ఎగుమతిదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌! | Big Relief for Exporters | Sakshi
Sakshi News home page

ఎగుమతిదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌!

Oct 1 2026 8:58 PM | Updated on Oct 1 2026 8:58 PM

Big Relief for Exporters

పశ్చిమాసియాకు ఎగుమతులపై అదనపు బీమా కవరేజీని 2027 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు డీజీఎఫ్‌టీ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌) ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (ఈసీజీసీ) నుంచి తీసుకున్న క్రెడిట్‌ రిస్క్‌ బీమాకి సంబంధించిన అదనపు కవరేజీ వాస్తవానికి సెప్టెంబర్ 30తో ముగిసింది. సాధారణంగా క్రెడిట్‌ రిస్కులో 85-90 శాతం వరకు మొత్తానికి ఈసీజీసీ కవరేజీ ఇస్తుంది.

అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 19న ప్రకటించిన ’రిలీఫ్‌’ స్కీము కింద 95 శాతం వరకు పొందవచ్చు. అదనపు కవరేజీకి అయ్యే రుసుముల భారాన్ని కేంద్రం భరిస్తుంది. కాగా, ఎగుమతి సుంకాల రిఫండ్‌ స్కీమ్‌ (ఆర్‌వోడీటీఈపీ)ని డిసెంబర్‌ 31 దాకా మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు డీజీఎఫ్‌టీ తెలిపింది.

ఇది కూడా సెప్టెంబర్‌ 30తో ముగిసింది. స్కీము పొడిగింపును స్వాగతించిన పరిశ్రమ వర్గాలు.. దీన్ని మరింత దీర్ఘకాలం పాటు పెంచాలని కోరాయి. 2021లో ప్రవేశపెట్టిన ఈ స్కీము కింద 0.3–3.9 శాతం వరకు రిఫండ్‌ లభిస్తుంది. తయారీ, పంపిణీ ప్రక్రియకు సంబంధించి కేంద్రం, రాష్ట్రాల నుంచి రీయింబర్స్‌మెంట్‌ లభించని సుంకాలు, పన్నులు మొదలైన వాటి భారాన్ని కొంత తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement