షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వ్యూహాత్మక అడుగులు | Tata Sons IPO Forced by RBI What It Means for Shapoorji Pallonji Debt | Sakshi
Sakshi News home page

షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వ్యూహాత్మక అడుగులు

Sep 30 2026 4:03 PM | Updated on Sep 30 2026 4:10 PM

Tata Sons IPO Forced by RBI What It Means for Shapoorji Pallonji Debt

టాటా సన్స్ లిస్టింగ్ ప్రక్రియ వ్యాపార వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. టాటా సన్స్ హ్యాండిల్ చేస్తున్న కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (సీఐసీ) హోదాను వదులుకునేందుకు ఆర్‌బీఐ ఇటీవల అంగీకరించకపోవడంతో టాటా సన్స్ ఐపీఓకు వెళ్లక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో దాదాపు 18.37 శాతం వాటా కలిగిన షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్ చర్యలు ఇప్పుడు ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

రూ.25,000 కోట్ల ఆఫర్

టాటా సన్స్ లిస్టింగ్‌ను నివారించే ఉద్దేశంతో ఎస్‌పీ గ్రూప్ ఛైర్మన్ షాపూర్ మిస్త్రీ 3 శాతం వాటాను దాదాపు రూ.25,000 కోట్లకు తిరిగి టాటా సన్స్‌కే విక్రయించేందుకు ప్రతిపాదన తెచ్చారు. అయితే, టాటా సన్స్ బోర్డు 4:1 మెజారిటీతో ఈ బైబ్యాక్ ఆఫర్‌ను తిరస్కరించింది. ఫలితంగా, టాటా సన్స్ లిస్టింగ్ అనివార్యమైంది. ఐపీఓ ప్రతిపాదనను స్వాగతిస్తూ షాపూర్ మిస్త్రీ ‘ఆర్‌బీఐ స్పష్టమైన మార్గదర్శకాల నేపథ్యంలో టాటా సన్స్ లిస్టింగ్ అనేది వాటాదారులు, ట్రస్టుల మధ్య వారధిగా పనిచేస్తుంది. ఇది పారదర్శకతకు నిదర్శనం’ అని పేర్కొన్నారు.

రుణాల ఒత్తిడి.. ఎస్‌పీ గ్రూప్ వ్యూహం

గత కొన్నేళ్లుగా ఎస్‌పీ గ్రూప్‌పై తీవ్రమైన రుణ భారం ఉంది. ఈ గ్రూప్ రుణాల విలువ దాదాపు రూ.60,000 కోట్లుగా అంచనా. ఇటీవలే ఎస్‌పీ గ్రూప్ రూ.15,100 కోట్ల ప్రైవేట్ క్రెడిట్ బాండ్లను 18.95% అధిక వడ్డీ రేటుతో సేకరించింది. టాటా సన్స్‌లోని తమ వాటాను తదనుగుణంగా సెక్యూరిటీగా కూడా ఉంచింది. సెప్టెంబర్ చివరినాటికి రూ.3,500 కోట్ల రుణాన్ని చెల్లించగా రాబోయే రోజుల్లో మిగిలిన చెల్లింపులు చేయాల్సి ఉంది.

విశ్లేషకుల ప్రకారం, ప్రస్తుతం టాటా సన్స్ విలువ రూ.9 లక్షల కోట్ల నుంచి రూ.12.5 లక్షల కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఈ లెక్కన ఎస్‌పీ గ్రూప్ వద్ద ఉన్న 18.37% వాటా విలువ రూ.1.5 లక్షల కోట్ల నుంచి రూ.2.2 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఈ పబ్లిక్ లిస్టింగ్ పూర్తయితే ఎస్‌పీ గ్రూప్‌నకు కావాల్సిన లిక్విడిటీ లభించి తమ రుణాల భారాన్ని సులువుగా తగ్గించుకునే అవకాశం ఏర్పడుతుంది.

ఇదీ చదవండి: ఈరోజు పెరిగినా రూ.లక్షన్నర కిందే బంగారం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement