breaking news
generated
-
పిల్ల కాల్వలతోనూ విద్యుత్తు.. కేరళ సర్కారు వినూత్న ఆలోచన
కరెంట్..! విద్యుదయస్కాంత తరంగాలను.. అదే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని కట్ చేస్తే కరెంటు ఉత్పత్తి అవుతుందని మనం చదువుకున్నాం. జలవిద్యుత్తు, థర్మల్ విద్యుత్తు, అణు విద్యుత్తు, సౌరవిద్యుత్తు గురించి మనకు తెలుసు. జల విద్యుదుత్పత్తికి నదులపై ఆనకట్టలు అవసరం. కానీ.. ఇవేమీ లేకుండానే కేరళ సర్కారు పిల్ల కాల్వలతో కూడా స్థానిక జనాభాకు సరిపడా విద్యుత్తును ఉత్పత్తి చేసే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పిల్లకాల్వలతో విద్యుత్తును ఎలా ఉత్పత్తి చేస్తారని అనుకుంటున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే.. చదివేయండి..కేరళ రాష్ట్రం.. భారత్‌లోనే సామ్యవాద భావజాలాలను మెండుగా కలిగి ఉన్న ప్రాంతం. అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం..! పేదరికానికి చరమగీతం పాడి.. ఐక్య రాజ్య సమితి మన్ననలు పొందిన రాష్ట్రం..! మహిళలకు నెలసరి సెలవులు.. సమానత్వ భావజాలంతో ముందుకు దూసుకుపోతున్న రాష్ట్రం..! సంక్షేమంలోనూ.. ముఖ్యంగా ప్రజలకు విద్య, వైద్యం అందడంలో కేరళను మించాలంటే.. ఇతర రాష్ట్రాలకు దాదాపుగా అసాధ్యమే..! అలాంటి కేరళ రాష్ట్రం విద్యుదుత్పత్తిలోనూ వినూత్నంగా ముందుకు వెళ్లింది. పిల్లకాల్వలపైనా జలవిద్యుత్తు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది.కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు కన్నిమారి వంతెన సమీపంలో ఉన్న ఓ చిన్న కాల్వపై ప్రయోగాత్మకంగా విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. ఈ చిన్న ప్రాజెక్టుతో స్థానికులకు నీటిసరఫరాతో పాటు.. విద్యుత్తు అందుతోంది. పౌరులకు నీరు-వెలుగులను అందించే ఈ పైలట్ ప్రాజెక్టు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. విద్యుదుత్పత్తికి ఉవ్వెత్తున ప్రవహించే భారీ జలపాతాల మాదిరి నీరు అవసరం లేదని ఈ ప్రాజెక్టు నిరూపించింది. పాలక్కాడ్ జిల్లా సరిహద్దు గ్రామం వండితవళం సమీపంలోని పట్టంచేరి పంచాయతీ ఈ ఘనతకు కేంద్ర బిందువైంది.ఒక కాల్వ ద్వారా 100 కుటుంబాలకు విద్యుత్తును అందించాలనే లక్ష్యంతో కేఎస్ఈబీ ఏడాది క్రితం ఈ ప్రాజెక్టును చేపట్టింది. అయితే.. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైనా.. కేంద్రం నుంచి దీనికి పూర్తిస్థాయిలో సాంకేతిక అనుమతులు రావాల్సి ఉంది. ఒకవేళ కేంద్రం పచ్చజెండా ఊపితే.. కేరళ వ్యాప్తంగా ఈ తరహా ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. మారుమూల ప్రాంతాల్లోనూ కరెంటు కొరత అనేది లేకుండా చేయడమే కేరళ సర్కారు ప్రధానోద్దేశం. నిజానికి కేరళలో వాతావరణం పూర్తి భిన్నంగా ఉంటుంది. కొండప్రాంతాలు ఎక్కువగా ఉండడం వల్ల.. సౌరవిద్యుత్తు సాధ్యం కాదు. దీంతో.. పిల్లకాల్వల ద్వారా విద్యుదుత్పత్తి అక్కడి మారుమూల ప్రాంతాలకు ఆశాజ్యోతిగా నిలుస్తోంది.పిల్ల కాల్వలపై విద్యుదుత్పత్తి ఎలా సాధ్యమవుతుంది? పెద్దపెద్ద హైడల్ పవర్ జనరేషన్ కేంద్రాల వద్ద ఉన్నట్లుగానే.. సూక్ష్మ వ్యవస్థలను పిల్లకాల్వలపై ఏర్పాటు చేశారు. అంటే.. పెద్ద ప్రాజెక్టుల వద్ద జనరేషన్ హౌస్ ఉన్నట్లే.. ఇక్కడ 10 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న చిన్న జనరేషన్ సెటప్‌ను ఏర్పాటు చేశారు. దాని నుంచి నేరుగా గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. పవర్ జనరేషన్ తర్వాత ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వంటివి సంప్రదాయ పద్ధతుల్లోనే కేఎస్ఈబీ చేపట్టింది.3.5 క్యూబిక్ మీటర్ల నీటి ప్రవాహం.. అంటే.. సెకనుకు 3,500 లీటర్ల మేర నీటి ప్రవాహం ఉంటే.. రోజుకు సమీపంలోని 100 కుటుంబాలకు సరిపడా జలవిద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని కేఎస్ఈబీ ఇంజనీర్లు చెబుతున్నారు. ఈ చర్య వల్ల మారుమూల ప్రాంతాల్లో స్థిరమైన వోల్టేజీతో నాణ్యమైన విద్యుత్తును అందజేయవచ్చంటున్నారు. పిల్లకాల్వల ద్వారా ఏడాదంతా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని వివరిస్తున్నారు.పైలట్ ప్రాజెక్టుకు అయిన వ్యయం కేవలం 23 లక్షల రూపాయలేనని పేర్కొంటున్నారు. ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు కావడంతో.. నిత్యం ఇంజినీరింగ్ సాంకేతిక బృందం దీనిని పర్యవేక్షిస్తోందని చెబుతున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టుకు పర్యావరణ, సాంకేతిక అనుమతులు వస్తే.. కేరళలోని మిగతా ప్రాంతాల్లోనూ విద్యుత్తు ఉత్పత్తి వేగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు-మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ -
తెలుగు స్టార్ హీరోలంతా కలిసి పార్టీ చేసుకుంటే? (ఫొటోలు)
-
ధోనీ కేరళ వస్తే? ఇది ఏఐ అని చెబితే తప్ప తెలియదు (ఫొటోలు)
-
ట్రంప్ పేరుతో నకిలీ యాప్
బెంగళూరు: సైబర్ నేగరాళ్లు చివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కూడా వదల్లేదు. ఆయన పేరుతో యాప్‌ను రూపొందించి.. 150 మందిని మోసం రూ.కోటి వసూలు చేశారు. ‘ట్రంప్ హోటల్ రెంటల్’పేరుతో యాప్ క్రియెట్ చేసిన స్కామర్లు.. ఇందులో పెట్టుబడులు పెడితే డబ్బు రెట్టింపవుతుందని నమ్మబలికారు. యాప్ చట్టబద్ధమైనదిగా చూపించడానికి ఏఐ జనరేటెడ్ ట్రంప్ వీడియోను ప్రసారం చేశారు. పెట్టుబడి పెట్టిన వారికి బహుమతులు కూడా ఆశ చూపారు. అంతేకాదు.. ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. దీంతో నమ్మిన బెంగళూరు, తమకూరు, మంగళూరు, హవేరి వరకు ప్రజలు యాప్‌లో ఉన్న నంబర్‌కు కాల్ చేసి డబ్బు ఇచ్చారు. 150 మంది కోటికి పైగా పెట్టుబడి పెట్టారు. వీరికి నమ్మకం కలిగించేందుకు స్కామర్లు ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేవారు. కొన్ని రోజులపాటు చిన్నచిన్న బహుమతులు కూడా అందజేశారు. ఆ తరువాత షేర్లు రోజురోజుకూ పెరుగుతున్నట్టుగా డిజిట్స్ మారుస్తూ వారిని మాయ చేశారు. ఆ తరువాత కొంతకాలానికి యాప్‌లో ఉన్న నంబర్‌కు కాల్ చేస్తే స్పందన లేదు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించారు. ఒక్క హవేరీలోనే 15 మందికి పైగా మోసపోయారని పోలీసు అధికారులు వెల్లడించారు. -
సన్నాఫ్ విరాట్ కోహ్లీ
అనుష్క శర్మ ఈ నెల 15న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అబ్బాయికి ‘అకాయ్’ అని పేరు పెట్టినట్లు తెలియజేశాడు విరాట్ కోహ్లీ. అయితే ‘అకాయ్’ ఫొటోను ఎక్కడా షేర్ చేయలేదు. దీంతో ‘అకాయ్’ రూ΄ాన్ని రకరకాలుగా ఊహించుకుంటూ అభిమానులు ఏఐ జెనరేటెడ్ ఫొటోలను క్రియేట్ చేశారు. అకాయ్‌ను విరాట్ ఎత్తుకున్నట్లు, విరాట్–అనుష్కలు అకాయ్‌తో ఆడుకుంటున్నట్లు... ఇలా రకరకాలుగా క్రియేట్ చేశారు. ‘అకాయ్ ఫొటో షేర్ చేయకుండా విరాట్ కోహ్లీ మంచి పని చేశాడు. చేసి ఉంటే ఇంత అద్భుతమైన చిత్రాలను చూసి ఉండేవాళ్లం కాదు’ అంటూ నెటిజనులు ప్రశంసల జల్లు కురిపించారు. ప్రశంసల వర్షం ఒక కోణం అయితే... సాంకేతిక ఆసక్తి మరో కోణం. ‘మీరు ఉపయోగించిన ఏఐ టూల్స్ గురించి వివరంగా తెలుసుకోవాలని ఉంది’ అంటూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. -
ఇక సొంతంగానే యూఏఎన్: ఈపీఎఫ్ఓ
న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి(ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్) సంస్థ తమ చందాదారుల కోసం కొత్త సౌకర్యాన్ని శుక్రవారం అందుబాటులోకి తీసుకువచ్చింది. సార్వత్రిక ఖాతా సంఖ్య(యూఏఎన్)ను ఉద్యోగులు ఇకపై సొంతంగా ఆన్లైన్లో పొందవచ్చు. ఉద్యోగాలు మారినా యూఏఎన్ ఒకటే ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు యూఏఎన్‌ను పొందాలంటే తమ యాజమాన్యం ద్వారా పొందాల్సి వచ్చేది. ఇకపై ఉద్యోగులు ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ ద్వారా తామే యూఏఎన్‌ను జనరేట్ చేసుకోవచ్చు. అలాగే, 65 లక్షల పెన్షన్ ఖాతాదారులకు కూడా ఈపీఎఫ్ఓ మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వారు తమ పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌ను ఇకపై డిజీలాకర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. భవిష్య నిధి సంస్థ 67వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ ఈ సౌకర్యాలను ప్రారంభించారు. -
లోయరు సీలేరు ప్రాజెక్టుల్లో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభం
మోతుగూడెం : లోయరు సీలేరు విద్యు™Œ™త్ ప్రాజెక్టులోని డొంకరాయి, పొల్లూరు జల విద్యుత్ కేంద్రాల్లో నెల రోజుల తర్వాత తిరిగి విద్యుదుత్పత్తి ప్రారంభించినట్టు సీలేరు కాంప్లెక్స్ ముఖ్య ఇంజినీర్ ఎల్ మోహన్‌రావు తెలిపారు. ఈ నెల నాలుగో తేదీ నుంచి డొంకరాయి పవర్‌కెనాల్ అత్యవసర మరమ్మతు పనుల నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసిన సంఘటన తెలిసిందే. పవర్‌కెనాల్ మరమ్మతులు పూర్తి కావడంతో బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి డొంకరాయి మినీ పవర్‌హౌస్‌లో 25 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. విద్యుదుత్పత్తి ఆనంతరం విడుదలైన నీరు డొంకరాయి వపర్‌కెనాల్ ద్వారా ఫోర్‌బే జలాశయానికి చేరుతుంది. ఈ నీటితో పొల్లూరు జల విద్యుత్కేంద్రంలో బుధవారం రాత్రి హైదరాబాద్ విద్యుత్ సంస్థ అధికారుల ఆదేశాల మేరకు విద్యుదుత్పత్తి ప్రారంభించినట్టు ఆయన తెలిపారు.


