రిలయన్స్‌ జియో రోడ్‌షోల పూర్తి | Reliance Jio IPO Roadshows Complete Final Prospectus SEBI Soon | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ జియో రోడ్‌షోల పూర్తి

Oct 2 2026 8:59 AM | Updated on Oct 2 2026 8:59 AM

Reliance Jio IPO Roadshows Complete Final Prospectus SEBI Soon

ఇక ఐపీవో సన్నాహాలపై దృష్టి

త్వరలో సెబీకి తుది ప్రాస్పెక్టస్‌

ఐనాక్స్‌ క్లీన్‌ ఎనర్జీకి చుక్కెదురు

డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డిజిటల్‌ సర్వీసుల అనుబంధ కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్‌ పబ్లిక్‌ ఇష్యూవైపు వడివడిగా అడుగులేస్తోంది. ఇందుకు వీలుగా ఇప్పటికే విదేశాలలో నిర్వహిస్తున్న రోడ్‌షోలు చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. దీంతో క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రధాన ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసే సన్నాహాలు ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

కంపెనీ ఎండీ, రిలయన్స్‌ జియో చైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ, రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఇషా అంబానీ ఆధ్వర్యంలో రోడ్‌షోలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశాయి. యూకే, దుబాయ్, సింగపూర్, హాంకాంగ్‌లలో తొలి దశ రోడ్‌షోలు చేపట్టినట్లు వెల్లడించాయి. ఇప్పటికే కంపెనీ లిస్టింగ్‌ ప్రణాళికలను సెబీ అనుమతించింది. జూన్‌లో సెబీకి అందించిన ప్రాథమిక పత్రాల ప్రకారం 27 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఇవి ఇష్యూ తదుపరి ఈక్విటీ మూలధనంలో 2.9 శాతం వాటాకు సమానంకాగా.. 3.8 బిలియన్‌ డాలర్లు సమీకరించే వీలున్నట్లు అంచనా. వెరసి దేశీయంగా అతిపెద్ద ఐపీవోగా రికార్డ్‌ నెలకొల్పే అవకాశముంది. లిస్టింగ్‌లో కంపెనీ విలువ సైతం 137 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చని పరిశ్రమ వర్గాలు మదింపు చేస్తున్నాయి. కంపెనీలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటా 66.4 శాతంకాగా.. మెటా, గూగుల్‌ సంయుక్తంగా 17.7 శాతం వాటా కలిగి ఉన్న విషయం విదితమే.

ఐనాక్స్‌ క్లీన్‌ ఎనర్జీ

లిస్టింగ్‌కు వీలుగా ఐనాక్స్‌ క్లీన్‌ఎనర్జీ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను సెబీ తాత్కాలికంగా పక్కనపెట్టింది. ఐనాక్స్‌జీఎఫ్‌ఎల్‌ గ్రూప్‌ కంపెనీ ఐపీవో ద్వారా రూ. 10,000 కోట్లు సమీకరించే ప్రణాళికలు వేసింది. దీనిలో భాగంగా రూ. 8,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్‌ దేవాన్ష్‌ జైన్‌ విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ సెప్టెంబర్‌ 29న సెబీకి ప్రాస్పెక్టస్‌ అందించిన సంగతి తెలిసిందే. అయితే సెబీ వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం ఎలాంటి కారణాలు ప్రకటించకుండా ప్రాస్పెక్టస్‌ను తాత్కాలికంగా పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. ఐపీవోకు వస్తే కంపెనీ ప్రయివేట్‌ రంగంలో టాప్‌ ర్యాంక్‌ పునరుత్పాక ఇంధన దిగ్గజంగా నిలిచే అవకాశముంది.

ఇదీ చదవండి: బ్లాక్‌మనీని వైట్‌గా ఎలా మారుస్తున్నారో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement