నిమ్స్‌ అధికారి లక్ష్మీభాస్కర్‌కు ఏసీబీ షాక్‌ | Acb Shocks Nims Officer Lakshmi Bhaskar | Sakshi
Sakshi News home page

నిమ్స్‌ అధికారి లక్ష్మీభాస్కర్‌కు ఏసీబీ షాక్‌

Sep 22 2026 8:54 AM | Updated on Sep 22 2026 9:00 AM

Acb Shocks Nims Officer Lakshmi Bhaskar

సాక్షి, హైదరాబాద్‌: నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ అడిషనల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మీ భాస్కర్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దృష్టి సారించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఆయన కలిగి ఉన్నారనే ఆరోపణలపై మంగళవారం ఉదయం ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. మూడు జిల్లాల్లో మొత్తం 12 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

డాక్టర్‌ లక్ష్మీ భాస్కర్‌కు సంబంధించిన నివాసాలు, ఇతర అనుబంధ ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు సోదాలు చేపట్టినట్లు సమాచారం. ఆస్తులు, బ్యాంకు లావాదేవీలు, కీలక పత్రాలకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

సోదాలు పూర్తయిన తర్వాత ఎలాంటి ఆస్తులు, పత్రాలు గుర్తించారు? వాటి విలువ ఎంత? ఆదాయానికి మించిన ఆస్తులపై ఏసీబీకి అందిన ఆధారాలేమిటి? అనే వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మూడు జిల్లాల్లో 12 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు ఏసీబీ అధికారుల అధికారిక ప్రకటన తర్వాత వెలుగులోకి రానున్నాయి. గతంలోనూ ఆయనపై చీటింగ్‌ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: అక్షిత కేసు.. అనూహ్య మ‌లుపులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement