శుభవార్త.. బంగారం కొనేందుకు ఇది మంచి సమయం! | Gold Rate Fall Down Know The Latest Price in Hyderabad Bengaluru Mumbai and Delhi | Sakshi
Sakshi News home page

శుభవార్త.. బంగారం కొనేందుకు ఇది మంచి సమయం!

Sep 22 2026 6:38 PM | Updated on Sep 22 2026 7:03 PM

Gold Rate Fall Down Know The Latest Price in Hyderabad Bengaluru Mumbai and Delhi

బంగారం ధరల్లో మరోసారి భారీ మార్పు చోటు చేసుకుంది. ఈ రోజు (మంగళవారం) ఉదయం పెరిగిన గోల్డ్ రేటు, సాయంత్రానికి భారీ పతనాన్ని చవిచూసింది. దీంతో పసిడి ధరలలో గణనీయమైన మార్పులు జరిగాయి. ఈ కథనంలో కొత్త ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో మంగళవారం ఉదయం రూ.1,41,850 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, సాయంత్రానికి రూ.1,40,550 వద్దకు (రూ.1300 తగ్గింది) చేరింది. 24 క్యారెట్ల రేటు రూ.1,54,750 నుంచి రూ.1,53,330 వద్దకు (రూ.1420 తగ్గింద) చేరింది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.1,40,550 వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.153330 వద్ద ఉంది. అయితే చెన్నైలో మాత్రం గోల్డ్ రేటు ఉదయం ఎక్కడ ఉందో.. సాయంత్రానికి కూడా అక్కడే ఉంది. వెండి ధరల్లో కూడా గంటల వ్యవధిలో ఊహకందని మార్పులేమీ జరగలేదు.

 తగ్గిన బంగారం ధరలు!1
1/6

 తగ్గిన బంగారం ధరలు!2
2/6

 తగ్గిన బంగారం ధరలు!3
3/6

 తగ్గిన బంగారం ధరలు!4
4/6

 తగ్గిన బంగారం ధరలు!5
5/6

 తగ్గిన బంగారం ధరలు!6
6/6

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement