దేశీయ టెలికాం దిగ్గజం.. రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం రూ.449 రీచార్జ్ ప్లాన్‌లో డేటాతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్, క్లౌడ్ స్టోరేజ్, ఏఐ సేవలు వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ముఖ్యంగా 5జీ ఉపయోగించే వారికి ఈ ప్లాన్‌లో పలు ప్రయోజనాలు లభిస్తాయి.
జియో 449 రూపాయల ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. రోజుకు 3జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 84జీబీ డేటా పొందవచ్చు. రోజువారీ డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbpsకు తగ్గుతుంది. అర్హత ఉన్న కస్టమర్లకు అన్‌లిమిటెడ్ 5జీ డేటా కూడా లభిస్తుంది.
డేటాతో పాటు ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు కూడా లభిస్తాయి. అంటే.. సాధారణ కాల్స్, మెసేజింగ్ కోసం ప్రత్యేకంగా మరో ప్యాక్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అంతే కాకుండా.. జియోహాట్‌స్టార్ మొబైల్ + హాలీవుడ్ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.
అలాగే.. జియోఏఐ క్లౌడ్ 50జీబీ ఫ్రీ స్టోరేజ్ లభిస్తుంది. ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైళ్లను క్లౌడ్‌లో భద్రపరుచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. గూగుల్ జెమినీ ప్రో కూడా ఉచితంగా లభిస్తుంది. దీనితో పాటు 5,000GB క్లౌడ్ స్టోరేజ్, నానో బనానా వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి. అంతే కాకుండా.. కాన్వా ప్రో లైట్ కూడా 12 నెలల పాటు ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది.


