ఐపీవో నిధుల సమీకరణ రికార్డ్‌  | Indian companies raised a record Rs 94205 crore | Sakshi
Sakshi News home page

ఐపీవో నిధుల సమీకరణ రికార్డ్‌ 

Oct 2 2026 5:19 AM | Updated on Oct 2 2026 5:19 AM

Indian companies raised a record Rs 94205 crore

ఏప్రిల్‌–సెపె్టంబర్‌లో రూ. 94,205 కోట్లు 

ముంబై: పబ్లిక్‌ ఇష్యూల ద్వారా కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి ఆరు నెలల్లో 75 కంపెనీలు ఉమ్మడిగా రూ. 94,205 కోట్లు సమీకరించాయి. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. ఇంతక్రితం ఇదే కాలం(ఏప్రిల్‌–సెపె్టంబర్‌)లో అంటే 2025–26లో రూ. 69,533 కోట్ల సమీకరణ రికార్డ్‌గా నిలుస్తూ వచ్చింది. 65 కంపెనీలు ఐపీవోల ద్వారా సమకూర్చుకున్న ఈ నిధులకంటే తాజా సమీకరణ 35 శాతం అధికంకావడం విశేషం!

 ప్రస్తుత ఏడాది తొలి 6 నెలల్లో స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈసహా ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్, మణిపాల్‌ హెల్త్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తదితరాలున్నాయి. ప్రైమ్‌ డేటాబేస్‌ గణాంకాల ప్రకారం నిజానికి ఈ ఏడాది తొలి 3 నెలలు ప్రైమరీ మార్కెట్‌ బలహీనంగా ప్రారంభమైంది. సెకండరీ మార్కెట్ల హెచ్చుతగ్గుల మధ్య రూ. 3,94 కోట్లు సమీకరించినట్లు ప్రైమ్‌ డేటాబేస్‌ ఎండీ ప్రణవ్‌ హాల్దియా చెప్పారు. 

పూర్తి ఏడాదికి..: ప్రైమరీ మార్కెట్ల జోరును కొనసాగిస్తూ ఇప్పటికే 145 కంపెనీలు లిస్టింగ్‌కు సెబీ అనుమతిని పొందాయి. తద్వారా రూ. 2.78 లక్షల కోట్ల సమీకరణ ప్రణాళికలు ప్రకటించాయి.  మరో 102 కంపెనీలు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ కోసం వేచి చూస్తున్నాయి. అనుమతిస్తే ఉమ్మడిగా రూ. 1.87 లక్షల కోట్లు అందుకోవాలని ఆశిస్తున్నాయి. కాగా.. ఎస్‌ఎంఈ ఐపీవోలు, సంస్థాగత ప్లేస్‌మెంట్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్టీ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ల నిధుల సమీకరణను సైతం పరిగణిస్తే ఈ ఏడాది 75 శాతం అధికంగా రూ. 2.43 లక్షల కోట్ల నిధుల సమీకరణకు తెరలేచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement