ట్రంప్‌ పేరుతో నకిలీ యాప్‌  | President Donald Trump Is Facing Criticism After Posting An AI-generated Video, More Details Inside | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ పేరుతో నకిలీ యాప్‌ 

May 26 2025 6:38 AM | Updated on May 26 2025 10:07 AM

 President Trump is facing criticism after posting an AI-generated video

150 మంది నుంచి రూ.కోటి వసూలు 

బెంగళూరు: సైబర్‌ నేగరాళ్లు చివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను కూడా వదల్లేదు. ఆయన పేరుతో యాప్‌ను రూపొందించి.. 150 మందిని మోసం రూ.కోటి వసూలు చేశారు. ‘ట్రంప్‌ హోటల్‌ రెంటల్‌’పేరుతో యాప్‌ క్రియెట్‌ చేసిన స్కామర్లు.. ఇందులో పెట్టుబడులు పెడితే డబ్బు రెట్టింపవుతుందని నమ్మబలికారు. యాప్‌ చట్టబద్ధమైనదిగా చూపించడానికి ఏఐ జనరేటెడ్‌ ట్రంప్‌ వీడియోను ప్రసారం చేశారు. పెట్టుబడి పెట్టిన వారికి బహుమతులు కూడా ఆశ చూపారు. అంతేకాదు.. ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. 

దీంతో నమ్మిన బెంగళూరు, తమకూరు, మంగళూరు, హవేరి వరకు ప్రజలు యాప్‌లో ఉన్న నంబర్‌కు కాల్‌ చేసి డబ్బు ఇచ్చారు. 150 మంది కోటికి పైగా పెట్టుబడి పెట్టారు. వీరికి నమ్మకం కలిగించేందుకు స్కామర్లు ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేవారు. కొన్ని రోజులపాటు చిన్నచిన్న బహుమతులు కూడా అందజేశారు. ఆ తరువాత షేర్లు రోజురోజుకూ పెరుగుతున్నట్టుగా డిజిట్స్‌ మారుస్తూ వారిని మాయ చేశారు. ఆ తరువాత కొంతకాలానికి యాప్‌లో ఉన్న నంబర్‌కు కాల్‌ చేస్తే స్పందన లేదు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీస్‌ స్టేషన్లను ఆశ్రయించారు. ఒక్క హవేరీలోనే 15 మందికి పైగా మోసపోయారని పోలీసు అధికారులు వెల్లడించారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement