గడ్కరీ ఆలోచన: ఇదే జరిగితే.. రోడ్లు అవసరం లేదు! | Nitin Gadkari Talks About Flying Bus Innovation | Sakshi
Sakshi News home page

గడ్కరీ ఆలోచన: ఇదే జరిగితే.. రోడ్లు అవసరం లేదు!

Oct 1 2026 5:32 PM | Updated on Oct 1 2026 5:50 PM

Nitin Gadkari Talks About Flying Bus Innovation

ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భవిష్యత్‌ రవాణా గురించి మాట్లాడుతున్నప్పుడు.. 'ఫ్లయింగ్‌ బస్‌' ఆలోచనను మరోసారి ప్రస్తావించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రోడ్లపై ట్రాఫిక్‌ సమస్యను తగ్గించేందుకు.. గాల్లో ప్రయాణించే బస్సులాంటి ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థను తీసుకురావాలన్నది తన ఆలోచన అని గడ్కరీ పేర్కొన్నారు. అయితే ఇదెలా సాధ్యం, ఎప్పుడు అమల్లోకి వస్తుంది అనే విషయాలను వెల్లడించలేదు.

ఫ్లయింగ్‌ బస్‌
సాధారణంగా బస్సు అంటే రోడ్డుపై ప్రయాణించే వాహనంగానే ఊహించుకుంటారు. కానీ గడ్కరీ చెప్పిన ఆలోచన.. దీనికి పూర్తిగా భిన్నం. ఎందుకంటే.. బస్సు రోడ్డుపై కాకుండా గాల్లో ప్రయాణిస్తూ, ఒకేసారి సుమారు 250 మంది ప్రయాణికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లాలి అనేది లక్ష్యం.

గడ్కరీ తన ఆలోచనను వివరిస్తూ.. భవనాల పైభాగం లేదా టెర్రస్‌ నుంచి ప్రయాణికులు ఎక్కి, అక్కడి నుంచి గాల్లో ప్రయాణించే రవాణా వ్యవస్థ ద్వారా మరో ప్రాంతానికి చేరుకునే విధానాన్ని ఊహిస్తున్నట్లు చెప్పారు. ఇదే జరిగితే రోడ్లు కూడా అవసరం లేదు.

గడ్కరీ ఆలోచనకు ప్రధాన కారణం.. నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్య. రోడ్లపై వాహనాలు పెరుగుతున్న కొద్దీ ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో కొత్త రోడ్లు నిర్మించడానికి స్థలం కూడా పరిమితంగానే ఉంటుంది.

అలాంటి పరిస్థితుల్లో రోడ్డుపైనే మరో రవాణా మార్గాన్ని నిర్మించడం కంటే.. గాల్లో ప్రయాణించే రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తే ట్రాఫిక్‌ను దాటుకుంటూ వేగంగా ప్రయాణించవచ్చన్నది ఈ ఆలోచన వెనుక ఉద్దేశం. గడ్కరీ ప్రతిపాదిస్తున్న భవిష్యత్‌ రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్‌ మాస్‌ ట్రాన్స్‌పోర్ట్‌, రోప్‌వేలు, కేబుల్‌ కార్లు వంటి ఇతర విధానాలు కూడా ఉన్నాయి.

ఇదీ చదవండి: గడ్కరీ కొత్త ప్లాన్.. రైతులకు లాభం!

ఇది నిజంగా సాధ్యమేనా?
గడ్కరీ చెప్పిన విషయం సాధ్యమవుతుందా?, లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. ఇది ట్రాఫిక్ తగ్గించడానికి ఉత్తమమైన మార్గం అని స్పష్టమవుతుంది. అయితే టెక్నాలజీ పెరుగుతున్న కాలంలో.. రాబోయే రోజుల్లో ఫ్లయింగ్‌ బస్ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement