హైదరాబాద్‌కు చెందిన డీప్‌టెక్ సంస్థ హైలెనర్, అమెరికాలోని టెక్సాస్ ఎండ్‌ఎం యూనివర్సిటీలో తన ఫ్యూజన్ రియాక్టర్‌పై జరిపిన మొదటి దశ (ఫేజ్-1) స్వతంత్ర పరీక్షలను పూర్తి చేసింది. ఈ పరీక్షల్లో ఉపయోగించిన దానికంటే ఎక్కువ శక్తి వేడి రూపంలో విడుదలైనట్లు సంస్థ ప్రకటించింది.
అంతేకాకుండా.., హీలియం-ఆర్గాన్ లాంటి వాయువులు ఎక్కువవడం, లోహ నమూనాల్లో మార్పులను గమనించారు. రేడియేషన్ స్థాయులు మాత్రం సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు స్పష్టమైంది. ఈ ఫలితాల ఆధారంగా, హైలెనర్ ఇప్పుడు రెండో దశ పరీక్షలకు సిద్ధమవుతోంది. మరిన్నిసార్లు రియాక్టర్లను పరిశీలిస్తారు. వెలువడే అదనపు వేడిని కచ్చితంగా కొలవడం, ఫలితాలను రిప్రోడ్యూస్ చేయడం, వాణిజ్యపరమైన వినియోగానికి అవసరమైన అంశాలపై అధ్యయనం ఉంటుంది.
“మా లక్ష్యం కేవలం ప్రయోగశాల పరిశీలనలకే పరిమితం కాదు. ఈ సాంకేతికతను కఠినమైన, స్వతంత్ర పరీక్షలకు గురి చేయనున్నాం” అని హైలెనర్ సహ వ్యవస్థాపకుడు రామ్ రామసేషన్ అన్నారు. కాలుష్యరహిత శక్తితో పాటు, రేర్ ఎర్త్ లోహాల ఉత్పత్తికీ ఈ టెక్నాలజీ అవకాశం కల్పిస్తుందని హైలెనెర్ చెబుతోంది. ఈ అధ్యయన ఫలితాలను కెనడాలో జరిగిన అంతర్జాతీయ సదస్సు (ఐసీసీఎఫ్-27)లో ప్రదర్శించారు.
ఇది ఎందుకు ముఖ్యం?
ప్రపంచవ్యాప్తంగా కాలుష్యరహితమైన, అపరిమిత శక్తి కోసం కేంద్రక సంలీన ప్రక్రియ (రెండు అణువులు లయమయ్యే క్రమంలో పుట్టే శక్తి) ఎన్నో పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. హైలైనర్ సైతం తాము ఒక కొత్త రకం పద్ధతిని ఉపయోగించి సాధారణ పరిస్థితుల్లోనే ఉపయోగించిన దాని కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తున్నామని చెబుతోంది. రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఉత్పత్తికి, విద్యుత్తు వాహనాలకూ ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరమని కంపెనీ చెబుతోంది. కంపెనీ చేపట్టనున్న రెండోదశ ప్రయోగాలూ విజయవంతమైతే విద్యుదుత్పత్తి రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సాధ్యమవుతాయి.


