కృత్రిమ మేధ(ఏఐ)ను అత్యధికంగా ఉపయోగించుకుంటున్న రంగాల్లో ప్రకటనల రంగం ముందుంది. ఏఐ ఆధారంగా తమ ఉత్పత్తుల విశిష్టతలను చాటుకోవడానికి ఆరాట పడుతున్న పలు సంస్థలు బ్రాండ్‌ల వేగానికి కళ్లెం వేయడానికి అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఎస్‌సిఐ) సిద్ధమైంది ఈ తరహా కృత్రిమంగా రూపొందించిన సింథటికల్లీ జనరేటెడ్ కంటెంట్ (ఎస్‌జిసి)ను ప్రకటనల్లో బాధ్యతాయుతంగా లేబులింగ్ చేయాలి అంటూ తగిన మార్గదర్శకాలు’ను తాజాగా విడుదల చేసింది.
ప్రకటనల కంటెంట్‌ను రూపొందించడానికి, బ్రాండ్‌లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజె¯Œ ్స (ఏఐ)ను వాడుకోవడం పెరుగుతున్న నేపథ్యంలో, అటువంటి కంటెంట్ వినియోగదారులపై చూపే ప్రభావంపై ఈ మార్గదర్శకాలు రూపొందాయి కృత్రిమ కంటెంట్ ను ఉపయోగించినప్పుడు దాని గురించి ఎలా వెల్లడించాలి? అలాగే ఎలాంటి వినియోగాలను అనుమతించవచ్చనే అంశాలను ఈ మార్గదర్శకాలు వివరిస్తాయి. గత మే నెలలో విడుదల చేసిన ముసాయిదా మార్గదర్శకాలపై వివిధ వర్గాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం తుది మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం...
–ప్రకటనల్లో ఏఐ లేబుల్‌ను ఉపయోగించినప్పటికీ, చట్టవిరుద్ధమైన, హక్కులను ఉల్లంఘించే, తప్పుదారి పట్టించే క్లెయిమ్‌లను కలిగి ఉన్న లేదా కోడ్‌ను ఉల్లంఘించే ప్రకటనలు నిషేధించే అవకాశం ఉంటుంది.
–కల్పిత ఆమోదాలు లేదా ప్రశంసాపత్రాలను ఉపయోగించడం
–కృత్రిమంగా రూపొందించిన యాడ్స్ ద్వారా ప్రోడక్టు ఫలితాలు లేదా లక్షణాలను తప్పుదారి పట్టించే విధంగా అతిశయోక్తి జోడించడం
–కస్టమర్లను తప్పుదారి పట్టించే విధంగా ఉనికిలో లేని ప్రదేశాలు లేదా పరిసరాలను వాస్తవమైనవిగా చూపించడం
–అనధికారిక కాపీరైట్ కంటెంట్‌ను ఉపయోగించడం
–సంబంధిత వ్యక్తి అనుమతి లేకుండా డీప్‌ఫేక్‌లు లేదా వారి పోలికను ఉపయోగించడం
– కస్టమర్ల నిర్ణయాలను గణనీయంగా ప్రభావితం చేసే చోట దానిని వెల్లడించకపోవడం కస్టమర్లను తప్పుదారి పట్టించే అవకాశం ఉన్న చోట లేబులింగ్ తప్పనిసరి. అందులో....
–కృత్రిమ ఇన్‌ఫ్లుయెన్సర్‌లుఅంబాసిడర్‌ల వినియోగం
–వ్యక్తిగతీకరించిన సందేశాల కోసం, సమ్మతితో ఒక నిజమైన వ్యక్తి పోలికను లేదా స్వరాన్ని పునఃసృష్టించడం
– ప్రోడక్టు లేదా సేవపై కస్టమర్ల అవగాహనను ప్రభావితం చేయగల కల్పిత సంఘటనలు లేదా సెట్టింగ్‌ల సృష్టి
–ప్రస్తుతం ఉనికిలో లేని ప్రోడక్టులకు సంబంధించిన ప్రదర్శన –హెడ్‌ఫోన్‌ల వంటి ఉత్పత్తి ప్రధాన ఫీచర్‌లకు జోడించే సౌండ్ ఎఫెక్ట్‌లు
–చెల్లింపు లేదా స్పాన్సర్ చేయబడిన ఏఐ ఉత్పత్తిపై తప్పనిసరిగా ‘‘స్పాన్సర్డ్ బై ్రబ్రాండ్]’’ అని ప్రత్యేకంగా లేబుల్ చేయాలి.
బ్రాండ్‌లు ప్రకటనల ప్లాట్‌ఫారమ్‌లు అందించే లేబుల్స్‌తో పాటు ‘‘ఏఐ ఉపయోగించి ఆడియో/వీడియో రూపొందించబడింది’’ లేదా ‘‘ఏఐ ఉపయోగించి ఆడియో/వీడియో మెరుగుపరచబడింది’’ వంటి లేబుల్స్‌ను ఉపయోగించవచ్చు. సింథటిక్ కంటెంట్ స్వభావం గురించి వినియోగదారులకు స్పష్టంగా తెలియజేసే ఇతర ప్రత్యామ్నాయ లేబుల్స్‌ను కూడా బ్రాండ్‌లు ఉపయోగించవచ్చు.
మూణ్నెళ్లలో అమల్లోకి...
ఈ మార్గదర్శకాలు ప్రచురించిన తేదీ నుంచి మూడు నెలల తర్వాత అమల్లోకి వస్తాయి. ఈ సందర్భంగా అస్కి సెక్రటరీ జనరల్, సిఇఒ మనీషా కపూర్ మాట్లాడుతూ, ‘‘ప్రకటనల్లో ఏఐ వినియోగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపధ్యంలో వినియోగదారుల ప్రయోజనాలే కేంద్రంగా మన విధానం కూడా అందుకు అనుగుణంగా మార్పు చెందాలి. , కేవలం ఏఐ లేబుల్‌ను ఉపయోగించినంత మాత్రానే తప్పుదారి పట్టించే ప్రకటన ఆమోదయోగ్యంగా మారదని ఈ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. తుది కంటెంట్ నిజాయితీగా, పారదర్శకంగా ఉండేలా , అస్కి కోడ్‌కు అనుగుణంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రకటనదారులదే’’ అని స్పష్టం చేశారు.


