పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు! | Gold Price Down in India Know The Latest Rates in Hyderabad Chennai and Delhi | Sakshi
Sakshi News home page

Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!

Oct 3 2026 6:27 PM | Updated on Oct 3 2026 6:43 PM

Gold Price Down in India Know The Latest Rates in Hyderabad Chennai and Delhi

బంగారం ధరలు వారం రోజుల్లో భారీ తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో ఊహకందని మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో (సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 03) పసిడి ధరలు ఎలా మార్పు చెందాయి?, నేటి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.

సెప్టెంబర్ 27న హైదరాబాద్, విజయవాడలలో రూ.1,52,680 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. అక్టోబర్ 03 నాటికి రూ.1,49,180 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. వారం రోజుల్లో బంగారం ధర గరిష్టంగా రూ.3500 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం రేటు రూ.1,39,950 నుంచి రూ.1,36,750 వద్దకు (రూ.3200 తగ్గింది) చేరింది.

చెన్నైలోనూ బంగారం ధరల్లో మార్పు కనిపించింది. ఇక్కడ 24 క్యారెట్ల రేటు రూ.1,52,730 నుంచి రూ.1,49,330 వద్దకు (రూ.3400 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,000 నుంచి రూ.1,36,750 వద్దకు (రూ.3250 తగ్గింది) చేరింది.

ఢిల్లీ విషయానికి వస్తే.. ఈ నగరంలో 24 క్యారెట్ల రేటు రూ.1,52,830 నుంచి రూ.1,49,180 వద్దకు (రూ.3550 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,100 నుంచి రూ.1,36,900 వద్దకు (రూ.3200 తగ్గింది) చేరింది.

వెండి ధరలు ఇలా..
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. సెప్టెంబర్ 27న రూ.2.50 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి రేటు.. అక్టోబర్ 3 నాటికి రూ.2.45 వద్దకు చేరింది. అంటే ఏడు రోజుల్లో గోల్డ్ రేటు రూ.5000 తగ్గినట్లు స్పష్టమవుతోంది.

ఇదీ చదవండి: ఇదే జరిగితే.. బంగారం రూ.3 లక్షలకు!

ఈ రోజు బంగారం ధరలు
ఈ రోజు (శనివారం) పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల రేటు, 22 క్యారెట్ల రేటు వరుసగా రూ.1100, రూ.1000 తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, ఢిల్లీలలో గోల్డ్ రేటు ఎలా ఉందో కింద చూడవచ్చు.

ఈ రోజు బంగారం ధరలు1
1/4

ఈ రోజు బంగారం ధరలు2
2/4

ఈ రోజు బంగారం ధరలు3
3/4

ఈ రోజు బంగారం ధరలు4
4/4

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement