ఒక్కసారిగా తగ్గిన గోల్డ్ రేటు.. కొత్త రేట్లు ఇలా.. | Gold Price in India Know The Hyderabad Vijayawada Chennai and Delhi Rates Here | Sakshi
Sakshi News home page

ఒక్కసారిగా తగ్గిన గోల్డ్ రేటు.. కొత్త రేట్లు ఇలా..

Sep 21 2026 6:56 PM | Updated on Sep 21 2026 8:11 PM

Gold Price in India Know The Hyderabad Vijayawada Chennai and Delhi Rates Here

బంగారం ధరల్లో ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. ఉదయం ఒక రేటు ఉంటే.. సాయంత్రానికి మరో రేటుకు మారిపోతోంది. ఈ రోజు (సోమవారం) ఉదయం రూ.1,55,680 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర, సాయంత్రానికి రూ.1,54,580 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. బంగారం ధరలు గంటల వ్యవధిలో ఎంతలా మారిపోయాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ కథనంలో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీలలో గోల్డ్ రేటు ఎలా ఉందో చూసేద్దాం.

హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు ఉదయం రూ.142700 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు, సాయంత్రానికి రూ.141700 వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు రూ. 1,55,680 వద్ద నుంచి రూ.1,54,580 వద్దకు చేరింది. ఇదే ధరలు ముంబై, బెంగళూరులలో కూడా కొనసాగుతాయి.

ఇదీ చదవండి: ముఖంతో సంపాదన.. ఏకంగా రూ.14 లక్షల వరకు!

ఇక ఢిల్లీ విషయానికి వస్తే.. దేశ రాజధాని నగరంలో కూడా పసిడి ధరలో మార్పులు కనిపించాయి. 22 క్యారెట్ల రేటు రూ.1,42,850 నుంచి రూ.1,41,850 వద్దకు, 24 క్యారెట్ల రేటు 1,55,830 రూపాయల నుంచి రూ.1,54,730 వద్దకు చేరింది.

చెన్నైలో మాత్రం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అంటే.. 22 క్యారెట్ల రేటు, 24 క్యారెట్ల రేట్లు ఉదయం ఎలా ఉన్నాయో.. సాయంత్రం కూడా అక్కడే ఉన్నాయి.

భారీగా తగ్గిన గోల్డ్ రేటు1
1/6

భారీగా తగ్గిన గోల్డ్ రేటు2
2/6

భారీగా తగ్గిన గోల్డ్ రేటు3
3/6

భారీగా తగ్గిన గోల్డ్ రేటు4
4/6

భారీగా తగ్గిన గోల్డ్ రేటు5
5/6

భారీగా తగ్గిన గోల్డ్ రేటు6
6/6

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement