యువతికి వీడియో కాల్‌ చేసి.. ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య | AR Constable Suicide In Hyderabad | Sakshi
Sakshi News home page

యువతికి వీడియో కాల్‌ చేసి.. ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Sep 22 2026 12:42 PM | Updated on Sep 22 2026 12:47 PM

AR Constable Suicide In Hyderabad

హైదరాబాద్‌: పెళ్లి విషయంలో మనస్థాపంతో ఏఆర్‌ కానిస్టేబుల్‌ యువతికి వీడియో కాల్‌ చేసి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. మలక్‌పేట పోలీసులు తెలిపిన మేరకు.. మంచిర్యాల, బెల్లంపల్లికి చెందిన  ముత్తా చంద్రశేఖర్‌ (36) శాలివాహననగర్‌ డ్రీమ్‌ హోమ్‌ అపార్ట్‌మెంట్‌లో  ఉంటున్నాడు. మల్కాజ్‌గిరి కమిషనరేట్‌ పరిధిలో ఏఆర్‌ విభాగంలో  కానిస్టేబుల్‌గా అంబర్‌పేట హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్నాడు.ఇటీవల మంచిర్యాలకు చెందిన సమీప బంధువైన యువతితో పెళ్లి కుదిరింది. కొద్ది రోజుల తర్వాత చంద్రశేఖర్‌ తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని చెప్పాడు. 

ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.  దీంతో పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత కూడా ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి  యువతికి వీడియో కాల్‌ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి బెడ్‌షి ట్‌తో గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.  యువతి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో  మలక్‌పేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పెళ్లికి సంబంధించిన సమస్యల కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై సంజీవరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement