2026 ఏషియన్ గేమ్స్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన చికితా తానిపర్తిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. జపాన్‌లో జరిగిన ఈ క్రీడా వేదికపై ఆమె చూపిన ప్రతిభకు నీతా అంబానీ అభినందనలు తెలిపారు.
చికిత సాధించిన ఘనత పట్ల స్పందించిన నీతా అంబానీ.. ''నువ్వు సాధించిన విజయంతో అమ్మాయిలందరూ గర్వపడేలా చేశావు. మన దేశంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమ్మాయిలకు నువ్వు స్ఫూర్తిగా నిలవబోతున్నావు'' అంటూ ప్రశంసించారు.
చికితా తానిపర్తి ప్రదర్శన కేవలం ఒక క్రీడా విజయం మాత్రమే కాదు. ఎంతోమంది యువతులకు ప్రేరణగా నిలిచే విజయం. ముఖ్యంగా క్రీడల్లో అమ్మాయిలు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇలాంటి విజయాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. అంతర్జాతీయ స్థాయి క్రీడా వేదికపై అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా చికిత తన ప్రతిభను చాటుకున్నారు. ఆమె సాధించిన విజయాన్ని అభినందిస్తూ నీతా అంబానీ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
“You make all girls so proud. You are going to be an inspiration for so many girls of our country and around the world.”
Reliance Foundation, Founder and Chairperson Mrs. Nita Ambani applauds the performance of golden girl Chikitha Taniparthi as the Asian Games 2026. pic.twitter.com/hSGNISrNdz— Nita Mukesh Ambani (@NitaMukeshAmban) October 3, 2026


