గ్.పంజాబ్ వ్యవసాయాధారిత రాష్ట్రం కావడంతో ట్రాక్టర్లు ఎక్కువగా కనిపిస్తాయి. తన నైపుణ్యాలను ఉపయోగించి ఒక ట్రాక్టర్ ర్యాలీని మొబైల్ స్కూల్‌గా మార్చాడు గార్గ్. పైపింగ్‌తో వాటర్ ప్రూఫ్ ప్ల్యానల్స్ రూపొందించాడు. వేడిని బయటకు పంపడానికి అవసరమైన ఏర్పాటు చేశాడు.లైట్లు, ఫ్యాన్, బ్లాక్‌బోర్డ్ లాంటివి మొబైల్ స్కూల్లో ఉంటాయి.బఠిండాలోని ఎన్జీఒ ‘గుడ్‌విల్ సొసైటీ’ సహకారంతో ‘మొబైల్ స్కూల్’ పట్టాలకెక్కింది.స్కూల్ ట్రాలీలు బఠిండాలోని వివిధ ప్రాంతాల గుండా ప్రయాణిస్తాయి.మురికివాడలు, బడులు అందుబాటులో లేని ప్రాంతాలు, స్కూల్ డ్రాపవుట్ రేటు ఎక్కువగా ఉన్నప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి మొబైల్ క్లాస్‌రూమ్‌లో ప్రాథమిక అభ్యాసన సామాగ్రి ఉంటుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు.చదవండి: స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్క్లాసులో విజువల్ ఎయిడ్స్ ఉపయోగిస్తారు. స్టోరీ టెల్లింగ్, ఇంటరాక్టివ్ గేమ్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం వందలాది వలస కుటుంబాలు బఠిండాకు వచ్చి పోతుంటాయి. చాలామంది పిల్లలకు పాఠశాలల్లో చేరడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఉండవు. మొబైల్ స్కూల్ ఈ సమస్యను పరిష్కరించింది. మొబైల్ స్కూల్స్ ద్వారా సుమారు వెయ్యిమంది పిల్లలకు విద్య అందిస్తున్నారు. ఏడాది చదువు తరువాత పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడంలో మొబైల్ స్కూళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ‘పిల్లల తల్లిదండ్రుల నుంచి స్పందన బాగుంది’ సంతోషంగా అంటున్నాడు గార్గ్.ఇదీ చదవండి: Pahalgam : ఈ దుఃఖాన్ని ఆపడం ఎవ్వరి తరము? గుండెల్నిపిండేసే వీడియోలు -
మామయ్య గోరుముద్ద..చదువుపైనే శ్రద్ధ
గతం ముద్దన్నం...నీళ్ల సాంబారు... అదీ అరకొర... ఇదీ చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో బడిపిల్లలకు అందించే మధ్యాహ్న భోజన తీరు. ఆయన పాలనంటేనే కరువు. చంద్రబాబు సీఎంగా ఉన్న 2014–19 మధ్య రాష్ట్రంలో చాలావరకు కరువు పరిస్థితులు ఏర్పడి, ప్రజలకు ఉపాధి కూడా కరువైంది. ఫలితంగా నిరుపేదలు తిండికి కూడా దూరమయ్యారు. బడికి వెళ్లిన పేదల పిల్లలకు ఒక్క పూటైనా కడుపు నిండా అన్నం దొరుకుతుందని భావిస్తే.. అక్కడా ఆకలితో అలమటించేలా చేశారు. రోజూ ఒకేరకమైన మెనూవల్ల దానిని తినలేక, ఆకలితో ఉండలేక పేదింటి పిల్లల బాధ వర్ణనాతీతం. ఈ అన్నం తిన్నవారికి కడుపునొప్పి సర్వ సాధారణం. కౌమారదశ బాలికలైతే అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేవారు. బడికి వచి్చన పిల్లల్లో 30 శాతంలోపే మధ్యాహ్న భోజనం చేసేవారు. ఏటా సగటున రూ.450 కోట్లు మాత్రమే దీనికి కేటాయించే వారు. ఒక్కో విద్యార్థికి వంట ఖర్చు రూ.3.59 మాత్రమే కేటాయించారు. అదీ ఏజెన్సీలకు ఎప్పుడూ సకాలంలో చెల్లించిన పాపాన పోలేదు. ప్రస్తుతం పాలనపై చిత్తశుద్ధి... విద్యారంగంపై సరికొత్త విజన్గల ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో అనేక సంస్కరణలు అమలుచేశారు. పేదింటి పిల్లలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు ‘గోరుముద్ద’ పథకాన్ని స్వయంగా రూపొందించారు. 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ‘జగనన్న గోరుముద్ద’ కింద నాణ్యమైన, పౌష్టికాహారాన్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో వండి వడ్డిస్తున్నారు. ఒక్కో విద్యార్థి వంట ఖర్చును రూ.8.57 పెంచారు. బడ్జెట్ కూడా ఏడాదికి సగటున రూ.1,400 కోట్లకు పెరిగింది. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకో మెనూతో 16 రకాల పదార్థాలను అందిస్తున్నారు. విద్యార్థుల్లో రక్తహీనత తగ్గించేందుకు ఫోరి్టఫైడ్ సార్టెక్స్ బియ్యంతో అన్నం, వారంలో మూడు రోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మూడ్రోజులు బెల్లం చిక్కీ ఇస్తున్నారు. ఉడికించిన గుడ్డు ఐదు రోజుల పాటు తప్పనిసరి చేశారు. దీనివల్ల 90శాతం మంది పిల్లలు మధ్యాహ్న భోజనాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో ప్రభుత్వం అన్ని దశల్లోను శ్రద్ధ తీసుకుంటోంది. రోజుకో మెనూ చొప్పున ఆరు రోజులకు 16 రకాల పదార్థాలు పిల్లలకు వడ్డిస్తున్నారు. ఉపాధ్యాయులు మొబైల్ యాప్‌లో విద్యార్థుల హాజరుతో పాటు భోజనం చేసేవారి సంఖ్యను రాష్ట్ర స్థాయి వరకు తెలుసుకునేలా ‘ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టం ఫర్ మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్’ (ఐఎంఎంఎస్) యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ప్రతిరోజు బడిలో ఉన్న సరుకుల స్టాక్‌తో పాటు భోజనం అంశాలను ఫొటోలతో సహా అప్లోడ్ చేస్తున్నారు. భోజనం చేశాక, వంటపై విద్యార్థులే స్వయంగా రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో 1–10 తరగతుల్లో 43 లక్షల మంది విద్యార్థులు ఉంటే.. ప్రతిరోజు హాజరైనవారిలో సగటున 34,89,895 మంది (90 శాతం) గోరుముద్ద తీసుకుంటున్నారు. మిగిలిన 10 శాతం మందిలో బాలికలు ప్రత్యేక పరిస్థితుల్లో ఇంటి నుంచి అన్నం తెచ్చుకుని బడిలో కూరలు తీసుకుంటున్నారు. పిల్లలు తీసుకునే ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో ఏఐ టెక్నాలజీ యాప్ ద్వారా తెలుసుకుని అందుకు తగ్గట్టు ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నారు. సోమవారం: హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పులావు, గుడ్డు కూర, చిక్కీ మంగళవారం:ఉదయం 10.20కు రాగిజావ, మధ్యాహ్నం 12.20కు చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు బుధవారం: వెజిటబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ గురువారం: ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్/నిమ్మకాయ పులిహోర, టమాటా పచ్చడి, ఉడికించిన గుడ్డు శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ శనివారం: ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్ ‘గోరుముద్ద’కు జాతీయ అవార్డు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందిస్తున్న జగనన్న గోరుముద్ద అమలుకు కేంద్ర ప్రభుత్వం కితాబునిచ్చింది. రక్తహీనత నివారణ, మెరుగైన ఆరోగ్యం లక్ష్యంగా పనిచేయడాన్ని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ గుర్తించి గతేడాది నవంబర్‌లో జాతీయ స్థాయి ప్రథమ బహుమతి రాష్ట్రానికి అందజేసింది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాగి జావ, ఉడికించిన గుడ్ల పంపిణీ, ఎముకల బలాన్ని పెంచేందుకు చిక్కీ(వేరుశనగ బార్) పంపిణీ చేస్తూ విద్యార్థులందరికీ శారీరక ఆరోగ్యమే ప్రాథమిక లక్ష్యంగా గోరుముద్ద కొనసాగుతోందని స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ జోయా అలీ రిజ్వీ అవార్డు వేడుకలో అభినందించడం గమనార్హం. వంట ఏజెన్సీలకు ఖర్చులు పెంపు గత ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ఏనాడు సకాలంలో డబ్బులు చెల్లించలేదు. 2014–18 వరకు వంటపాత్రల సరఫరా లేదు. ఈ ఏడాది 43 లక్షల మంది విద్యార్థులకు స్టీలు గ్లాసులు అందించారు. 44,617 పాఠశాలలకు రూ.41 కోట్ల వ్యయంతో స్టీలు వంట పాత్రలను ప్రభుత్వం అందించింది. గత ప్రభుత్వం 2014–18 మధ్య పిల్లల భోజన ఏడాది వ్యయం రూ.450 కోట్లు అయితే, ప్రస్తుత ప్రభుత్వంలో అది సగటున రూ.1449 కోట్లకు పెంచింది. వంట ఖర్చు, అదనపు మెనూ, ఆహార ధాన్యాలు, రవాణాతో సహా మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. గత ప్రభుత్వంలో 2014–18 మధ్య విద్యార్థుల వంట ఖర్చు రూ.3.59 నుంచి రూ.6.51 మధ్య మాత్రమే కాగా.. ప్రస్తుతం ఆ ఖర్చు రూ.8.57కు పెంచి చెల్లిస్తున్నారు. ఏటా సగటున రూ.1449 కోట్ల ఖర్చు ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందించినప్పుడే చదివింది ఒంటబడుతుందని నమ్మిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిల్లలకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ‘గోరుముద్ద’కు శ్రీకారం చుట్టారు. బడికి వచ్చే ప్రతి పేద బిడ్డకు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తూ.. వారు స్కూలుకు వచ్చేందుకు ఆసక్తి చూపేలా మెనూ రూపొందించారు. ప్రభుత్వ బడుల్లోని 43 లక్షల మంది విద్యార్థుల కోసం రోజుకో మెనూ చొప్పున 16 రకాల ఐటమ్స్‌తో ‘జగనన్న గోరుముద్ద’ అందిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకే విద్యార్థుల హాజరుకు అనుగుణంగా పిల్లల అభిప్రాయాలు తీసుకుని ఆ మేరకు వంట చేస్తున్నారు. రోజుకు సగటున 34.90 లక్షల మంది విద్యార్థులు గోరుముద్ద తింటున్నారు. భోజనం పూర్తయ్యాక అభిప్రాయాలు విద్యార్థులే రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు. ‘గుడ్’ అని ‘నాట్ గుడ్’ అని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛను ప్రభుత్వం విద్యార్థులకు కల్పించింది. గత ప్రభుత్వంలో నీళ్ల సాంబారు, ముద్ద అన్నం కోసం ఏటా రూ.450 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే.. గోరుముద్ద కోసం ప్రభుత్వం ఏటా సగటున రూ.1449 కోట్ల చొప్పున ఈ ఐదేళ్లలో రూ.7,244.6 కోట్ల నిధులు వెచి్చంచింది. పౌష్టికాహారం కోసం ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యం పిల్లల్లో రక్తహీనత తగ్గించేందుకు వారంలో మూడురోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మరో మూడురోజులు చిక్కీ ఇస్తున్నారు. వారంలో ఐదు రోజులు ఉడికించిన గుడ్డు తప్పనిసరి. విద్యార్థుల్లో రక్తహీనత నివారణకు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యాన్నే వాడుతున్నారు. ప్రతి గురువారం బడి పిల్లల ఆరోగ్యం పరీక్షించేందుకు స్థానిక ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది పరీక్షలు చేస్తారు. రక్తహీనత నివారణకు మాత్రలు ఇవ్వడంతో పాటు వారు సక్రమంగా వాడుతున్నారో లేదో పరిశీలిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఇదే మెనూ పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనాన్ని అల్యూమినియం పాత్రల్లో వండేవారు, దీనివల్ల పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించిన జగనన్న ప్రభుత్వం వాటి స్థానంలో పూర్తి స్టీలు పాత్రలు అందించింది. -
‘చెప్పుకోలేని బాధకు’..చలించిపోయారు..
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు అక్కడ ఉన్న ఒకే టాయిలెట్‌తో ఇక్కట్లు పడుతున్న అంశం ప్రజాప్రతినిధులను కదిలించింది. ఈ ఇబ్బందిపై ‘చెప్పుకోలేని బాధ’శీర్షికతో శనివారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురించిన కథనానికి వారు చలించారు. రాజ్య సభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందిస్తూ విద్యార్థినులు టాయిలెట్ కోసం చాంతాడంత క్యూలైన్ పాటించాల్సిన దుస్థితి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తక్షణ చర్యల్లో భాగంగా తన ఎంపీ నిధుల నుంచి మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధులను విడుదల చేస్తానని ప్రకటిస్తూ ‘సాక్షి’కథనాన్ని ట్వీట్ చేశారు. టాయిలెట్ల నిర్మాణానికి తాను బాధ్యత తీసుకుని పూర్తి చేయిస్తానని, ఈ మేరకు అధికారులకు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్లరామకృష్ణారెడ్డి స్పందిస్తూ ఆ పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణం కోసం రూ.1.75లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఏటీఆర్ కోరిన కేంద్రమంత్రి.. టాయిలెట్ అంశంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి స్పందించారు. సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ఏటీఆర్) తనకు సమర్పించాలని సూచించారు. అన్ని స్కూళ్లలో అవసరమైనన్ని టాయిలెట్లు : మంత్రి సబితారెడ్డి గూడూరు పాఠశాలలోని టాయిలెట్ల సమస్యపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఆ జిల్లా కలెక్టర్‌తో ఫోనులో మాట్లాడారు. పాఠశాలలో అదనంగా మరికొన్ని మరుగుదొడ్లు నిర్మించి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగ్గా మరుగుదొడ్లను నిర్మించాలని, ఈమేరకు నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.మరోవైపు శనివారం ఆ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి బృందం సందర్శించి కలెక్టర్‌కు నివేదిక సమర్పించింది. వాళ్లది చెప్పుకోలేని బాధ... ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పిస్తున్నామని పాలకులు చెబుతున్నా...ఆచరణలో కనిపించడం లేదు. ఫలితంగా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా గూడూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సుమారు 130మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. అయితే వీరందరికీ ఒకే టాయ్‌లెట్ (మూత్రశాల) ఉంది. అలాగే ప్రాథమిక పాఠశాలలో 80మంది విద్యార్థులు ఉన్నారు. వీరితో పాటు ఉపాధ్యాయులకు కలుపుకుని ఇక్కడ కూడా ఒకే టాయ్‌లెట్ ఉంది. అత్యవసర పరిస్థితుల్లోనూ చాంతాడంత క్యూ కట్టాల్సిందే. ఏళ్ల తరబడి ఈ దుస్థితి ఉన్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ప్రజాప్రతినిధులు టాయ్లెట్ల నిర్మాణానికి నిధుల మంజూరుకు ముందుకు వచ్చారు. Sad to see this. Sufficient funds will be sanctioned from MPLAD Scheme to address this issue immediately . @SakshiNewsPaper@TNewstg @trspartyonline pic.twitter.com/zDMp0AuW3A — Santosh Kumar J (@MPsantoshtrs) October 26, 2019 -
సమైక్య నిరసనలు
సాక్షి, కడప : జిల్లాలో సమైక్యవాదం హోరెత్తింది. గత 63 రోజులుగా ఉద్యమంలో ఉత్సాహంగా ఉరకలేస్తున్న సకలజనులు గురువారం అదే హోరును కొనసాగించారు. పాఠశాలలు పునః ప్రారంభిస్తామని డీఈఓ ప్రకటించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. డీఈఓ, ఆర్జేడీ కార్యాలయాలను ముట్టడించారు. డీఈఓ అంజయ్య, ఆర్జేడీ సీహెచ్ రమణకుమార్లను ఘెరావ్ చేశారు. డీఈఓను సస్పెండ్ చేయాలని నినదిస్తూ, ఆర్జేడీ కార్యాలయ అద్దాలను ధ్వంసం చేశారు. జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి కోటిరెడ్డి సర్కిల్లో మానవహారం నిర్మించారు. గనులు భూగర్భశాఖ సీమాంధ్ర జేఏసీ కన్వీనర్ రంగారావు, కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సప్తగిరి కళ్యాణ మండపంలో కార్యచరణను రూపొందించారు. ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్ల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీని చేపట్టారు. ఎన్జీఓలు ఎంపీ సాయిప్రతాప్ ఇంటిని ముట్టడించి వంటా వార్పు చేపట్టారు. టీ.నోట్ ప్రకటన వెలువడిన వెంటనే అధికారులు కోటిరెడ్డి సర్కిల్లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. రిమ్స్ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర హోం మంత్రి షిండే దిష్టిబొమ్మను శవయాత్రగా ఊరేగించి దగ్ధం చేశారు. టీ.నోట్ ప్రకటన తెలిసిన వెంటనే ట్రాఫిక్ పోలీసుస్టేషన్ వద్ద మున్సిపల్ ఉద్యోగులు, నీటిపారుదలశాఖ సిబ్బంది రాస్తారోకో చేపట్టారు. అధికారులు, ఉద్యోగులు, ఎన్జీఓలు నగరంలో తిరుగుతూ దుకాణాలను మూసి వేయించారు. జమ్మలమడుగులో దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ మంత్రి పీఆర్ సంఘీభావం తెలిపారు. వెయ్యి మీటర్ల జాతీయ జెండాతో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యం, చర్లపల్లి స్కూలు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్మించారు. జేఏసీ 72 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. ప్రొద్దుటూరులో జేఏసీ ఆధ్వర్యంలో వంద కిలోమీటర్ల మేర మానవహారాన్ని చేపట్టారు. ఇందులో మహిళలు, ప్రజలు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టీ.నోట్ ప్రకటన వెలువడినప్పటి నుంచే 72 గంటల బంద్ పాటిస్తున్నారు. ప్రొద్దుటూరులో సమైక్యవాదులు, ఎన్జీఓలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. రిలే దీక్షలు సాగుతున్నాయి. రాయచోటి పట్టణంలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు తలపై గోళాలు పెట్టుకుని రాష్ట్రం విడిపోతే కూలిపనులకు వెళ్లాల్సి ఉంటుందని నిరసన తెలిపారు. మేదరసంఘం, ఉపాధ్యాయులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రైల్వేకోడూరులో జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై నిరసన తెలిపారు. నారాయణ స్కూలు విద్యార్థులు ర్యాలీ చేపట్టి సేవ్ఏపీ ఆకారంలో నిరసన తెలిపారు. పొలిటికల్ జేఏసీ, ఇతర అధికారులు సంఘీభావం తెలిపారు. బద్వేలులో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. టీ.నోట్ వెలువడిందని విషయం తెలియగానే 72 గంటల బంద్‌కు పిలుపునిచ్చి బంద్‌పాటిస్తున్నారు. బేల్దార్ల సంఘం ఆధ్వర్యంలో 50 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. అట్లూరులో ఆందోళనలు చేపట్టారు. పోరుమామిళ్లలో విద్యార్థులు ర్యాలీ చేపట్టి మానవహారంగా ఏర్పడ్డారు. పులివెందులలో సమైక్యాంధ్ర జేఏసీ, ఉపాధ్యాయులు పట్టణంలో భారీ ర్యాలీని చేపట్టారు. టీ.నోట్ ప్రకటన వెలువడిందని తెలియగానే 72 గంటల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. కమలాపురం పట్టణంలో ఉపాధ్యాయులు తెలంగాణ నోట్ వెలువడిందని తెలియగానే నోట్ పత్రాలను గాంధీ విగ్రహం వద్ద కాల్చివేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజంపేటలో మహిళా ఉపాధ్యాయులు మోకాళ్లపై నడుస్తూ నిరసన ర్యాలీని చేపట్టారు. టీ.నోట్‌కు వ్యతిరేకంగా రాజంపేటలో ఆందోళనలు ఉధృతమయ్యాయి.