breaking news
Lucky winners
-
ఒక్కరికే రూ.13 కోట్లు.. యూఏఈ లాటరీలో అదృష్టం!
దుబాయ్: యూఏఈ లాటరీ లక్కీ డే డ్రాలో ఒక విజేత ఏకంగా 50 లక్షల దిర్హమ్లు (సుమారు రూ.13 కోట్లు) గెలుచుకున్నారు. శనివారం (అక్టోబర్ 3, 2026) నిర్వహించిన 261003వ డ్రాలో ఇది రెండో బహుమతి. గ్రాండ్ ప్రైజ్ అయిన 3 కోట్ల దిర్హమ్లను మాత్రం ఎవరూ గెలుచుకోలేకపోయారు. తాజా డ్రాలో పాల్గొన్నవారిలో పలువురు వివిధ కేటగిరీల్లో నగదు బహుమతులను సొంతం చేసుకున్నారు.విజేత సంఖ్యలు ఇవే..తాజా లక్కీ డే డ్రాలో డేస్ విభాగంలో 12, 17, 4, 5, 18, 14 నంబర్లు విజేత సంఖ్యలుగా నిలిచాయి. నెలల విభాగంలో 10 నంబర్ వచ్చింది. మొత్తం ఆరు డేస్ నంబర్లను సరిగ్గా సరిపోల్చిన ఒక విజేత 50 లక్షల దిర్హమ్ల రెండో బహుమతిని గెలుచుకున్నారు. ఆరు డేస్ నంబర్లతో పాటు నెలల నంబర్‌ను కూడా సరిగ్గా సరిపోల్చిన విజేత ఎవరూ లేకపోవడంతో 3 కోట్ల దిర్హమ్ల జాక్‌పాట్ బహుమతి ఎవరికీ దక్కలేదు.ముగ్గురికి చెరో 50 వేల దిర్హమ్లుఇక లక్కీ ఛాన్స్ ఐడీ విభాగంలో ముగ్గురు విజేతలు (CU7185090, AE0396336, BP4042367) ఒక్కొక్కరు 50,000 దిర్హమ్ల చొప్పున గెలుచుకున్నారు. ఇక డేస్ విభాగంలోని ఐదు నంబర్లతో పాటు నెలల నంబర్‌ను సరిపోల్చిన మరో విజేతకు 1 లక్ష దిర్హమ్ల మూడో బహుమతి లభించింది. అంతేకాకుండా 54 మంది విజేతలు చెరో 1,000 దిర్హమ్లు, 7,966 మంది తలా 100 దిర్హమ్లు గెలుచుకున్నారు. తాజా డ్రాలో అన్ని కేటగిరీలను కలిపి మొత్తం 8,025 మంది బహుమతులు అందుకున్నారు.అక్టోబర్ 7న తదుపరి డ్రాలక్కీ డే తదుపరి డ్రా అక్టోబర్ 7న బుధవారం నిర్వహించనున్నారు. ఈ డ్రాలో మరోసారి 3 కోట్ల దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్‌తో పాటు ఇతర నగదు బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుంది. లాటరీ నిర్వాహకులు వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం వారానికి రెండుసార్లు డ్రాలు నిర్వహిస్తున్నారు. -
ఇక కిక్కే కిక్కు..
- లక్కీ విజేతలు ఖరారు.. - 149 షాపులకు 974 దరఖాస్తులు - 25 దుకాణాల వైపు చూడని వ్యాపారులు - సింగిల్ టెండర్లపై 35 దుకాణాలు - రాత్రి వరకూ కొనసాగిన లక్కీ డ్రా ఆదిలాబాద్ క్రైం : జిల్లాలోని 174 మద్యం దుకాణాలకు నిర్వహించిన టెండర్ల విజేతలను ప్రకటించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పి.జనార్దన్‌రెడ్డి గార్డెన్లో జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఎస్ఎస్ రాజ్ లక్కీడ్రా ప్రారంభించగా.. ప్రక్రియ రాత్రి వరకూ కొనసాగింది. టెండర్ దారులతో సందడి నెలకొంది. ఆదిలాబాద్ ఏఎస్పీ జోయల్‌డేవిస్, టూటౌన్ సీఐ నారాయణ భద్రతను పర్యవేక్షించారు. జిల్లాలోని 174 గాను 149 దుకాణాలకు అధికారులు టెండర్లు ఖరారు చేశారు. నూతన మద్యం పాలసీ ద్వారా మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించేందుకు ప్రభుత్వం ఈనెల 16 నుంచి దరఖాస్తులు స్వకరించింది. మొత్తం 174 దుకాణాలకు 974 దరఖాస్తులు దాఖలయ్యాయి. 25 దుకాణాల కోసం ఎవరూ ముందుకు రాలేదు. 149 దుకాణాల్లో 35 దుకాణాలకు ఒక్కో దరఖాస్తు రాగా 114 దుకాణాలకు పోటాపోటీగా టెండర్లు వేశారు. ఇదిలా ఉంటే.. మొదటి నుంచీ మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న వారికి కాకుండా కొత్తవారిని ఈసారి అదృష్టం వరించింది. బెజ్జూర్‌లోని మద్యం దుకాణానికి అత్యధికంగా 44 దరఖాస్తులు రాగా.. ఆదిలాబాద్‌లోని ఎన్టీఆర్ చౌక్‌లోని దుకాణానికి 42 వచ్చాయి. ఆదిలాబాద్ బస్టాండ్ వద్ద ఉన్న దుకాణానికి 32, ధస్నాపూర్లోని మద్యం దుకాణానికి 24 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 42 దరఖాస్తులు వచ్చిన ఎన్టీఆర్ చౌక్‌లోని మద్యం దుకాణాన్ని లాటరీ ద్వారా సుధావిలాస్రెడ్డి దక్కించుకున్నారు. జిల్లాలోనే అత్యధికంగా 44 దరఖాస్తులు వచ్చిన బెజ్జూరు దుకాణాన్ని సంతోష్జైస్వాల్ చేజిక్కించుకున్నారు. సింగిల్ టెండర్లు దక్కించుకున్న మహిళలు.. జిల్లాలోని 35 దుకాణాలకు సింగిల్ టెండర్లు దాఖలయ్యాయి. ఇందులో ఇద్దరు మహిళలకు అవకాశం దక్కింది. ఇచ్చోడ గెజిట్ నెం.57 షాపును ఎ.పార్వతి, ఆసిఫాబాద్ ఎక్స్‌రోడ్ గెజిట్ నెం.65 షాపును జాదవ్ విమలాబాయిలకు కేటాయించారు. టెండర్‌దారుల ఆందోళన కాగా.. లక్కీ డ్రా ప్రారంభమైన తర్వాత టెండర్‌దారులు ఆందోళనకు దిగారు. టెండర్ దక్కించుకున్న వారందరూ 1/3 వంతు డబ్బులు కట్టాలని అధికారులు ప్రకటించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి నిబంధనలు చెప్పలేదని, ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బులు కట్టాలని చెప్పడమేంటని ప్రశ్నించారు. ఎంతో దూరం నుంచి వచ్చిన తాము వెంట డబ్బు తెచ్చుకోలేదని చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. డబ్బులు తప్పనిసరిగా కట్టాల్సిందేనని తేల్చడంతో టెండర్‌దారులు ఇబ్బందులు పడ్డారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శివరాజ్, ఆదిలాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.అనిత, మంచిర్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.


