ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ | NSE IPO subscribed 5. 7 times as bidding ends, shares to list on September | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ

Sep 22 2026 4:36 AM | Updated on Sep 22 2026 4:36 AM

NSE IPO subscribed 5. 7 times as bidding ends, shares to list on September

సెప్టెంబర్‌ 24న బీఎస్‌ఈలో లిస్టింగ్‌  
    గ్రే మార్కెట్‌ ప్రీమియం రూ. 55

ముంబై: సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి బలమైన డిమాండ్‌ రావడంతో నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజీ (ఎన్‌ఎస్‌ఈ) పబ్లిక్‌ ఇష్యూకు చివరి రోజు నాటికి దాదాపు ఆరు రెట్ల అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా ఎన్‌ఎస్‌ఈ 8.86 కోట్ల షేర్లను జారీ చేయగా, మొత్తం 50.58 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. దీంతో మొత్తం సబ్‌స్క్రిప్షన్‌ 5.71 రెట్లుగా నమోదైనట్లు బీఎస్‌ఈ డేటా వెల్లడించింది. 

అర్హత కలిగిన సంస్థాగత ఇన్వెస్టర్ల (క్యూఐబీలు) విభాగం 12.68 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల (ఎన్‌ఐఐ) విభాగం 6.55 రెట్లు సబ్‌స్రై్కబ్‌ అయ్యాయి. రిటైల్‌ ఇన్వెస్టర్ల కోటా 1.39 రెట్ల స్పందన లభించింది. వెరసి, రూ.22,568 కోట్ల ఇష్యూకు దాదాపు రూ.90,300 కోట్ల డిమాండ్‌ లభించింది.

 ఈ ఐపీఓకు ఈక్విటీ షేరుకు రూ.1,700–1,785గా ప్రైస్‌ బ్యాండ్‌ను నిర్ణయించారు. అప్పర్‌ బ్యాండ్‌ ధర రూ.1,785 వద్ద కంపెనీ విలువ రూ.4.42 లక్షల కోట్ల వరకు ఉండనుంది. ఎన్‌ఎస్‌ఈ షేర్లు సెపె్టంబర్‌ 24న బీఎస్‌ఈలో ఎక్సే్చంజీలో లిస్ట్‌ కానున్నాయి. బిడ్డింగ్‌ సమయంలో రూ.285 వరకు చేరిన ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ గ్రే మార్కెట్‌ ప్రీమియం (జీఎంపీ) ప్రస్తుతం రూ.55 వద్ద ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement