రైల్వే ప్రయాణికులకు శుభవార్త!!

Paytm QR code UPI payments enabled at railway stations - Sakshi

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. రైల్వే స్టేషన్‌లలో అందుబాటులో ఉన్న డిజిటల్‌ టికెటింగ్‌ సర్వీస్‌లో రైల్వే ప్రయాణికుల ఇబ్బందులు తీరిపోనున్నాయి. ఐఆర్‌సీటీసీ ఇకపై రైల్వే స్టేషన్‌లలో ఆటోమెటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషిన్‌(ఏటీవీఎం)లలో యూపీఐ పేమెంట్స్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ యూపీఐ పేమెంట్స్‌ కోసం ఐఆర్‌సీటీసీతో జతకట్టినట్లు పేటీఎం ప్రకటించింది. దీంతో దేశంలోని అన్నీ రైల్వే స్టేషన్‌లలో క్యాష్‌లెస్‌ ట్రైన్‌ టికెట్‌ తీసుకునే వీలు కలగనుంది. 

నగదు రహిత ప్రయాణాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఇండియన్‌ రైల్వే  ఏటీవీఎంలలో రైల్వే ప్రయాణికులు యూపీఐ పేమెంట్‌ ద్వారా  టిక్కెట్ తీసుకునే అవకాశాన్ని కల్పిచ్చింది. ఏటీవీఎంలు టచ్ స్క్రీన్ ఆధారిత టికెటింగ్ కియోస్క్‌లు. ఈ కియోస్క్‌లో రైల్వే ప్రయాణికులు క్యాష్‌ లేకుండా డిజిటల్‌ పేమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సదుపాయం దేశంలోని అన్నీ రైల్వే స్టేషన్‌లలో అందుబాటులోకి వచ్చింది.  

అంతేకాదు స్క్రీన్‌లపై రూపొందించిన క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా స్మార్ట్ కార్డ్‌లను రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రయాణికులు అన్‌రిజర్వ్ ట్రైన్‌ టికెట్లు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లను కొనుగోలు చేయోచ్చు. వారి సీజనల్ టిక్కెట్‌లను పునరుద్ధరించుకోవచ్చు. ఈ సందర్భంగా పేటీఎం ప్రతినిధి మాట్లాడుతూ..అన్నీ రైల్వే స్టేషన్‌లలో యూపీఏ పేమెంట్స్‌ ను అందుబాటులోకి తెచ్చేందుకు ఐఆర్‌సీటీసీతో భాగస్వామ‍్యం అవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు.

చదవండి: చేసింది ఇక చాలు!! మా'స్టారు' మీ టైమ్‌ అయిపోయింది!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top