రూ. 10,000 కోట్ల సమీకరణకు సై
సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్ దాఖలు
అదే బాటలో మరో 10 కంపెనీలు
కొద్ది రోజులుగా సెకండరీ మార్కెట్లు కళతప్పినప్పటికీ సరికొత్త రికార్డులవైపు ప్రయాణిస్తున్న ప్రైమరీ మార్కెట్లు పలు అన్‌లిస్టెడ్ కంపెనీలకు ప్రోత్సాహాన్నిస్తున్నాయి.
దీంతో ఇప్పటికే ఈ ఏడాది(2026) ఐపీవోకు రావడం ద్వారా 84 కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. ఈ బాటలో తాజాగా మరికొన్ని కంపెనీలు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి.
న్యూఢిల్లీ: భారీ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్ ఎనర్జీ) రంగ కంపెనీ ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ అడుగులు వేసింది. సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. తద్వారా రూ. 10,000 కోట్ల సమీకరణ ప్రణాళికలు ప్రకటించింది. దీంతో దేశీయంగా ప్రయివేట్ రంగంలో అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ దిగ్గజంగా నిలిచే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 8,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ దేవాన్‡్ష జైన్ విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను ఐనాక్స్‌జీఎఫ్‌ఎల్ గ్రూప్ కంపెనీ ప్రధానంగా.. సొంత, అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది.
గ్రూప్ కంపెనీలివీ
కెమికల్స్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాలలో కార్యకలాపాలు విస్తరించిన ఐనాక్స్‌జీఎఫ్‌ఎల్ గ్రూప్‌లో ఇప్పటికే మూడు లిస్టెడ్ కంపెనీలు గుజరాత్ ఫ్లోరోకెమికల్స్, ఐనాక్స్ విండ్, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ ఉన్నాయి. సోలార్ మాడ్యూల్ తయారీ, విండ్ టర్బయిన్ జనరేషన్, ఈపీసీ, రెన్యూవబుల్ ఎనర్జీ కార్యకలాపాలు, నిర్వహణ తదితరాలలో గ్రూప్ సమీకృత సేవలు అందిస్తోంది. ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ రెండు ప్రధాన బిజినెస్ విభాగాలు కలిగి ఉంది. ఇవి పునరుత్పాదక విద్యుదుత్పత్తి, సోలార్ తయారీకాగా.. 2026 ఆగస్ట్‌కల్లా భారత్, ఆఫ్రికాలలో కలిపి స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారు(ఐపీపీ)గా 9.29 గిగావాట్ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది.
వీటిలో 2.37 గిగావాట్ల నిర్వహణా సామర్థ్యంసహా 0.8 గిగావాట్ల నిర్మాణంలో ఉన్న యూనిట్లున్నాయి. మరో 2.99 గిగావాట్ల పైప్‌లైన్ సామర్థ్యం, 3.13 గిగావాట్ల భవిష్యత్ సామర్థ్యాలను ప్రకటించింది. భారత్, యూఎస్‌లలో కలిపి 6 గిగావాట్ల సోలార్ మాడ్యూల్ తయారీ సామరŠాధ్యన్ని కలిగి ఉంది. ఇక్కడ సోలార్ సెల్ తయారీ సామర్థ్యాలు నిర్మాణంలో ఉన్నాయి. అయితే అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ, ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్, వారీ ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీస్, క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తదితర లిస్టెడ్ దిగ్గజాలతో పోటీ పడవలసి ఉంటుంది.
గోప్యతా మార్గంలో
రియల్టీ రంగ దిగ్గజం వాధ్వా గ్రూప్‌నకు చెందిన హోల్డింగ్ కంపెనీ తాజాగా గోప్యతా మార్గంలో సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. వెరసి వాధ్వా గ్రూప్ హోల్డింగ్స్‌ను లిస్ట్ చేయడం ద్వారా వాధ్వా గ్రూప్ పబ్లిక్ మార్కెట్లవైపు అడుగులు వేస్తోంది. ప్రధానంగా ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో 250కుపైగా ప్రాజెక్టులను గ్రూప్ అభివృద్ధి చేసింది. వీటిలో రెసిడెన్షియల్, కమర్షియల్, టౌన్‌షిప్ తదితరాలున్నాయి. అయితే కంపె నీ గోప్యతా విధానాన్ని ఎంచుకోవడంతో తొలి దశ లో ఐపీవో వివరాలు వెల్లడికాని సంగతి తెలిసిందే.
వర్ధమాన్ అప్లయెన్సెస్
కన్జూమర్ అప్లయెన్సెస్ తయారీ కంపెనీ వర్ధమాన్ అప్లయెన్సెస్ లిస్టింగ్‌కు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీని ప్రకారం రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 2.5 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పట్‌లో కొత్త ప్రాజెక్ట్ ఏర్పాటుతోపాటు రుణాల చెల్లింపులకు వినియోగించనుంది. మరికొన్ని నిధులను సొంత అనుబంధ సంస్థ లేజర్ ఇండియా రుణ చెల్లింపులుసహా సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. కంపెనీ సమీకృత ఎల్రక్టానిక్ మ్యాన్యుఫాక్చరింగ్ సరీ్వసులు(ఈఎంఎస్) అందిస్తోంది. దేశ, విదేశీ కన్జూమర్ బ్రాండ్లకు ఫ్యాన్లు, కిచెన్ అప్లయెన్సెస్ తదితర ఎఫ్‌ఎంఈజీ సంబంధిత ఓఈఎం, ఓడీఎం సొల్యూషన్లు సమకూర్చుతోంది.
శ్రీజీకృప ప్రాజెక్ట్స్
మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసే శ్రీజీకృప ప్రాజెక్ట్స్ ఐపీవోకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీని ప్రకారం రూ. 410 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 90 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 500 కోట్ల సమీకరణపై కన్నేసింది. ఈక్విటీ జారీ నిధులను మెషీనరీ, పరికరాల కొనుగోళ్లు తదితర పెట్టుబడి వ్యయాలతోపాటు.. వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా అకడమిక్, హెల్త్‌కేర్, రెసిడెన్షియల్, ఆఫీస్ బిల్డింగ్స్ తదితర ప్రత్యేక ప్రాజెక్టులకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ కార్యకలాపాలు అందిస్తోంది.
సెబీవైపు చూపు
ఐపీవో ద్వారా నిధుల సమీకరణ చేపట్టాలని సెబీకి పయనీర్ ఫ్యాబ్రికేటర్స్, పెంటకిల్ కన్సల్టెంట్స్(ఐ), టెంటీ లిమిటెడ్, పీసీఐ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్, సంఘ్వీ హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మొమాయ్ ఆర్ట్, బయోకాన్ ఎలక్ట్రిక్ సైతం తాజాగా దరఖాస్తు చేశాయి. తద్వారా స్టాక్ ఎక్సే్చంజీలలో లిస్టింగ్‌కు ప్రణాళికలు ప్రకటించాయి. ఇష్యూ నిధులను కంపెనీలు వ్యాపార విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలు తదితర విభిన్న అంశాలకు వెచ్చించనున్నాయి.


