హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త బాస్‌ అనూప్‌ బాగ్చి  | India HDFC Bank appoints outsider Anup Bagchi as CEO | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త బాస్‌ అనూప్‌ బాగ్చి 

Oct 2 2026 5:23 AM | Updated on Oct 2 2026 5:23 AM

India HDFC Bank appoints outsider Anup Bagchi as CEO

నియామకానికి ఆర్‌బీఐ ఆమోద ముద్ర 

అక్టోబర్‌ 27న బాధ్యతల స్వీకరణ 

ముంబై: ప్రైవేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తదుపరి మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో)గా అనూప్‌ బాగ్చి నియామకానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆమోదం తెలిపింది. మూడేళ్ల పాటు సేవలు అందించేందుకుగానూ ఈ అక్టోబర్‌ 27న ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఐసీఐసీఐ బ్యాంకు, దాని అనుబంధ సంస్థల్లో 1992 నుంచి సేవలు అందించిన బాగ్చి, ప్రస్తుతం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రస్తుత ఎండీ, సీఈవో శశిధర్‌ జగదీశన్‌ మూడేళ్ల పదవీకాలం ఈ నెలతో ముగియనుంది. ఆయన నాయకత్వంలో దుబాయ్‌ బ్రాంచ్‌లో ఉత్పత్తుల ‘మిస్‌–సెల్లింగ్‌’ (తప్పుడు విక్రయాలు) కారణంగా ఇన్వెస్టర్లు నష్టపోవడం, డిపాజిట్ల సమీకరణకు అందించిన ఇన్సెంటివ్‌ల వ్యవహారంలో జగదీశన్‌పై బ్యాంక్‌ బోర్డు జరిమానా విధించడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఆగస్టులో రేసు నుంచి జగదీశన్‌ తప్పుకోవడంతో, ఆర్‌బీఐకి పంపిన ఇద్దరి పేర్లలో అనూప్‌ బాగ్చిని ఎంపిక చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement