దుబాయ్: యూఏఈ లాటరీ లక్కీ డే డ్రాలో ఒక విజేత ఏకంగా 50 లక్షల దిర్హమ్‌లు (సుమారు రూ.13 కోట్లు) గెలుచుకున్నారు. శనివారం (అక్టోబర్ 3, 2026) నిర్వహించిన 261003వ డ్రాలో ఇది రెండో బహుమతి. గ్రాండ్ ప్రైజ్ అయిన 3 కోట్ల దిర్హమ్‌లను మాత్రం ఎవరూ గెలుచుకోలేకపోయారు. తాజా డ్రాలో పాల్గొన్నవారిలో పలువురు వివిధ కేటగిరీల్లో నగదు బహుమతులను సొంతం చేసుకున్నారు.
విజేత సంఖ్యలు ఇవే..
తాజా లక్కీ డే డ్రాలో డేస్ విభాగంలో 12, 17, 4, 5, 18, 14 నంబర్లు విజేత సంఖ్యలుగా నిలిచాయి. నెలల విభాగంలో 10 నంబర్ వచ్చింది. మొత్తం ఆరు డేస్ నంబర్లను సరిగ్గా సరిపోల్చిన ఒక విజేత 50 లక్షల దిర్హమ్‌ల రెండో బహుమతిని గెలుచుకున్నారు. ఆరు డేస్ నంబర్లతో పాటు నెలల నంబర్‌ను కూడా సరిగ్గా సరిపోల్చిన విజేత ఎవరూ లేకపోవడంతో 3 కోట్ల దిర్హమ్‌ల జాక్‌పాట్ బహుమతి ఎవరికీ దక్కలేదు.
ముగ్గురికి చెరో 50 వేల దిర్హమ్‌లు
ఇక లక్కీ ఛాన్స్ ఐడీ విభాగంలో ముగ్గురు విజేతలు (CU7185090, AE0396336, BP4042367) ఒక్కొక్కరు 50,000 దిర్హమ్‌ల చొప్పున గెలుచుకున్నారు. ఇక డేస్ విభాగంలోని ఐదు నంబర్లతో పాటు నెలల నంబర్‌ను సరిపోల్చిన మరో విజేతకు 1 లక్ష దిర్హమ్‌ల మూడో బహుమతి లభించింది. అంతేకాకుండా 54 మంది విజేతలు చెరో 1,000 దిర్హమ్‌లు, 7,966 మంది తలా 100 దిర్హమ్‌లు గెలుచుకున్నారు. తాజా డ్రాలో అన్ని కేటగిరీలను కలిపి మొత్తం 8,025 మంది బహుమతులు అందుకున్నారు.
అక్టోబర్ 7న తదుపరి డ్రా
లక్కీ డే తదుపరి డ్రా అక్టోబర్ 7న బుధవారం నిర్వహించనున్నారు. ఈ డ్రాలో మరోసారి 3 కోట్ల దిర్హమ్‌ల గ్రాండ్ ప్రైజ్‌తో పాటు ఇతర నగదు బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుంది. లాటరీ నిర్వాహకులు వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం వారానికి రెండుసార్లు డ్రాలు నిర్వహిస్తున్నారు.


