భారతదేశంలో లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగంగా మారుతోంది. ఒకప్పుడు ఖరీదైన ఇల్లు అంటే.. మంచి లొకేషన్, మంచి నిర్మాణం ఉంటే సరిపోయేది. కానీ.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొనుగోలుదారులు ఇంటితో పాటు ప్రత్యేకమైన లైఫ్‌స్టైల్, అంతర్జాతీయ బ్రాండ్ గుర్తింపు, హోటల్ తరహా సదుపాయాలు, వెల్‌నెస్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి అనుభవాలను కూడా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ లగ్జరీ అడ్వైజరీ సంస్థ లూరా హోల్డింగ్స్.. భారతీయ రియల్ ఎస్టేట్ అడ్వైజరీ, మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ 'సిరిల్'తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఈ భాగస్వామ్యం ద్వారా.. లగ్జరీ, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, హాస్పిటాలిటీ, వెల్‌నెస్, రిటైల్ బ్రాండ్లను భారత్‌లోని మంచి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులతో అనుసంధానం చేయాలని రెండు సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
లూరా హోల్డింగ్స్ సంస్థకు 300కు పైగా ప్రముఖ లగ్జరీ, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ బ్రాండ్లతో సంబంధాలు ఉండగా.. సిరిల్ కంపెనీకు భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్, డెవలపర్లు, స్థానిక మార్కెట్ పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. ఈ రెండు సంస్థల అనుభవం కలిస్తే.. మన దేశంలో మరింత ప్రత్యేకమైన బ్రాండెడ్ లగ్జరీ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది.
భారత్‌లో పెరుగుతున్న సంపద, మారుతున్న జీవనశైలి, అంతర్జాతీయ అనుభవాలపై ఆసక్తి కారణంగా లగ్జరీ రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ ఎప్పటికప్పుడు మారిపోతోంది. ఇకపై.. కేవలం భవనం పేరు లేదా ఖరీదైన నిర్మాణం మాత్రమే కాకుండా, అక్కడ లభించే మొత్తం అనుభవమే కీలకంగా మారనుంది. అందుకే ఈ భాగస్వామ్యం ద్వారా కొత్త తరం లగ్జరీ కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ప్రత్యేకమైన, అనుభవాధారిత రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను రూపొందించేందుకు రెండు సంస్థలు ప్రయత్నించనున్నాయి.


