30 బస్కీలు తీస్తే టికెట్‌ ఉచితం

Indian Railways Introduces Free Platform Tickets for Squats - Sakshi

న్యూఢిల్లీ: ‘ఫిట్‌ ఇండియా’కు ప్రచారం కల్పించేందుకు భారత రైల్వే ఓ సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ రైల్వే స్టేషన్‌లో 30 బస్కీలు తీస్తే ఉచితంగా ప్లాట్‌ఫారం టికెట్‌ లభించనుంది. ఈ తరహా పథకాన్ని రైల్వే శాఖ అమలు చేయడం ఇదే మొదటిసారి. ఆనంద్‌ విహార్‌ రైల్వేస్టేషన్‌లో ‘స్క్వార్ట్‌ మెషీన్‌’ను అధికారులు ఏర్పాటు చేశారు. దాని ముందు 30 బస్కీలు తీస్తే చాలు ప్లాట్‌ఫారం టికెట్‌ జనరేట్‌ అయి ఉచితంగా లభిస్తుంది.

ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రైల్వే స్టేషన్‌లో ‘దవా దోస్త్‌’ జెనరిక్‌ మెడికల్‌ షాప్‌ను కూడా రైల్వే ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రయాణికులకు నాణ్యమైన మందులను సరసమైన ధరలకే అందిస్తామని రైల్వే తెలిపింది. జెనరిక్‌ ఔషధాలను ప్రోత్సహిస్తున్న ‘దవా దోస్త్‌’కు ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తోంది. ప్రస్తుతం రాజస్తాన్, ఢిల్లీలో 10 దవా దోస్త్‌ దుకాణాలున్నాయి. ఈ ఏడాది 100 దుకాణాలు.. వచ్చే నాలుగేళ్లలో 1,000 దుకాణాల ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top