
హైదరాబాద్: మహాలయ పక్షం సందర్భంగా భారతీయ రైల్వే ప్రత్యేక రైలు యాత్రను ప్రారంభిస్తోంది. భారత్ గౌరవ్ ట్రైన్‌లలో భాగంగా ‘మహాలయ పక్ష సప్త మోక్ష క్షేత్ర యాత్ర’ పేరుతో ప్రత్యేక రైలును నడపబోతోంది. ఈ రైలు వివరాలను రైల్వే అధికారులు హైదరాబాద్‌లో జూలై 29న ప్రకటించనున్నారు.
మహాలయ పక్ష సప్త మోక్ష క్షేత్ర యాత్ర రైలు ఏడు ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించవచ్చు. వీటిలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ద్వారక, సిధ్పూర్, మధుర, అయోధ్య, ప్రయాగ్రాజ్, వారనాసి, గయా క్షేత్రాలు ఉన్నాయి. మహాలయ పక్ష కాలంలో ఈ క్షేత్రాలను దర్శించి పూర్వీకులకు పిండ ప్రదానాలు చేస్తే స్వర్గగతులు కలుగుతాయని భక్తుల నమ్మకం.