చైనా వాహన తయారీ దిగ్గజం బీవైడీ తన లగ్జరీ సబ్-బ్రాండ్ డెంజాను భారతదేశానికి తీసుకువస్తోంది. ఈ విషయాన్ని సంస్థ అధికారిక పత్రికా ప్రకటన ద్వారా మాత్రమే కాకుండా.. సోషల్ మీడియా ప్రకటన ద్వారా కూడా ధృవీకరించింది.
భారతదేశంలో డెంజా మోడల్ ధర రూ. 70 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. నిజానికి ప్రపంచవ్యాప్తంగా డెంజా కొత్త పేరు ఏమీ కాదు. ఇది 2010లో బీవైడీ - మెర్సిడెస్ బెంజ్ మధ్య ఒక జాయింట్ వెంచర్‌గా ప్రారంభమైంది. ఆ తర్వాత 2024లో మెర్సిడెస్ పూర్తిగా వైదొలిగి, పూర్తి యాజమాన్యాన్ని బీవైడీకి అప్పగించింది. అప్పటి నుంచి.. ఈ బ్రాండ్ ఆగ్నేయాసియా, చైనా, ఆస్ట్రేలియా, యూరప్, లాటిన్ అమెరికాకు విస్తరించింది.
ప్రారంభంలో డెంజా రెండు మోడళ్లతో భారతదేశంలోకి అడుగుపెట్టనుంది. ప్రస్తుత లైనప్‌లో జెడ్9 జీటీ, బావో 5, జెడ్, డీ9 ఉన్నాయి. అయితే ఇందులో ఏది ముందుగా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుందనే విషయాలు తెలియాల్సి ఉంది.


